కుర్రాళ్లను ఫిదా చేస్తున్న వైష్ణవి క్యూట్‌నెస్.. ఫోటోస్ అదుర్స్  

1 August   2026

Pic credit - Instagram

Rajeev 

వైష్ణవి మొదట యూట్యూబ్ వీడియోలు, షార్ట్ ఫిల్మ్స్ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైంది. ఈ అమ్మడికి సోషల్ మీడియా విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టింది. 

ఆమె చేసిన షార్ట్ ఫిలిమ్స్ యూట్యూబ్ లో మిళియన్స్ కొద్దీ వ్యూస్ సొంతం చేసుకున్నాయి. ఆ క్రేజ్ తో సినిమాల్లో అవకాశాలు అందుకుంది.  

 షార్ట్ ఫిలిమ్స్ తర్వాత తెలుగు సినిమాల్లో చిన్న పాత్రలు చేస్తూ కెరీర్‌ను ప్రారంభించి, హీరోయిన్‌గా పెద్ద అవకాశం దక్కించుకుంది.

బేబీ సినిమా వైష్ణవికి పెద్ద బ్రేక్ ఇచ్చింది. సాయి రాజేష్ దర్శకత్వంలో వచ్చిన బేబీ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో వైష్ణవి తన నటనతో ఆకట్టుకుంది.

ఈ సినిమాతో వైష్ణవి చైతన్యకు స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు లభించింది. ఆతర్వాత వరుసగా సినిమాలు చేసింది. కానీ అవి పెద్దగా మెప్పిచలేదు.

లవ్ బీ అనే హారర్ సినిమా చేసిన అది డిజాస్టర్ అయ్యింది. సిద్దూ జొన్నలగడ్డతో జాక్ అనే సినిమా చేసింది. అది కూడా ఫ్లాప్ అయ్యింది.

ఇప్పుడు ఎపిక్ అనే సినిమా చేస్తుంది. అలాగే నెట్టింట యాక్టివ్ గా ఉంటూ అభిమానులను ఆకట్టుకుంటుంది వైష్ణవి చైతన్య.