AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: ఓటీటీలో దుమ్మురేపుతోన్న రీసెంట్ తెలుగు సినిమా.. IMDBలో 9.7 రేటింగ్.. మిస్ అవ్వకుండా చూడాల్సిన మూవీ

ఈ ఫీల్ గుడ్ తెలుగు సినిమా సెప్టెంబరులో థియేటర్లలో రిలీజై ఓ మోస్తరుగా ఆడింది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్ ఈ సినిమాను బాగా ఎంజాయ్ చేశారు. ఇక గత వారం ఓటీటీలోకి వచ్చిన ఈ మూవీ ఇప్పుడు టాప్ లో ట్రెండ్ అవుతోంది.

OTT Movie: ఓటీటీలో దుమ్మురేపుతోన్న రీసెంట్ తెలుగు సినిమా.. IMDBలో 9.7 రేటింగ్.. మిస్ అవ్వకుండా చూడాల్సిన మూవీ
OTT Movie
Basha Shek
|

Updated on: Nov 18, 2026 | 6:41 PM

Share

ఈ వారం ఓటీటీల్లో పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు సందడి చేయనున్నాయి. ఇప్పటికే ది ఒడిస్సీ, ప్రేమదే ఊరళి (తెలుగులో ప్రేమనే ఊరిలో) సినిమాలు ఓటీటీలో ఆడియెన్స్ ను అలరిస్తున్నాయి. వీటితో పాటు అనుపమ పరమేశ్వరన్ క్రేజీ కళ్యాణం, హైకూ, అనుమాన పక్షి, 418, అన్బిల్ అవన్, అనుమాన పక్షి తదితర సినిమాలు ఈ వీకెండ్ లోనే ఓటీటీ స్ట్రీమింగ్ కు రానున్నాయి.వీటి సంగతి పక్కన పెడితే.. గత వారం ఓటీటీలోకి వచ్చిన ఒక సినిమా ఆడియెన్స్ ను తెగ ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్ ఈ సినిమాను తెగ చూసేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే చర్చ. ఇన్ స్టా గ్రామ్ రీల్స్, షార్ట్స్ లోనూ ఈ సినిమాకు సంబంధించిన వీడియోలే కనిపిస్తున్నాయి. కేవలం వ్యూస్ పరంగానే కాకుండా, రేటింగ్స్ విషయంలోనూ ఈ తెలుగు సినిమా ఔరా అనిపిస్తోంది. ప్రముఖ రేటింగ్ ప్లాట్‌ఫామ్ ఐఎండీబీ (IMDb)లో ఈ సినిమాకు ఏకంగా 9.7/10 రేటింగ్ ఉండగా, బుక్ మై షోలోనూ 9.5/10 రేటింగ్‌తో ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటోంది. అలాగనీ ఈ సినిమాలో స్టార్ నటీనటులు లేరు. వీఎఫ్ ఎక్స్ హంగులు, సెట్టింగులు లేవు. భారీ యాక్షన్ సీక్వెన్సులు లేవు. స్పెషల్ సాంగ్స్ గట్రా కూడా ఏమీ లేవు. జీవితంలోని ఒడిదుడుకులు, మానవ సంబంధాల విలువలను ఆవిష్కరించే కథ కథనాలు, ఎమోషన్స్, నటీనటుల సహజ సిద్ధమైన నటన ఈ సినిమాను బలంగా నిలిచాయని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపిస్తున్నారు.

ప్రస్తుతం ఓటీటీలో ట్రెండింగ్ నంబర్ వన్ ప్లేస్ లో దూసుకుపోతోన్న ఈ సినిమా పేరు ‘హ్యాపీ జర్నీ’. అభిరామ్ నాయుడు తెరకెక్కించిన ఈ ఫీల్ గుడ్ సినిమాలో అన్నపూర్ణమ్మ, ఆమని, యాంకర్ ఝాన్సీ, పాయల్ రాధాకృష్ణ, జినీషా అలిశెట్టి, రూపా శ్రీనివాస్, సునైనా, వంశీ, రవి శివతేజ తదితరులు కీలక పాత్రలు పోషించారు. గుత్తా ప్రొడక్షన్స్, కమలాకర్ ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్లపై బాలాజీ గుత్తా, కౌశిక్ రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. గతంలో ఎన్నో ప్రేమకథా చిత్రాలకు సంగీతం అందించిన శేఖర్ చంద్ర ఈ సినిమాకు వినసొంపైన సంగీతం అందించారు. కామెడీ, ఎమోషన్స్, ఫ్యామిలీ డ్రామా కలగలిపి ఈ హ్యాపీ జర్నీ సినిమా గత వారమే అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి వచ్చింది. ఓటీటీలో మంచి ఫీల్‌గుడ్ సినిమా కోసం ఎదురుచూస్తున్నవారికి ‘హ్యాపీ జర్నీ’ ఓ మంచి ఛాయిస్‌గా అని చెప్పవచ్చు.

హ్యాపీ జర్నీ సినిమా ట్రైలర్..

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us