AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajamouli: 1000 కోట్ల సినిమాలు తీసే జక్కన్న జేబులో ఒక్క రూపాయి కూడా ఉండదు.. రమా రాజమౌళి చెప్పిన సీక్రెట్

రాజమౌళి ఒక్క సినిమా తీస్తే వందలు, వేల కోట్లు కలెక్షన్లు వస్తాయి. ఆయన కూడా రెమ్యునరేషన్ కింద వందల కోట్లు తీసుకుంటాడు. కానీ ఏదైనా అవసరం వస్తే.. ఈ దర్శక ధీరుడి జేబులో ఒక్క రూపాయి కూడా ఉండదట. ఈ విషయాన్ని జక్కన్న భార్య రమా రాజమౌళినే బయట పెట్టారు.

Rajamouli: 1000 కోట్ల సినిమాలు తీసే జక్కన్న జేబులో ఒక్క రూపాయి కూడా ఉండదు.. రమా రాజమౌళి చెప్పిన సీక్రెట్
Director Rajamouli
Basha Shek
|

Updated on: Nov 18, 2026 | 6:07 PM

Share

తెలుగు సినిమా పరిశ్రమను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాడు దిగ్రేట్ రాజమౌళి. బాహుబలి, బాహుబలి 2, ఆర్ఆర్ఆర్ వంటి పాన్ ఇండియా సినిమాలు తెరకెక్కించి ఇండియన్ సినిమా అంటే టాలీవుడ్ పేరు చెప్పుకునేలా చేశాడు. అంతేకాదు సినిమా రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అందించే ఆస్కార్ ను కూడా మన ముంగిటకు తెచ్చాడు. ఇలా వందల కోట్ల బడ్జెట్ తో సినిమాలు తీసి వేల కోట్ల కలెక్షన్లు రాబట్టే రాజమౌళి నిజ జీవితంలో మాత్రం చాలా సింపుల్ గా ఉంటారట. నిజం చెప్పాలంటే ఏదైనా అవసరమొస్తే రాజమౌళి జేబులో కనీసం ఒక్క రూపాయి కూడా ఉండదట. ఈ వియాన్ని ఆయన సతీమణి రమా రాజమౌళి స్వయంంగా వెల్లడించారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె తన భర్త రాజమౌళికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ‘రాజమౌళి కారు ఎక్కించుకుని బయటకు వెళితే దేనికైనా బిల్లు ఇతరులే కట్టాల్సి వస్తుంది (నవ్వుతూ). సాధారణంగా ఆయన జేబులో డబ్బులు ఉండవు. అందుకే డ్రైవర్ దగ్గరే కొంచెం డబ్బులు, అత్యవసర పరిస్థితుల కోసం ఒక కార్డు ఉంచుతారు. రాజమౌళి తన దగ్గర డబ్బులు ఉంచుకోరు. ఆ విషయం గురించి కూడా పెద్దగా పట్టించుకోరు. అసలు తన వద్ద ఏమున్నాయో ఆయనకు తెలియదు. సాధారణంగా ఆయన అంతగా వేరే చోట్లకి బయటకు వెళ్లరు. అలాంటి అవసరం కూడా రాదు. కానీ అత్యవసర సమయాల కోసమే డ్రైవర్ వద్ద డబ్బులు, కార్డు ఏర్పాటు చేస్తారు’ అని చెప్పుకొచ్చారు రాజమౌళి.

కాగా రాజమౌళి ఒక్కో సినిమాకు కనీసం 100 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటారు. కానీ ఆయన లైఫ్ స్టైల్ చాలా సింపుల్ గా ఉంటుందని చెబుతున్నారు రమా రాజమౌళి. డబ్బులు, కార్డులు వెంట పెట్టుకుని తిరిగే అలవాటు లేదని, హంగులు, ఆర్భాటాలకు దూరంగా ఉంటారని, కేవలం తన పని మీద మాత్రమే జక్కన్న దృష్టి పెడతారంటున్నారు రమా రాజమౌళి. ప్రస్తుతం జక్కన్న కు సంబంధించిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

ఇక సినిమాల విషయానికి వస్తే.. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నారు రాజమౌళి. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి ‘వారణాసి’ సినిమా చేస్తున్నారు. పాన్ వరల్డ్ రేంజ్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంకా చోప్రా హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే మలయాళం సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభ అనే పవర్ ఫుల్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఈమూవీ దాదాపు 1000 నుంచి 1500 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నట్టు సమాచారం. వచ్చే ఏడాది వేసవి కానుకగా ఈ సినిమా రిలీజ్ కానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us