Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andarivaadu Movie: తస్సాదియ్యా.. అసలేం మారలేదు గురూ.. చిరంజీవితో నటించిన ఈ హీరోయిన్ ఏం చేస్తుందంటే..

ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇప్పుడు ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా విశ్వంభర. అలాగే మన శంకరవరప్రసాద్ గారు చిత్రంలోనూ నటిస్తున్నారు. ఈ రెండు చిత్రాలు త్వరలోనే అడియన్స్ ముందుకు రానున్నాయి. వీటితోపాటు మరికొన్ని కొత్త ప్రాజెక్ట్స్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

Andarivaadu Movie: తస్సాదియ్యా.. అసలేం మారలేదు గురూ.. చిరంజీవితో నటించిన ఈ హీరోయిన్ ఏం చేస్తుందంటే..
Rimi Sen
Rajitha Chanti
|

Updated on: Sep 25, 2025 | 11:49 AM

Share

సాధారణంగా తెలుగు సినిమా ప్రపంచంలోకి ఎంతో మంది తారలు అడుగుపెట్టి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తక్కువ సమయంలోనే విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నారు. వరుస సినిమాలతో స్టార్ డమ్ సంపాదించుకున్న హీరోయిన్స్.. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లోనూ రాణిస్తున్నారు. మరికొందరు మాత్రం ఒకటి రెండు చిత్రాలతోనే పాపులర్ అయ్యారు. కానీ ఆ తర్వాత ఊహించని విధంగా ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ సైతం ఆ జాబితాలోకి చెందినవారే. తెలుగులో ఒక్క సినిమాతో విపరీతమైన పాపులారిటీని సొంతం చేసుకుంది. కానీ ఆ తర్వాత మరో ప్రాజెక్ట్ చేయలేదు. ఆమె పేరు రిమీ సేన్. ఈ పేరు చెబితే గుర్తుపట్టలేరు. అందరివాడు మూవీ హీరోయిన్ అంటే ఠక్కున గుర్తుపట్టేస్తారు.

ఇవి కూడా చదవండి : Tollywood : అబ్బబ్బో.. సీరియల్లో అమాయకంగా.. నెట్టింట పిచ్చెక్కించేలా.. హీరోయిన్స్ సైతం దిగదుడుపే..

ఇవి కూడా చదవండి

మెగాస్టార్ చిరంజీవి డ్యూయల్ రోల్ లో నటించిన సినిమా అందరివాడు. శ్రీనువైట్ల దర్శకత్వం వహించిన ఈ సినిమా 2005 లో విడుదలైంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇందులో టబు, రిమీ సేన్ హీరోయిన్లుగా నటించగా.. ఎప్పటిలాగే ఇందులో తనదైన కామెడీతో అలరించారు. అయితే ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది రిమీ సేన్. హీరోయిన్ అయినా మొదట్లోనే కాస్త నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించింది. చిరంజీవి, రిమీ సేన్ మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

ఇవి కూడా చదవండి : Bigg Boss 9 Telugu: బిగ్‏బాస్ హౌస్‏లో ఆడపులి.. యూత్‏కు తెగ నచ్చేస్తోన్న కంటెస్టెంట్..

ఈ సినిమా తర్వాత మరో తెలుగు మూవీ చేయలేదు. కానీ హిందీలో మాత్రం వరుస సినిమాలతో అలరించింది. రిమీ సేన్ అసలు పేరు సుభమిత్ర సేన్. కోల్ కతాకు చెందిన ఈ బ్యూటీ నటనపై ఆసక్తితో చదువు పూర్తికాగానే ముంబై వెళ్లింది. అక్కడ అవకాశాల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది. అమీర్ ఖాన్ తో కోకా కోలా యాడ్ చేసింది. ఆ తర్వాత తెలుగులో ఇదే నా మొదటి ప్రేమలేఖ చిత్రంలో నటించింది.

హిందీలో ధూమ్, క్యోన్ కి, గరం మసాల, గోల్ మాల్ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. అలాగే 2015లో బిగ్ బాస్ రియాల్టీ షోలో పాల్గొంది. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు ఈ అమ్మడు హిందీలో సినిమాలు, సీరియల్స్ చేస్తుంది. అలాగే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం గ్లామరస్ ఫోటోస్ షేర్ చేస్తుంది. ఇప్పుడు ఈ బ్యూటీఫోటోస్ చూసి షాకవుతున్నారు ఫ్యాన్స్. అప్పటికీ ఇప్పటికీ ఏమాత్రం మారలేదంటూ కామెంట్స్ చేస్తున్నారు.

View this post on Instagram

A post shared by Rimi Sen (@subhamitra03)

ఇవి కూడా చదవండి : Megastar Chiranjeevi: అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఆ తర్వాత చిరు చెల్లెలిగా నటించిన ఏకైక హీరోయిన్.. ఇప్పుడు బుల్లితెరపై..