AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nandamuri Mokshagna: నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ! రంగంలోకి సెన్సేషనల్ డైరెక్టర్.. ఫ్యాన్స్‌కు పూనకాలే

గతంలో ‘హను-మాన్’ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో నందమూరి మోక్షజ్ఞ మొదటి సినిమాను అధికారికంగా ప్రకటించారు. అయితే ఏమైందో తెలియదు కానీ ఆ సినిమా ఆగిపోయింది. అయితే ఇప్పుడు బాలయ్య తన కుమారుడి కోసం బ్లాక్ బస్టర్ డైరెక్టర్ ను రంగంలోకి దింపినట్లు సమాచారం.

Nandamuri Mokshagna: నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ! రంగంలోకి సెన్సేషనల్ డైరెక్టర్.. ఫ్యాన్స్‌కు పూనకాలే
Nandamuri Mokshagna
Basha Shek
|

Updated on: Jul 10, 2026 | 8:59 PM

Share

నందమూరి నటసింహం బాలకృష్ణ నటవారసుడు మోక్షజ్ఞ వెండితెర అరంగేట్రం కోసం అభిమానులతో పాటు యావత్ సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గతంలో హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో నందమూరి మోక్షజ్ఞ డెబ్యూ మూవీని ప్రకటించారు. కానీ ఏమైందో తెలియదు కానీ ఆ మూవీ చర్చల స్థాయిలోనే ఆగిపోయింది. దీంతో నందమూరి ఫ్యాన్స్ బాగా నిరాశకు లోనయ్యారు. ఈ క్రమంలోనే నందమూరి మోక్షజ్ఞ మొదటి సినిమా ఎప్పుడు వస్తుంది? దర్శకుడు ఎవరు? బాలయ్య కుమారుడు ఎలాంటి కంటెంట్ తో ఎంట్రీ ఇవ్వనున్నాడని ఆడియెనస్‌ ఎదురు చూస్తున్నారు. ఇందుకు తగ్గట్టుగానే మోక్షజ్ఞ డెబ్యూకు సంబంధించి ఇప్పటికే పలువురు దర్శకుల పేర్లు వినిపించాయి. అయితే మోక్షు లాంఛింగ్ బాధ్యతలను స్వయంగా బాలకృష్ణనే భుజానకెత్తుకున్నారని తెలుస్తోంది. నందమూరి బ్రాండ్‌కు తగ్గట్టుగా, స్వయంగాఆయనే ఒక పవర్‌ఫుల్ లైన్‌ను సిద్ధం చేసి, స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో ఉన్నారని తెలుస్తోంది.

అయితే తాజాగా వినిపిస్తోన్న సమాచారం ప్రకారం మోక్షజ్ఞ మొదటి సినిమా కోసం టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్, ‘అర్జున్ రెడ్డి’ ‘యానిమల్’ ఫేమ్ సందీప్ రెడ్డి వంగా రంగంలోకి దిగినట్లు టాక్ నడుస్తోంది. బాలయ్య సిద్ధం చేసిన స్క్రిప్ట్ కు సందీప్ రెడ్డి మరింత పదును పెడుతున్నట్లు సమాచారం. సాధారణంగా సందీప్ రెడ్డి సినిమాల్లో హీరోలకు భారీగా ఎలివేషన్స్ ఉంటాయి. అలాగే కథనం పంగానూ, ఎమోషనల్ సీన్లను తెరకెక్కించడంలోనూ సందీప్ సిద్ధ హస్తుడు. అందుకే మోక్షు కోసం బాలయ్య కూడా సందీప్ రెడ్డి వంగా లాంటి క్రియేటివ్ డైరెక్టర కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఒక వేళ ఈ టాక్ గనుక నిజమైతే, సందీప్ రెడ్డి వంగా ఎంట్రీతో మోక్షజ్ఞ డెబ్యూ గ్రాండ్ గా ఉండనుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమాకు క్రేజ్ రావడం ఖాయం. త్వరలోనే మోక్షజ్ఞ డెబ్యూ సినిమాపై ఓ అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది.

ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ సినిమాతో బిజీ బిజీగా ఉంటున్నాడు. పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ ఈ మూవీలో హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
గ్యాస్ ట్రబుల్ ను తగ్గించి పేగులను క్లీన్ చేసే హై ప్రోటీన్ కూర
గ్యాస్ ట్రబుల్ ను తగ్గించి పేగులను క్లీన్ చేసే హై ప్రోటీన్ కూర
ఈ జామ రైతు సక్సెస్ సీక్రెట్ తెలిస్తే.. మీరూ ఫాలో అవుతారు..
ఈ జామ రైతు సక్సెస్ సీక్రెట్ తెలిస్తే.. మీరూ ఫాలో అవుతారు..
తెలుగు యువతకు జర్మనీలో భారీగా ఉద్యోగాలు.. నెలకు రూ.3.30లక్షల జీతం
తెలుగు యువతకు జర్మనీలో భారీగా ఉద్యోగాలు.. నెలకు రూ.3.30లక్షల జీతం
శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ రికార్డులు బ్రేక్ చేసిన పంత్
శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ రికార్డులు బ్రేక్ చేసిన పంత్
2027లో ఆహార ధరలకు రెక్కలు..! ఎరువుల కొరత, ఎల్ నినోతో భారత్‌కు..
2027లో ఆహార ధరలకు రెక్కలు..! ఎరువుల కొరత, ఎల్ నినోతో భారత్‌కు..
స్టార్ హీరోతో విబేధాలు.. కొడుకు కోసం ఆస్తిమొత్తం పోగొట్టుకున్నాడు
స్టార్ హీరోతో విబేధాలు.. కొడుకు కోసం ఆస్తిమొత్తం పోగొట్టుకున్నాడు
23 ఏళ్ల చిన్నదానితో రిలేషన్.. పెళ్లి మాత్రం చేసుకోను..!
23 ఏళ్ల చిన్నదానితో రిలేషన్.. పెళ్లి మాత్రం చేసుకోను..!
జ్వరం వచ్చిందని యాంటీబయాటిక్స్‌ ఎడాపెడా వాడొద్దు.. ఎందుకంటే!
జ్వరం వచ్చిందని యాంటీబయాటిక్స్‌ ఎడాపెడా వాడొద్దు.. ఎందుకంటే!
60 ఏళ్లలో మన తాతలు బలంగా ఉన్నారంటే.. ఈ గారెల వల్లే
60 ఏళ్లలో మన తాతలు బలంగా ఉన్నారంటే.. ఈ గారెల వల్లే
22A భూములపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక ప్రకటన..
22A భూములపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక ప్రకటన..