AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sreemukhi: ఆ హ్యాండ్సమ్ హీరోకు చెల్లెలిగా చేసినందుకు చాలా బాధేసింది.. ఆసక్తికర విషయం చెప్పిన యాంకర్ శ్రీముఖి

సమంత నటించిన మా ఇంటి బంగారం సినిమాలో యాంకర్ శ్రీముఖి కూడా ఓ కీలక పాత్ర చేసింది. పెద్ద కోడలి పాత్రలో నటించి అందరి మన్ననలు అందుకుంటోంది. అయితే గతంలోనూ పలు సినిమాల్లో హీరోయిన్ గా, సహాయక నటిగా చేసింది శ్రీముఖి.

Sreemukhi: ఆ హ్యాండ్సమ్ హీరోకు చెల్లెలిగా చేసినందుకు చాలా బాధేసింది.. ఆసక్తికర విషయం చెప్పిన యాంకర్ శ్రీముఖి
Anchor Sreemukhi
Basha Shek
|

Updated on: Jul 09, 2026 | 8:46 PM

Share

ప్రస్తుతం బుల్లితెరపై టాప్ మోస్ట్ యాంకర్ ఎవరంటే సుమ కనకాల పేరే చెబుతారు. అయితే ఆ తర్వాతి స్థానం బుల్లితెర రాములమ్మ శ్రీముఖినే అని చెప్పడంలో ఎలాంటి అతి శయోక్తి లేదు. ప్రస్తుతం చేతి నిండా టీవీ షోస్ తో బిజీ బిజీగా ఉంటోందీ స్టార్ యాంకర్. ఓ వైపు గ్లామర్ తో ఆకట్టుకుంటూనే మరో వైపు సందర్భానికి తగ్గట్టుగా పంచులు వేయడం ఈ ముద్దుగుమ్మ స్పెషల్ ట్యాలెంట్. అందుకే బిగ్ బాస్ వంటి రియాలిటీ షోలోనూ ఈ అందాల తార సత్తా చాటింది. ఇప్పుడు టీవీ ప్రోగ్రామ్స్ మాత్రమే కాకుండా, సినిమా ఆడియో ఫంక్షన్లు, ప్రీ-రిలీజ్ ఈవెంట్లు, ప్రైవేట్ ఓపెనింగ్స్ తో బాగా బిజీ బిజీగా ఉంటోంది యాంకరమ్మ. అలాగే సినిమాల్లోనూ మెరుస్తోంది. ఆ మధ్యన మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్, ఇటీవల సమంత మా ఇంటి బంగారం సినిమాల్లో శ్రీముఖి పోషించిన పాత్రలు బాగా హైలెట్ అయ్యాయి. ఇవే కాదు కెరీర్ ప్రారంభంలో పలు సినిమాల్లో నటించింది శ్రీముఖి. అల్లు అర్జున్ జులాయి, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ప్రేమ ఇష్క్ కాదల్, చంద్రిక, ధనలక్ష్మీ తలుపు తడితే, ఆంధ్రా పోరీ, జెంటిల్ మెన్, మనలో ఒకడు, బాబు బాగా బిజీ, 30 రోజుల్లో ప్రేమించుకోవడం ఎలా?, క్రేజీ అంకుల్స్, మ్యాస్ట్రో ఇలా చాలా సినిమాల్లో నటించిందీ అందాల యాంకరమ్మ. వీటిలో కొన్నింటిలో హీరోయిన్ గా నటిస్తే మరికొన్ని సినిమాల్లో హీరోలకు అక్క, చెల్లిలి పాత్రలో ఆకట్టుకుందీ ముద్దుగుమ్మ.

కాగా ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా నటించిన నేను శైలజ సినిమాలోనూ ఓ కీ రోల్ చేసింది శ్రీముఖి. అందులో ఆమెది హీరోకు చెల్లెలి పాత్ర. అయితే ఓ ఇంటర్వ్యూలో నేను శైలజ సినిమా గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది శ్రీముఖి. ‘ నేను శైలజ సినిమాలో హీరో రామ్ కు చెల్లెలిగా నటించడం నా దురదృష్టం (నవ్వుతూ). అప్పట్లో మా డాడీ నాకు ఇది పెద్ద సినిమా అని చెప్పి పంపించారు కానీ.. నువ్వు రామ్ కు చెల్లిలిగా నటిస్తున్నావని చెప్పడం మర్చిపోయారు. డాడీ ఐ హేట్ యూ. ఆ సినిమా సెట్ లో రామ్ చాలా సైలెంట్ గా ఉండేవారు’ అని అప్పటి విషయాలను గుర్తు చేసుకుంది శ్రీముఖి.

ఇవి కూడా చదవండి

మా ఇంటి బంగారం సినిమా ప్రమోషన్లలో శ్రీముఖి..

View this post on Instagram

A post shared by Sreemukhi (@sreemukhi)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' రివ్యూ.. రాజమౌళి కొడుకు హిట్ కొట్టారా?
'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' రివ్యూ.. రాజమౌళి కొడుకు హిట్ కొట్టారా?
పిండ దానం చేయాలంటే ఈ 5 పుణ్యక్షేత్రాలు.. పితృ పక్షంలో ప్రత్యేక...
పిండ దానం చేయాలంటే ఈ 5 పుణ్యక్షేత్రాలు.. పితృ పక్షంలో ప్రత్యేక...
రాశిఫలాలు: ఈ రాశులకు ఉద్యోగం, పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు
రాశిఫలాలు: ఈ రాశులకు ఉద్యోగం, పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు
లక్ష్మీ కటాక్షం కోసం.. శుక్రవారం రాశుల వారీగా ఈ మంత్రాలు జపించండి
లక్ష్మీ కటాక్షం కోసం.. శుక్రవారం రాశుల వారీగా ఈ మంత్రాలు జపించండి
సరికొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టిన అల్లు అర్జున్ ఫ్యామిలీ
సరికొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టిన అల్లు అర్జున్ ఫ్యామిలీ
అక్టోబర్ 1న మరింత తగ్గిన పసిడి రేట్లు
అక్టోబర్ 1న మరింత తగ్గిన పసిడి రేట్లు
వాట్సప్‌లో ఈ తప్పులు చేస్తున్నారా..? అకౌంట్ శాశ్వతంగా బ్లాక్..
వాట్సప్‌లో ఈ తప్పులు చేస్తున్నారా..? అకౌంట్ శాశ్వతంగా బ్లాక్..
పంచదారను ఇలా నిల్వ చేస్తే ఇంట్లో సంపద పెరుగడం ఖాయం!
పంచదారను ఇలా నిల్వ చేస్తే ఇంట్లో సంపద పెరుగడం ఖాయం!
దివేగర్ బీచ్‌లో విషాదం.. సముద్రంలో మునిగి 8 మంది విద్యార్థులు..
దివేగర్ బీచ్‌లో విషాదం.. సముద్రంలో మునిగి 8 మంది విద్యార్థులు..
చికెన్ కడిగేటప్పుడు పసుపు, ఉప్పు ఎందుకు వేస్తారో తెలుసా?
చికెన్ కడిగేటప్పుడు పసుపు, ఉప్పు ఎందుకు వేస్తారో తెలుసా?