AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jabardasth Indraja: ఒక్కో ఎపిసోడ్‌కు అన్ని లక్షలా? జబర్దస్త్ జడ్జీగా ఇంద్రజ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

ఒకప్పటి ఫేమస్ హీరోయిన్ ఇంద్రజ సెకెండ్ ఇన్నింగ్స్ సక్సెస్ ఫుల్ గా కొనసాగిస్తోంది. ఓవైపు సినిమాల్లో సహాయక నటి పాత్రలు పోషిస్తూనే మరోవైపు జబర్దస్త్, శ్రీదేవీ డ్రామా కంపెనీ వంటి టీవీ షోల్లోనూ మెరుస్తోందీ అందాల తార. మరి వీటి కోసం ఇంద్రజ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలుసా?

Jabardasth Indraja: ఒక్కో ఎపిసోడ్‌కు అన్ని లక్షలా? జబర్దస్త్ జడ్జీగా ఇంద్రజ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
Jabardasth Indraja
Basha Shek
|

Updated on: Jul 16, 2026 | 7:55 AM

Share

ఒకప్పుడు టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లోనూ స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది ఇంద్రజ. స్టార్ హీరోలతో కలిసి సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించిందీ ముద్దుగుమ్మ. అయితే పెళ్లి, పిల్లల తర్వాత క్రమంగా సినిమాలకు విరామం ఇచ్చేసింది. ఇక చాలా మంది హీరోయిన్లలాగే ఇంద్రజ కూడా సెకెండ్ ఇన్నింగ్స్ షురూ చేసింది. సినిమాల్లో తల్లి, అత్త వంటి సపోర్టింగ్ రోల్స్ చేస్తూనే బుల్లితెరపైనా మెరిసింది. జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలకు ఇంద్రజ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ముఖ్యంగా జబర్దస్త్ షోకు జడ్జిగా ఈ సీనియర్ హీరోయిన్ బాగా సెట్టయిపోయిందని చెప్పవచ్చు. ఎందుకంటే జబర్దస్త్ ప్రారంభమైనప్పటి నుంచి మొన్నటివరకు రోజా నే ఈ షోకు జడ్జ్ గా ఉన్నారు. అయితే రాజకీయాల్లో బిజీ కావడంతో ఆమె ఈ షో నుంచి వెళ్లిపోయారు. రోజా తర్వాత చాలా మంది ముద్దుగుమ్మలు ఈ షోకు జడ్జ్ లుగా వచ్చారు. ఖుష్బూ, సంఘవి.. ఇలా చాలా మంది వచ్చి వెళ్లిపోయారు. అయితే ఇప్పుడు ఇంద్రజ మాత్రం ఈ జబర్దస్త్ షోకు పర్మినెంట్ జడ్జీగా ఉండిపోయింది. ఈ నేపథ్యంలో ఈ షో కోసం ఆమె ఎంత పారితోషికం తీసుకుంటున్నారన్నది ఆసక్తికరంగా మారింది. ఇన్‌సైడ్ రిపోర్ట్స్ ప్రకారం జబర్దస్త్‌ కోసం ఇంద్రజ భారీ రెమ్యునరేషనే తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఒక్కో ఎపిసోడ్ కు దాదాపు రూ.2.5 లక్షల వరకు పారితోషికం అందుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఈ లెక్కన నెలకి నాలుగు లేదా ఐదు ఎపిసోడ్‌లకు గానూ ఒక రూ.10 లక్షల వరకు ఇంద్రజ తీసుకుంటన్నట్లు సమాచారం. అంటే కేవలం ఈ ఒక్క జబర్దస్త్ కామెడీ షో ద్వారానే ఆమెకు భారీ ఆదాయం సమకూరుతోంది. కాగా మిగతా జడ్జీలతో పోల్చుకుంటే ఇంద్రజపై పెద్దగా నెగెటివిటీ ఉండదు. అలాగే ఆమె క్లీన్ ఇమేజ్ కారణంగా ఫ్యామిలీ ఆడియెన్స్ లో మంచి గుర్తింపు ఉంది. అలాగే ఆమె కరిష్మా, టైమింగ్ కూడా జబర్దస్త్ షోకు బాగా హెల్ప్ అవుతున్నాయి. ఇది క్రమంగా జబర్దస్త్ టీఆర్పీ పెరగడంలోనూ సహాయ పడుతోంది. అందుకే జబర్దస్త్ కోసం ఇంద్రజకు భారీగానే రెమ్యునరేషన్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇక మొదటి నుంచి ఈ షోకు జడ్జీగా వ్యవహరించి ఆపై మధ్యలో వెళ్లిపోయిన నాగబాబు మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం జబర్దస్త్ ప్రొడ్యూసర్లు నాగబాబుకు ఒక్కో ఎపిసోడ్‌కు దాదాపు రూ.5 నుంచి రూ.6 లక్షలు ఇస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఇంద్రజ జబర్దస్త్ తో పాటు శ్రీదేవీ డ్రామా కంపెనీలోనూ సందడి చేస్తోంది. అలాగే సినిమాలు, వెబ్ సిరీసుల్లోనూ మెరుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
మళ్లీ లంచం తీసుకుంటూ దొరికిన మైన్స్ సర్వేయర్
మళ్లీ లంచం తీసుకుంటూ దొరికిన మైన్స్ సర్వేయర్
మరో కొత్త వీడియోలో దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు.. ఈసారి..
మరో కొత్త వీడియోలో దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు.. ఈసారి..
సముద్రంలో చిక్కుకున్న నిపుణులు.. తాళ్ళు తెగిపోవడంతో కలకలం..
సముద్రంలో చిక్కుకున్న నిపుణులు.. తాళ్ళు తెగిపోవడంతో కలకలం..
తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలా..? రైల్వేశాఖ కొత్త రూల్స్
తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలా..? రైల్వేశాఖ కొత్త రూల్స్
నీళ్లు.. నిధులు.. నియామకాలు! తెలంగాణలో మళ్లీ ఉద్యమం నాటి సెగలు!
నీళ్లు.. నిధులు.. నియామకాలు! తెలంగాణలో మళ్లీ ఉద్యమం నాటి సెగలు!
యూట్యూబ్‌ను ఊపేస్తోన్న డీమాన్ పవన్, రీతూ చౌదరీల రొమాంటిక్ సాంగ్
యూట్యూబ్‌ను ఊపేస్తోన్న డీమాన్ పవన్, రీతూ చౌదరీల రొమాంటిక్ సాంగ్
బిర్యానీ ఆకు కేవలం మసాలా కాదు.. ఇంటి శుభానికి ప్రతీకగా ఎందుకు..
బిర్యానీ ఆకు కేవలం మసాలా కాదు.. ఇంటి శుభానికి ప్రతీకగా ఎందుకు..
అరకు అడవిలో అలజడి.. భారీగా పట్టుబడ్డ గంజాయి
అరకు అడవిలో అలజడి.. భారీగా పట్టుబడ్డ గంజాయి
క్రెడిట్ కార్డు తీసుకున్న వ్యక్తి మరణిస్తే బిల్లు ఎవరు కట్టాలి..?
క్రెడిట్ కార్డు తీసుకున్న వ్యక్తి మరణిస్తే బిల్లు ఎవరు కట్టాలి..?
ఆ గిరిజనుల్లో పట్టలేనంత ఆనందం.. ధింసాతో సందడి.. ఎందుకో తెలుసా..!
ఆ గిరిజనుల్లో పట్టలేనంత ఆనందం.. ధింసాతో సందడి.. ఎందుకో తెలుసా..!