AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : పెళ్లి పీటలెక్కబోతున్న టాలీవుడ్ హీరోయిన్.. ప్రియుడితో సీక్రెట్‏గా ఎంగేజ్మెంట్.. ఫోటోస్ వైరల్..

టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో హీరోయిన్ పెళ్లి పీటలెక్కబోతున్నారు. తన ప్రియుడితో కలిసి ఎలాంటి హడావిడి, ఆర్భాటం లేకుండానే రహస్యంగా నిశ్చితార్థం చేసుకుంది. ఇందుకు సంబంధించిన ఫోటోస్ తన ఇన్ స్టాలో షేర్ చేస్తూ కాబోయే భర్తను పరిచయం చేసింది. ఇంతకీ ఆమె ఎవరు.. ఏంటా ప్రేమకథ అనేది తెలుసుకుందామా.

Tollywood : పెళ్లి పీటలెక్కబోతున్న టాలీవుడ్ హీరోయిన్.. ప్రియుడితో సీక్రెట్‏గా ఎంగేజ్మెంట్.. ఫోటోస్ వైరల్..
Mirnalini Ravi
Rajitha Chanti
|

Updated on: Aug 01, 2026 | 9:54 PM

Share

టాలీవుడ్ హీరోయిన్ మృణాళిని రవి త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నారు. మలేసియాకు చెందిన మహావిష్ణు అనే ఆధ్యాత్మిక గురువుతో ఆమె కొత్త జీవితం ప్రారంభించేందుకు రెడీ అయ్యారు. ఈ మేరకు అతడితో రహాస్యంగా నిశ్చితార్థం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను తన ఇన్ స్టాలో పంచుకున్నారు. దీంతో వీరిద్దరికి అభిమానులు, సెలబ్రెటీలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. గత ఏడేళ్లుగా వీరిద్దరు మంచి స్నేహితులు. మృణాళిని రవి.. విజయ్ సేతుపతి కథానాయకుడిగా నటించి, త్యాగరాజన్ కుమారరాజా దర్శకత్వం వహించిన 2019 చిత్రం ‘సూపర్ డీలక్స్’తో తమిళ చిత్రసీమలో నటిగా అరంగేట్రం చేసింది. ఆ తర్వాత ఆమె సుశీంద్రన్ దర్శకత్వం వహించిన ‘ఛాంపియన్’ చిత్రంలో నటించింది. ఆర్య, విశాల్ నటించిన ‘ఎనిమీ’ చిత్రంలో నటించారు. ఆమె ‘ఎంజీఆర్ మగన్’, ‘జాంగో’ చిత్రాలలో నటించి, విక్రమ్ నటించిన ‘కోబ్రా’ చిత్రంలోని తన పాత్రతో గుర్తింపు పొందారు.

ఎక్కువమంది చదివినవి : Ramayana Trailer : ఏముందిరా బాబూ.. కుర్రాళ్లు తెగ వెతుకున్న చిన్నది.. రామాయణ ట్రైలర్‏లో తనే స్పెషల్..

తెలుగులో మాయ మశ్చింద్రా చిత్రంలో కనిపించారు. ఆమె చివరగా రోమియో చిత్రంలో నటించారు. విజయ్ ఆంటోని నటించిన ఈ చిత్రం 2024లో విడుదలైంది. ఆ తర్వాత ఇండస్ట్రీలో సైలెంట్ అయిన ఈ అమ్మడు… ఇప్పుడు ఆకస్మాత్తుగా నిశ్చితార్థం ఫోటోస్ షేర్ చేసింది. త్వరలోనే ఈ అమ్మడు నటనకు గుడ్ బై చెప్పనున్నట్లు తెలుస్తోంది.

ఎక్కువమంది చదివినవి : Tollywood : రూ.16 కోట్లతో తీస్తే 400 కోట్ల కలెక్షన్.. యావత్ దేశమే ఆశ్చర్యపోయేలా చేసిన సినిమా..

ఈ ముద్దుగుమ్మ నటనలోకి రాకముందు ఆమె సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేశారు. డబ్‌స్మాష్, టిక్‌టాక్ వీడియోల ద్వారా సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యింది. ఆ గుర్తింపుతోనే ఆమెకు సినిమాల్లో అవకాశాలు లభించాయి. 2019లోనే వరుణ్ తేజ్ కథానాయకుడిగా వచ్చిన ‘గద్దలకొండ గణేష్’ సినిమా ద్వారా తెలుగు చిత్రసీమకు పరిచయమయ్యారు. ఈ సినిమాలో ‘బుజ్జమ్మ’ పాత్రలో ఆమె నటన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

ఎక్కువమంది చదివినవి : Aamani : సినిమాలు మానేసి సీరియల్స్ చేయడానికి కారణం అదే.. ఎట్టకేలకు ఆమని ఓపెన్ కామెంట్స్..

మృణాళిని రవి పోస్ట్..

ఎక్కువమంది చదివినవి : ఎక్కువ మంది చదివినవి : K. Raghavendra Rao: ఆ హీరోయిన్‏తో 24 సినిమాలు చేశా.. అలాంటి చావు ఎవరికీ రాకూడదు.. డైరెక్టర్ రాఘవేంద్ర రావు..

Follow Us
జైస్వాల్‌నే కాదు వైభవ్‌ని కూడా శిక్షించాల్సిందే..
జైస్వాల్‌నే కాదు వైభవ్‌ని కూడా శిక్షించాల్సిందే..
షాకిచ్చిన ట్రంప్..వీసా అపాయింట్‌మెంట్లు నిలిపివేత!
షాకిచ్చిన ట్రంప్..వీసా అపాయింట్‌మెంట్లు నిలిపివేత!
పరమ చెత్త సినిమా.. 45 కోట్లు పెడితే పబ్లిసిటీ డబ్బులు రాలేదు..
పరమ చెత్త సినిమా.. 45 కోట్లు పెడితే పబ్లిసిటీ డబ్బులు రాలేదు..
చేప ముల్లు గొంతులో ఇరుక్కుంటే వెంటనే ఇలా చేయండి.. దెబ్బకు రిలీఫ్
చేప ముల్లు గొంతులో ఇరుక్కుంటే వెంటనే ఇలా చేయండి.. దెబ్బకు రిలీఫ్
24 ఏళ్ల గిన్నిస్‌ రికార్డ్‌ను బ్రేక్‌ చేసిన విచిత్ర పిల్లి! ఆకారం
24 ఏళ్ల గిన్నిస్‌ రికార్డ్‌ను బ్రేక్‌ చేసిన విచిత్ర పిల్లి! ఆకారం
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షం
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షం
కడుపుతో ఉన్నప్పుడు వర్కవుట్స్ చేయొచ్చా.. సమంత ఏం చెప్పిందంటే..
కడుపుతో ఉన్నప్పుడు వర్కవుట్స్ చేయొచ్చా.. సమంత ఏం చెప్పిందంటే..
చిన్నప్పుడు రామ్ చరణ్‌ను స్కూల్ నుంచి నేనే తీసుకొచ్చేవాడిని..
చిన్నప్పుడు రామ్ చరణ్‌ను స్కూల్ నుంచి నేనే తీసుకొచ్చేవాడిని..
భారతదేశంలో వెల్‌నెస్ టూరిజానికి రిషికేశ్‌ కొత్త చిరునామా..
భారతదేశంలో వెల్‌నెస్ టూరిజానికి రిషికేశ్‌ కొత్త చిరునామా..
వార్నీ ఇన్నాళ్లు ఇంత లైట్ తీసుకున్నామా.. సోంపు నీళ్లు తాగితే..
వార్నీ ఇన్నాళ్లు ఇంత లైట్ తీసుకున్నామా.. సోంపు నీళ్లు తాగితే..