AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: తల్లి మళ్లీ పెళ్లి చేసుకుంటే తప్పేంటి? ఓటీటీలోకి విజయ్ ఆంటోని లేటెస్ట్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

బిక్షగాడు సినిమాతో తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు విజయ్ ఆంటోని. తమిళంలో అతను నటించిన ప్రతి సినిమా తెలుగులోనూ రిలీజ్ అవుతోంది. అలా విజయ్ ఆంటోని ప్రధాన పాత్రలో తెరకెక్కిన లేటెస్ట్ సినిమా 'వంద దేవుళ్లు'. బిక్షగాడు సినిమాను తెరకెక్కించిన డైరెక్టర్ శశినే ఈ మూవీకి దర్శకత్వం వహించాడు.

OTT Movie: తల్లి మళ్లీ పెళ్లి చేసుకుంటే తప్పేంటి? ఓటీటీలోకి విజయ్ ఆంటోని లేటెస్ట్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
OTT Movie
Basha Shek
|

Updated on: Jul 12, 2026 | 4:08 PM

Share

బిక్షగాడు లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత హీరో విజయ్ ఆంటోనీ, డైరెక్టర్ శశి కాంబినేషన్‌లో వచ్చిన సినిమా ‘వంద దేవుళ్లు’. (తమిళంలో ‘నూరు సామి’ గా రిలీజైంది). జూన్ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా డీసెంట్ హిట్ గా నిలిచింది. కమర్షియల్ గా వసూళ్లు సాధించకపోయినా కంటెంట్ పరంగా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పొరేషన్, సర్వంత రామ్ క్రియేషన్స్ బ్యానర్స్‌పై విజయ్ ఆంటోని, రామాంజనేయులు జువ్వాజి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. విజయ్ ఆంటోనితో పాటు శ్వాసిక, అజయ్ దిషాన్, లిజోమోల్ జోసే, శక్తి, కావ్య అనిల్, కరుణాస్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన వంద దేవుళ్లు సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ జీ 5 సొంతం చేసుకుంది. జులై చివరి వారంలో కానీ ఆగస్ట్ మొదటి వారంలో కానీ ఈ సినిమా స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉంది. త్వరలోనే అఫీషియల్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు.

ఇవి కూడా చదవండి

అప్పుడెప్పుడో తెలుగులో మా నాన్నకు పెళ్లి అనే సినిమా వచ్చింది.. అందులో శ్రీకాంత్ తన తండ్రి కృష్ణంరాజుకు మరో పెళ్లి చేస్తాడు. ఈ సినిమా కథ కూడా అంతే.. ‘తోడు లేని తల్లికి మళ్లీ పెళ్లి చేస్తే తప్పేంటి’ అనే ఎమోషనల్ పాయింట్ చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. వాసవి (శ్వాసిక)కి 26 ఏళ్లు ఉన్నపుడే భర్త చనిపోతాడు. తన ఇద్దరు కొడుకులను ఒంటరిగా పెంచి పోషిస్తుంది. అయితే ఒంటరి మహిళ కావడంతో ఉళ్లో ఉన్న కొందరూ వాసవితో తప్పుగా ప్రవర్తిస్తుంటారు. దీంతో పిల్లల కోసం ఎన్నో త్యాగాలు చేసిన వాసవి, జీవితంలో తను కూడా మళ్లీ ఇంకో దశ మొదలుపెట్టాలనుకుంటుంది. మళ్లీ పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది. కానీ వాసవి పెద్ద కుమారుడు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తాడు. అలాంటి సమయంలో వాసవి జీవితంలోకి ఏడుకొండలు (విజయ్ ఆంటోనీ) వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందన్నదే వంద దేవుళ్లు సినిమా కథ.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నవారికి శుభవార్త
ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నవారికి శుభవార్త
జాతీయ జెండా కలర్లతో డ్రెస్.. ప్రముఖ హీరోయిన్‌పై నెటిజన్ల ఆగ్రహం
జాతీయ జెండా కలర్లతో డ్రెస్.. ప్రముఖ హీరోయిన్‌పై నెటిజన్ల ఆగ్రహం
భార్యను హత్య చేసి పొదల్లోనే పడేసిన భర్త.. ఒక్క సర్జికల్ స్క్రూతో
భార్యను హత్య చేసి పొదల్లోనే పడేసిన భర్త.. ఒక్క సర్జికల్ స్క్రూతో
హైదరాబాద్‌లో దారుణం.. వివాహిత ఆత్మహత్య
హైదరాబాద్‌లో దారుణం.. వివాహిత ఆత్మహత్య
ఇండియా పోస్ట్ సరికొత్త విప్లవం.. అందుబాటులోకి డాక్సేవా,డాక్మిత్రా
ఇండియా పోస్ట్ సరికొత్త విప్లవం.. అందుబాటులోకి డాక్సేవా,డాక్మిత్రా
గుడ్లు ఉడికించేటప్పుడు ఉప్పు ఎందుకు వేస్తారో తెలుసా?
గుడ్లు ఉడికించేటప్పుడు ఉప్పు ఎందుకు వేస్తారో తెలుసా?
రంజీలో తోపు ప్లేయర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన సెలెక్టర్లు..?
రంజీలో తోపు ప్లేయర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన సెలెక్టర్లు..?
అందుకే ఆ వీడియో చేశా.. అసలు విషయమేంటోచెప్పిన జబర్దస్త్ నవదీప్
అందుకే ఆ వీడియో చేశా.. అసలు విషయమేంటోచెప్పిన జబర్దస్త్ నవదీప్
పీఎం కిసాన్ నిధుల విడుదలపై క్లారిటీ.. అకౌంట్లోకి అప్పుడే..
పీఎం కిసాన్ నిధుల విడుదలపై క్లారిటీ.. అకౌంట్లోకి అప్పుడే..
ప్రతీ పది క్రైముల్లో ఒకటి లవ్ జిహాదీయే..!
ప్రతీ పది క్రైముల్లో ఒకటి లవ్ జిహాదీయే..!