AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: ఓటీటీలోకి రీసెంట్ సూపర్ హిట్ సినిమా.. చూసేటప్పుడు పక్కన కర్చీఫులు పెట్టుకోవాల్సిందే

ఇటీవల చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. గుండెల్ని పిండేసే ప్రేమకథా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా ఆడియెన్స్ ను ముఖ్యంగా యువతను బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా ఇంటర్వెల్ ట్విస్ట్, అలాగే సినిమాలోని కొన్ని ఎమోషనల్ సీన్స్ ఆడియెన్స్ ను కట్టిపడేశాయి.

OTT Movie: ఓటీటీలోకి రీసెంట్ సూపర్ హిట్ సినిమా.. చూసేటప్పుడు పక్కన కర్చీఫులు  పెట్టుకోవాల్సిందే
OTT Movie
Basha Shek
|

Updated on: Jul 10, 2026 | 8:21 PM

Share

ఇటీవల కొన్ని చిన్న సినిమాలు సంచలన విజయాలు సాధిస్తున్నాయి. పెద్ద పెద్ద హీరోలు, స్టార్ హీరోయిన్లు లేకపోయినా కేవలం కంటెంట్ తోనే కాసుల వర్షం కురిపిస్తున్నాయి. అలా ఇటీవల చిన్న సినిమా ట్యాగ్ తో రిలీజైన ఓ సినిమా సంచలన విజయంసాధించింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. గుండెల్ని పిండేసే హృద్యమైన ప్రేమ కథా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా ఆడియెన్స్ ను ముఖ్యంగా యువతను బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా ఇందులోని కొన్ని ఎమోషనల్ సీన్స్ చూసి ఆడియెన్స్ కూడా కంటతడి పెట్టుకున్నారు. అలా థియేటర్లలో ఆడియెన్స్ ను కట్టిపడేసిన ఈ హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ త్వరలోనే ఓటీటీలోకి రానుంది. ఇంతకీ ఈ సినిమా ఏదనుకుంటున్నారా? టాలీవుడ్ యంగ్ హీరో హర్షిత్ రెడ్డి ప్రధాన పాత్రలో తెరకెకకిన లేటెస్ట్ సినిమా దీవానా. శ్రీకాంత్ సంఘిశెట్టి తెరకెక్కించిన ఈ న్యూ ఏజ్ లవ్ స్టోరీలో స్మేహా మణిమేఘలై హీరోయిన్ గా యాక్ట్ చేసింది. నరేష్, ఝాన్సీ, రఘు కారుమంచి, వేణు తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఎలాంటి అంచనాలు లేకుండా జూన్ 19న రిలీజైన ఈ సినిమా మొదటి షోతోనే డీసెంట్ టాక్ తెచ్చుకుంది. అందుకు తగ్గట్టుగానే బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. పోటీగా సమంత నటించిన మా ఇంటి బంగారం సినిమా ఉన్నప్పటికీ దీవానా సినిమా డీసెంట్ వసూళ్లు రాబట్డడం విశేషం. థియేటర్లలో మూవీ రిలీజై నాలుగు వారాలు గడుస్తున్నా దీవానా సినిమాకు హౌస్‌ ఫుల్ కలెక్షన్లు వస్తుండడం విశేషం.

కాగా థియేటర్లలో ఆడియెన్స్ తో కన్నీళ్లు పెట్టించిన దీవానా సినిమాను ఓటీటీలోనూ చూడాలని చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుందని సమాచారం. ఈ నేపథ్యంలో జులై 17 నుంచి ఈ సూపర్ హిట్ సినిమా స్ట్రీమింగ్ కు రానున్నట్లు సమాచారం. అయితే ప్రస్తుతానికి ఇది కేవలం రూమర్ మాత్రమే. త్వరలోనే దీనిపై ఓ అధికారిక ప్రకటన రానుందని సమాచారం.

ఇవి కూడా చదవండి

దీవానా సినిమా కథ విషయానికి వస్తే.. మున్నా (హర్షిత్ రెడ్డి) ఎలాంటి లక్ష్యం లేకుండా గాలికి తిరుగుతుంటాడు. డిగ్రీ పూర్తయినా ఉద్యోగం చేయకుండా స్నేహితులతో జల్సాలు చేస్తుంటాడు. మరోవైపు మున్నా తండ్రి శేఖర్ (నరేష్) మాత్రం కష్టపడి పని చేస్తూ కొడుకును ప్రాణంగా చూసుకుంటాడు. కానీ మున్నా మాత్రం బాధ్యతలు లేకుండా ప్రవర్తిస్తుంటాడు. అలాంటి సమయంలో మీ సేవా సెంటర్ లో పనిచేసే అమూల్య (స్మేహా మణిమేఘలై)ను చూసి ప్రేమలో పడతాడు మున్నా. ఒకరోజు వెళ్లి తన ప్రేమ విషయం చెబుతాడు. అయితే తాను నెలకు ఇరవై వేలు సంపాదిస్తున్నానని.. కనీసం 200 కూడా సంపాదించలేని నువ్వు ముందు ప్రభుత్వ ఉద్యోగం తెచ్చుకున్నాకే నా ముందుకు రావాలని అమూల్య మున్నాను నిలదీస్తుంది? మరి ప్రియురాలి కోసం మున్నా కష్టపడి గవర్నమెంట్ జాబ్ సాధించాడా? చివరకు వీరి ప్రేమకథ ఏ తీరానికి చేరింది? అన్నది ఈ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

దీవానా సినిమా ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర