AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gopichand: పెద్ద డైరెక్టర్ అవ్వాల్సినోడు.. కానీ.. గోపీచంద్ అన్నయ్య ఎలా చనిపోయాడో తెలుసా? కేవలం 19 ఏళ్లకే..

దిగ్గజ దర్శకుడు టి. కృష్ణ తనయుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు గోపీచంద్. మాస్ యాక్షన్ సినిమాలతో మ్యాచో స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఈ టాలీవుడ్ హీరో జీవితంలో చాలా విషాదాలున్నాయి. మొదటిది తండ్రి మరణమైతే అంతకు మించింది అన్నయ్య అకాల మరణం.

Gopichand: పెద్ద డైరెక్టర్ అవ్వాల్సినోడు.. కానీ.. గోపీచంద్ అన్నయ్య ఎలా చనిపోయాడో తెలుసా? కేవలం 19 ఏళ్లకే..
Actor Gopichand
Basha Shek
|

Updated on: Jul 14, 2026 | 10:02 PM

Share

ప్రముఖ దర్శకుడు టి. కృష్ణ తనయుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు గోపీచంద్. ‘తొలివలపు’ చిత్రంతో హీరోగా పరిచయమైనప్పటికీ, ‘జయం’, ‘నిజం’, ‘వర్షం’ వంటి చిత్రాలలో విలన్‌గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత మళ్లీ హీరోగా వరుస విజయాలు సాధించాడు. ‘యజ్ఞం’, ‘రణం’, ‘లక్ష్యం’, ‘లౌక్యం’, ‘సాహసం’ ‘జిల్’, ‘గౌతమ్ నంద’, ‘సీటీమార్’, ‘భీమా’, ‘విశ్వం’ తదితర సూపర్ హిట్ సినిమాల్లో కథానాయకుడిగా నటించి టాలీవుడ్‌లో ‘ మాచో స్టార్‌ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఆన్ స్క్రీన్ కానీ, ఆఫ్ స్క్రీన్ కానీ ఎంతో సరదాగా కనిపించే గోపీచంద్ జీవితంలో చాలా మందికి తెలియని రెండు విషాదాలున్నాయి. మొదటిది తండ్రి మరణమైతే. రెండోది సొంత అన్నయ్య అకాల మరణం. తండ్రి చనిపోయిన కొన్నేళ్లకే అన్నయ్య చనిపోవడంతో గోపీచంద్ బాగా కుంగిపోయాడట. టి. కృష్ణ 1986 అక్టోబరు 21న తీవ్ర అనారోగ్యం కారణంగా మరణించారు. అప్పటికి ఆయన వయసు కేవలం 36 సంవత్సరాలు మాత్రమే. అప్పుడు గోపీచంద్ వయసు ఎంతో తెలుసా? కేవలం 8 సంవత్సరాలు. ఇక గోపీచంద్ సోదరడు ప్రేమ చంద్ కూడా తండ్రి బాటలోనే దర్శకుడు కావాలని కలలు కన్నాడు. అలా మొదటి సినిమాను స్టార్ట్ చేసిన కొన్ని రోజులకే అతను కూడా ఓ రోడ్డు ప్రమాదంలో మరణించాడు.

కాగా గోపీచంద్ అన్నయ్య ప్రేమ్ చంద్ మరణం గురించి ప్రముఖ నటుడు మాదాల రవి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు. ‘ అమ్మాయి కాపురం సినిమాకు ప్రేమ్ చంద్ అసిస్టెంట్ డైరెక్టర్. ముత్యాల సుబ్బయ్య దర్శకుడు. ఈ సినిమా షూటింగ్ కోసం ఒక సోడా బండి సెట్ కు రాలేదు. అది టంగుటూరు పక్క నుంచి రావాలి. అప్పుడు ప్రేమ్ చంద్ నేను తీసుకొస్తానని వెళ్లాడు. డ్రైవర్ స్లోగా వెళుతుండడంతో తాను డ్రైవింగ్ చేస్తానన్నాడు. ప్రేమ్ చంద్ డ్రైవింగ్ సీట్ లో కూర్చున్న నిమిషానికే లారీ వచ్చి కారును ఢీ కొట్టింది. దీంతో స్పాట్ లోనే ప్రేమ్ చంద్ చనిపోయాడు’ అని మాదాల రవి చెప్పుకొచ్చారు.

కాగా ఈ దుర్ఘటన సమయంలో గోపీచంద్ రష్యాలో ఇంజనీరింగ్ చేస్తున్నాడు. వీసా సమస్య వల్ల కనీసం అన్నయ్య అంత్యక్రియలకు కూడా రాలేకపోయాడు. ఇలా తన అన్నయ్య, తండ్రి మరణాలతో చాలా కృంగిపోయాడు గోపీచంద్. అయితే కుటుంబం బాధ్యత తనమీదే ఉండడంతో త్వరగా కోలుకుని హీరోగా స్థిరపడ్డాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
మళ్లీ లంచం తీసుకుంటూ దొరికిన మైన్స్ సర్వేయర్
మళ్లీ లంచం తీసుకుంటూ దొరికిన మైన్స్ సర్వేయర్
మరో కొత్త వీడియోలో దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు.. ఈసారి..
మరో కొత్త వీడియోలో దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు.. ఈసారి..
సముద్రంలో చిక్కుకున్న నిపుణులు.. తాళ్ళు తెగిపోవడంతో కలకలం..
సముద్రంలో చిక్కుకున్న నిపుణులు.. తాళ్ళు తెగిపోవడంతో కలకలం..
తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలా..? రైల్వేశాఖ కొత్త రూల్స్
తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలా..? రైల్వేశాఖ కొత్త రూల్స్
నీళ్లు.. నిధులు.. నియామకాలు! తెలంగాణలో మళ్లీ ఉద్యమం నాటి సెగలు!
నీళ్లు.. నిధులు.. నియామకాలు! తెలంగాణలో మళ్లీ ఉద్యమం నాటి సెగలు!
యూట్యూబ్‌ను ఊపేస్తోన్న డీమాన్ పవన్, రీతూ చౌదరీల రొమాంటిక్ సాంగ్
యూట్యూబ్‌ను ఊపేస్తోన్న డీమాన్ పవన్, రీతూ చౌదరీల రొమాంటిక్ సాంగ్
బిర్యానీ ఆకు కేవలం మసాలా కాదు.. ఇంటి శుభానికి ప్రతీకగా ఎందుకు..
బిర్యానీ ఆకు కేవలం మసాలా కాదు.. ఇంటి శుభానికి ప్రతీకగా ఎందుకు..
అరకు అడవిలో అలజడి.. భారీగా పట్టుబడ్డ గంజాయి
అరకు అడవిలో అలజడి.. భారీగా పట్టుబడ్డ గంజాయి
క్రెడిట్ కార్డు తీసుకున్న వ్యక్తి మరణిస్తే బిల్లు ఎవరు కట్టాలి..?
క్రెడిట్ కార్డు తీసుకున్న వ్యక్తి మరణిస్తే బిల్లు ఎవరు కట్టాలి..?
ఆ గిరిజనుల్లో పట్టలేనంత ఆనందం.. ధింసాతో సందడి.. ఎందుకో తెలుసా..!
ఆ గిరిజనుల్లో పట్టలేనంత ఆనందం.. ధింసాతో సందడి.. ఎందుకో తెలుసా..!