AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

24 ఏళ్ల గిన్నిస్‌ రికార్డ్‌ను బ్రేక్‌ చేసిన విచిత్ర పిల్లి..!1,2,3 కాదు ఏకంగా 29..

మీరు ఎప్పుడైనా 29 వేళ్లున్న పిల్లిని చూశారా..? అది 24 ఏళ్ల నాటి రికార్డును బద్దలు కొట్టి చరిత్ర సృష్టించింది. అవును, ఇటీవల ఒక పిల్లి వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతోంది. దానికి కారణం దానికున్న వేళ్ల సంఖ్య! సాధారణ పిల్లుల కంటే భిన్నంగా, ఏకంగా 29 వేళ్లతో ఈ పిల్లి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో తన పేరును లిఖించుకుంది. అమెరికాలోని విస్కాన్సిన్ రాష్ట్రానికి చెందిన ఒక చిన్న పిల్ల పిల్లి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లను కట్టిపడేస్తోంది.

24 ఏళ్ల గిన్నిస్‌ రికార్డ్‌ను బ్రేక్‌ చేసిన విచిత్ర పిల్లి..!1,2,3 కాదు ఏకంగా 29..
Cat With 29 Toes
Jyothi Gadda
|

Updated on: Aug 26, 2026 | 2:58 PM

Share

ప్రకృతి సృష్టించే వింతలు కొన్నిసార్లు అందరినీ ఆశ్చర్యపరుస్తాయి. అమెరికాలోని విస్కాన్సిన్ రాష్ట్రానికి చెందిన ఒక చిన్న పిల్ల పిల్లి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లను కట్టిపడేస్తోంది. దానికి కారణం దానికున్న వేళ్ల సంఖ్య! సాధారణ పిల్లుల కంటే భిన్నంగా, ఏకంగా 29 వేళ్లతో ఈ పిల్లి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో తన పేరును లిఖించుకుంది. పుట్టిన కొద్దిసేపటికే తీవ్రమైన అనారోగ్యం బారిన పడ్డ ఈ పిల్లి పిల్లను కాపాడేందుకు వైద్యులు తీవ్రంగా శ్రమించారు. కానీ, ఇప్పుడు అద్భుతం జరిగినట్లుగా, ఆ పిల్లి పూర్తిగా కోలుకుంది. ఇక్కడే మరో మ్యాజిక్‌ జరిగింది.. అదేంటంటే..

అమెరికాలోని విస్కాన్సిన్‌లో 29 కాలివేళ్లతో ఉన్న ఒక పిల్లి 24 ఏళ్ల గిన్నిస్ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది. ప్రాణాంతకమైన వ్యాధిని జయించిన ఈ పిల్లి చరిత్ర సృష్టించింది. విస్కాన్సిన్‌కు చెందిన కేంద్ర, హంటర్ దంపతులు పెంచుకుంటున్న ఈ మైనే కూన్ జాతి పిల్లి పేరు ఎరెబస్ అనోమలీ. సాధారణంగా పిల్లులకు ముందు కాళ్లకు ఐదు చొప్పున, వెనుక కాళ్లకు నాలుగు చొప్పున మొత్తం 18 వేళ్లు మాత్రమే ఉంటాయి. అయితే ఎరెబస్‌కు ఒక కాలికి 8 వేళ్లు, మిగిలిన మూడు కాళ్లకు ఏడు చొప్పున మొత్తం 29 వేళ్లు ఉన్నాయి. గతంలో నమోదైన 28 వేళ్ల ప్రపంచ రికార్డును దాటి, అత్యధిక వేళ్లు ఉన్న పిల్లిగా ఇది మే 13న గిన్నిస్ రికార్డు సాధించింది.

Erebus Anomaly Cat

ఇవి కూడా చదవండి

ఎరెబస్ జీవిత ప్రయాణం ఏమీ సులభంగా సాగలేదు. పుట్టిన కొద్ది రోజులకే ఇది తీవ్రమైన న్యుమోనియా బారిన పడింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఈ చిన్న పిల్లికి వైద్యులు ఆక్సిజన్ సపోర్ట్ ఇచ్చి కాపాడాల్సి వచ్చింది. కోలుకున్న తర్వాత సాధారణ ఆరోగ్య పరీక్షల్లో భాగంగా తీసిన ఎక్స్‌రే చిత్రాలను చూసి వైద్యులు, యజమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఎరెబస్ కాళ్లలో అదనపు వేళ్లు ఉన్నట్లు ఎక్స్‌రే స్పష్టం చేసింది.

జన్యు శాస్త్రం ప్రకారం ఈ పరిస్థితిని పాలిడాక్టిలీ అని పిలుస్తారు. ఇది ఒక జన్యుపరమైన మార్పు. ఎరెబస్ తండ్రికి కూడా 24 వేళ్లు ఉండటంతో, ఈ జన్యు గుణం పిల్లికి వారసత్వంగా వచ్చిందని నిపుణులు తెలిపారు. ఇది దాని ఆరోగ్యానికి ఎలాంటి హాని కలిగించదు. చావును జయించి ప్రపంచ రికార్డు సృష్టించిన ఈ లక్కీ పిల్లిని తాము ఎప్పటికీ ప్రాణంగా చూసుకుంటామని దాని యజమానులు సంతోషంగా చెబుతున్నారు. ప్రస్తుతం ఎరెబస్ ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
24 ఏళ్ల గిన్నిస్‌ రికార్డ్‌ను బ్రేక్‌ చేసిన విచిత్ర పిల్లి! ఆకారం
24 ఏళ్ల గిన్నిస్‌ రికార్డ్‌ను బ్రేక్‌ చేసిన విచిత్ర పిల్లి! ఆకారం
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షం
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షం
కడుపుతో ఉన్నప్పుడు వర్కవుట్స్ చేయొచ్చా.. సమంత ఏం చెప్పిందంటే..
కడుపుతో ఉన్నప్పుడు వర్కవుట్స్ చేయొచ్చా.. సమంత ఏం చెప్పిందంటే..
చిన్నప్పుడు రామ్ చరణ్‌ను స్కూల్ నుంచి నేనే తీసుకొచ్చేవాడిని..
చిన్నప్పుడు రామ్ చరణ్‌ను స్కూల్ నుంచి నేనే తీసుకొచ్చేవాడిని..
భారతదేశంలో వెల్‌నెస్ టూరిజానికి రిషికేశ్‌ కొత్త చిరునామా..
భారతదేశంలో వెల్‌నెస్ టూరిజానికి రిషికేశ్‌ కొత్త చిరునామా..
వార్నీ ఇన్నాళ్లు ఇంత లైట్ తీసుకున్నామా.. సోంపు నీళ్లు తాగితే..
వార్నీ ఇన్నాళ్లు ఇంత లైట్ తీసుకున్నామా.. సోంపు నీళ్లు తాగితే..
టాక్సిక్ సినిమాతో హిట్టు.. అట్టర్ ప్లాప్ మిస్..
టాక్సిక్ సినిమాతో హిట్టు.. అట్టర్ ప్లాప్ మిస్..
ఐఫోన్ మోజు.. కుమారుడితో పాటు తల్లిదండ్రి మృతి!
ఐఫోన్ మోజు.. కుమారుడితో పాటు తల్లిదండ్రి మృతి!
రెస్టారెంట్‌లో శాండ్‌విచ్‌ తింటున్న కస్టమర్‌..సగం తిన్నాక అందులో
రెస్టారెంట్‌లో శాండ్‌విచ్‌ తింటున్న కస్టమర్‌..సగం తిన్నాక అందులో
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి