AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mani Sharma : ఒక్కడు, ఇంద్ర సినిమాల్లో ఆ రెండు పాటలు వేరేలెవల్.. అసలు విషయం చెప్పిన మణిశర్మ..

సాధారణంగా తెలుగు సినిమా ప్రపంచంలో సాంగ్స్ ప్రాధాన్యత గురించి చెప్పక్కర్లేదు. సంవత్సరాలు గడిచినప్పటికీ కొన్ని పాటలు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోతాయి. అలాగే అద్భుతమైన మ్యూజిక్ అందించి సినీరంగంలో తమదైన ముద్ర వేసిన సంగీత దర్శకులు చాలా మంది ఉన్నారు. అందులో మణి శర్మ ఒకరు. తాజాగా తన సినీప్రయాణం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

Mani Sharma : ఒక్కడు, ఇంద్ర సినిమాల్లో ఆ రెండు పాటలు వేరేలెవల్.. అసలు విషయం చెప్పిన మణిశర్మ..
Mani Sharma
Rajitha Chanti
|

Updated on: Mar 14, 2026 | 2:12 PM

Share

తెలుగు సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన సంగీత దర్శకుడు మణిశర్మ. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన సుదీర్ఘ సంగీత ప్రయాణం, క్రియేటివిటీ వెనుక ఉన్న ఆలోచనలను పంచుకున్నారు. ప్రస్తుత తెలుగు సంగీత ప్రపంచం చాలా ఉత్సాహంగా ఉందని, ప్రతిరోజూ కొత్త సంగీత దర్శకులు వెలుగులోకి వస్తున్నారని అన్నారు. అయితే, కొందరు కంపోజర్లు ఒకే శైలికి పరిమితం కావడం వల్ల రొటీన్‌కు దారితీస్తుందని, ప్రయోగాత్మకత అవసరమని సూచించారు. మణిశర్మ తన కెరీర్‌లో చిరంజీవి, బాలకృష్ణ, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, శ్రీకాంత్ వంటి అగ్ర హీరోలతో పాటు వేణు, రవి వంటి నటుల చిత్రాలకు సంగీతం అందించారు. గుణశేఖర్, జయంత్, గోపాల్, రాఘవేంద్ర రావు, రామ్ గోపాల్ వర్మ వంటి 50 మందికి పైగా దర్శకులతో కలిసి పనిచేయడం తన అనుభవానికి గీటురాయి అని ఆయన పేర్కొన్నారు. తాను నీటిలాంటివాడినని, ఏ పాత్రలోనైనా, ఏ వాతావరణంలోనైనా ఇమిడిపోగలనని ఆయన వివరించారు. ప్రతీ హీరో వ్యక్తిత్వానికి, వారి డ్యాన్స్ మూమెంట్స్‌కు తగ్గట్టుగా ట్యూన్స్‌ను కంపోజ్ చేయడంలో తన నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఉదాహరణకు, పవన్ కళ్యాణ్ కోసం చేసిన అమ్మాయే సన్నగా పాటను బాలకృష్ణకు, మహేష్ బాబు కోసం చేసిన నిన్నా కుట్టేసినాది పాటను వేరొకరికి ఊహించలేమని అన్నారు.

ఎక్కువమంది చదివినవి : Tollywood : నా శరీర ఆకృతి కారణంగా రోజూ నరకం అనుభవిస్తున్నా.. టాలీవుడ్ హీరోయిన్ కామెంట్స్..

సంగీత కంపోజిషన్ కథ, సన్నివేశంపై ఆధారపడి ఉంటుందని అన్నారు. ఇంద్ర చిత్రంలోని బం బం బోలే పాట గురించి వివరిస్తూ, కాశీలో జరిగే సన్నివేశం, హీరో డాన్సర్ , మ్యూజిషియన్ పాత్ర, వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకునే ఈ పాటను కంపోజ్ చేశానని చెప్పారు. లేదంటే కాశీలో పాడే హీరోకు భజన పాట ఇవ్వలేమని, డ్యాన్స్‌కు సరిపడా ట్యూన్స్ అవసరమని తెలిపారు. అలాగే, ఒక్కడు చిత్రంలోని సాహసం పాటకు ఇన్స్పిరేషన్ కూడా ఒక విభిన్నమైన సన్నివేశమే అని వెల్లడించారు. హీరోయిన్‌ను కాపాడి పారిపోతున్న హీరో, ఆ వేగవంతమైన సిట్యుయేషన్‌లో మెలోడీతో కూడిన రిథమిక్ ట్రాక్‌ను ఎలా సృష్టించారో వివరించారు.

ఎక్కువమంది చదివినవి : Actress : మగాళ్ల నుంచి నన్ను నేను కాపాడుకోలేకపోయాను.. టాలీవుడ్ నటి కామెంట్స్ వైరల్..

మణిశర్మ కెరీర్‌లో అనేక అవార్డులు అందుకున్నారు. 1998లో చూడాలని ఉంది చిత్రానికి ఉత్తమ సంగీత దర్శకుడిగా ఫిల్మ్‌ఫేర్, నంది అవార్డులు పొందారు. 2000లో చిరునవ్వుతో, 2003లో ఒక్కడు చిత్రాలకు నంది అవార్డులు గెలుచుకున్నారు. ఒక్కడు చిత్రానికి ఫిల్మ్‌ఫేర్ అవార్డు కూడా దక్కింది. 2005లో అతడు చిత్రానికి ఉత్తమ సంగీత దర్శకుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకున్నారు. 2003లో వచ్చిన బ్లాక్‌బస్టర్ ఒక్కడు ఆయన కెరీర్‌లో 50వ చిత్రం కావడం విశేషం. 2005లో జై చిరంజీవ చిత్రంలో 10 సెకన్ల పాటు అతిథి పాత్రలో నటించారు.

ఎక్కువమంది చదివినవి : Actress : డబ్బు కోసమే అలాంటి సినిమాల్లో నటించా.. ఓపెన్‏గా చెప్పేసిన హీరోయిన్..

ఎక్కువమంది చదివినవి : సీరియల్స్‏లో లక్షల్లో సంపాదన.. శ్మశానంలో ఆరు అడుగుల స్థలం మాత్రమే..

Follow Us