OTT Movies: ఎంటర్‌టైన్మెంట్ అద్దిరిపోద్ది.. ఈ వారం థియేటర్లు/ఓటీటీ సినిమాలివే.. ఆ రెండూ డోంట్ మిస్
ప్రస్తుతం థియేటర్లలో లెనిన్ సందడి కనిపిస్తోంది. గత వారం రిలీజైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో రన్ అవుతోంది. ఇక అఖిల్ సినిమాకు పోటీగా ఈ వారం పలు కొత్త సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. అలాగే ఓటీటీల్లోనూ పలు కొత్త సినిమాలు, సిరీస్ లు సందడి చేయనున్నాయి.

ఈ వారం థియేటర్లలోకి కొన్ని ఆసక్తికర సినిమాలు రానున్నాయి. తిరువీర్, ఐశ్వర్యా రాజేశ్ ల ‘ఓ సుకుమారి’, మాధవన్ ‘జీడీఎన్’, సుమంత్ మహేంద్రగిరి వారాహి వదలా, రాజా ది రాజా, ఆపరేషన్ అరుణారెడ్డి తదితర తెలుగు సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. అలానే హాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన లేటెస్ట్ సినిమా ‘ద ఒడిస్సీ’ కూడ ఇదే వీకెండ్ లోనే రాబోతుంది. మరోవైపు ఓటీటీల్లో కూడా ఆసక్తికర సినిమాలు సందడి చేయనున్నాయి. సమంత 100 కోట్ల సినిమా ‘మా ఇంటి బంగారం’, వడ్డే నవీన్ ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు ‘ ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తున్నాయి. వీటితో పాటు సెకండ్ లవ్, రెడీ ఆర్ నాట్ 2 వంటి రియాలటీ షో, డబ్బింగ్ చిత్రాలు కూడా ఇంట్రెస్టింగ్ గాన అనిపిస్తున్నాయి. మరి ఈ వారం ఏయే ఓటీటీలో ఏయే సినిమా రానుందో తెలుసుకుందాం రండి.
నెట్‌ఫ్లిక్స్
- ద హాక్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – జూలై 15
- మీ బిఫోర్ మీ (ఇండోనేసియన్ సినిమా) – జూలై 16
- ద మ్యాప్ ఆఫ్ లాంగింగ్ (స్పానిష్ వెబ్ సిరీస్) – జూలై 17
- ద ఈస్ట్ ప్యాలెస్ (కొరియన్ వెబ్ సిరీస్) – జూలై 17
- డిజైర్ (ఇంగ్లిష్ సినిమా) – జూలై 17
- 23000 లైవ్స్ (జర్మన్ సినిమా) – జూలై 17
- హార్ట్ స్టాపప్ ఫరెవర్ (ఇంగ్లిష్ సినిమా) – జూలై 17
- స్పూకీ ఇన్ లవ్ (కొరియన్ వెబ్ సిరీస్) – జూలై 18
అమెజాన్ ప్రైమ్ వీడియో
- మర్డర్ 101 (ఇంగ్లిష్ డాక్యుమెంటరీ) – జూలై 13
- బ్యాక్ రూమ్స్ (ఇంగ్లిష్ సినిమా) – జూలై 14 (రెంట్)
- రైడ్ ఆర్ డై (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – జూలై 15
జియో హాట్‌స్టార్ ఓటీటీలో..
- సెకండ్ లవ్ (తమిళ రియాలటీ వెబ్ సిరీస్) – జూలై 13
- పవిత్రం (మలయాళ సిరీస్) – జూలై 13
- వుథరింగ్ హైట్స్ (ఇంగ్లీష్ మూవీ) – జూలై 13
- రెడీ ఆర్ నాట్ 2 (తెలుగు డబ్బింగ్ సినిమా) – జూలై 16
- మా ఇంటి బంగారం (తెలుగు మూవీ) – జూలై 17
- టెస్ట్ సబ్జెక్ట్ వీ (హిందీ డాక్యుమెంటరీ) – జూలై 18
జీ5 ఓటీటీలో..
- ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు (తెలుగు సినిమా) – జూలై 17
ఆపిల్ టీవీ ప్లస్
- లక్కీ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – జూలై 15
- ఎమ్ఎక్స్ ప్లేయర్
- రక్తాంచల్ సీజన్ 3 (హిందీ వెబ్ సిరీస్) – జూలై 16
Note: ఇవి కాక వారం కొన్ని ఓటీటీ సంస్థలు అప్పటికప్పుడు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లను ఎలాంటి ముందస్తు ప్రకటనలు లేకుండా స్ట్రీమింగ్ కు తీసుకువచ్చే అవకాశముంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




