సీరియల్స్‌లో లక్షల్లో సంపాదన.. శ్మశానంలో ఆరు అడుగుల స్థలం మాత్రమే..
Rajitha Chanti
Pic credit - Instagram
11 March 2026
ప్రస్తుతం సీరియల్ బ్యూటీస్ లైఫ్ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోవడం లేదు. అటు సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మలకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది.
సీరియల్స్ ద్వారా ఒక్క ఎపిసోడ్ కోసం భారీగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. అలాగే ఇప్పుడిప్పుడే సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషిస్తున్నారు.
బ్రహ్మముడి సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది దీపిక రంగరాజు. ఈ అమ్మడు తన చలాకీతనం, నటనతో జనాల హృదయాలు గెలుచుకుంది.
తమిళనాడుకు చెందిన ఈ అమ్మడు బీటెక్ పూర్తి చేసి.. ఆ తర్వాత ఓ తమిళ ఛానల్లో న్యూస్ ప్రజెంటర్ గా కెరీర్ స్టార్ చేసి టీవీలోకి అడుగుపెట్టింది.
ఆ తర్వాత తమిళంలో చిత్రిరమ్ పెసుతాడి అనే సీరియల్ ద్వారా బుల్లితెరకు నటిగా పరిచయమైంది. ఆ తర్వాత తమిళంలో పలు సీరియల్స్ చేసింది.
2023లో బ్రహ్మముడి సీరియల్ ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. ఈ సీరియల్ సూపర్ హిట్ కావడంతో తెలుగులో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది.
కొన్ని రోజుల క్రితం ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దీపికా రంగరాజు మాట్లాడుతూ తనకు సొంత ఇల్లు లేదని.. చెన్నైలో సొంత ఇల్లు కోరిక అని తెలిపింది.
తనకు శ్మశానంలో ఆరు అడుగుల స్థలం మాత్రమే ఉందని.. అది తప్ప తనకు ఇంకేం ఆస్తిపాస్తులు లేవని.. తాను కోట్లలో సంపాదించలేదని తెలిపింది.
మరిన్ని వెబ్ స్టోరీస్
అందం కోసం నేను ఏం తింటానంటే.. అసలు విషయం చెప్పిన నిధి అగర్వాల్..
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్