AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఐస్‌క్రీమ్‌ లవర్స్‌కి అద్దిరిపోయే న్యూస్‌… మార్కెట్‌లోకి మరో కొత్త రుచితో నోరూరిస్తున్న బుల్లెట్‌ స్టైల్‌..!

ఐస్‌క్రీమ్ ప్రేమికుల కోసం, ప్రసిద్ధ మిర్జాపూర్ సిరీస్ అభిమానుల కోసం ప్రముఖ ఐస్‌క్రీమ్ సంస్థ హొక్కో ఒక వినూత్నమైన బుల్లెట్ ఐస్‌క్రీమ్ ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఈ స్పెషల్ ఎడిషన్ ఐస్‌క్రీమ్‌ను బుల్లెట్ ఆకారంలో డిజైన్ చేయడం విశేషం. ఈ లిమిటెడ్ ఎడిషన్ ఐస్‌క్రీమ్ త్వరలోనే బ్లింకిట్, జెప్టో, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ వంటి ప్రముఖ క్విక్-కామర్స్ యాప్‌లలో అందుబాటులోకి రానుంది. పాప్ కల్చర్‌ను ప్రతిబింబించేలా ఉన్న ఈ విభిన్నమైన ప్రచారం ఐస్‌క్రీమ్ ప్రియులను, సినీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

ఐస్‌క్రీమ్‌ లవర్స్‌కి అద్దిరిపోయే న్యూస్‌... మార్కెట్‌లోకి మరో కొత్త రుచితో నోరూరిస్తున్న బుల్లెట్‌ స్టైల్‌..!
Hocco Bullet Ice Cream
Jyothi Gadda
|

Updated on: Aug 25, 2026 | 9:02 AM

Share

ఐస్‌క్రీమ్ లవర్స్‌కి సరికొత్త అనుభూతిని అందించడానికి బ్రాండ్లు ఎప్పటికప్పుడు కొత్త రుచులను, డిజైన్లను తీసుకొస్తూనే ఉంటాయి. అయితే ఈసారి ప్రసిద్ధ ఐస్‌క్రీమ్ బ్రాండ్ హొక్కో ఏకంగా ఒక సినిమా థీమ్‌తో కూడిన విభిన్నమైన ఐస్‌క్రీమ్‌ను మార్కెట్‌లోకి తెచ్చింది. ఓటీటీలో సంచలనం సృష్టించిన మిర్జాపూర్ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా బుల్లెట్ ఐస్‌క్రీమ్ ను విడుదల చేసింది.

హిందీలో అత్యంత ప్రజాదరణ పొందిన క్రైమ్ డ్రామా సిరీస్ మిర్జాపూర్ ఇప్పుడు వెండితెరపై మిర్జాపూర్: ది మూవీగా అలరించేందుకు సిద్ధమవుతోంది. గుర్మీత్ సింగ్ దర్శకత్వంలో పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్ తదితరులు నటిస్తున్న ఈ సినిమా పట్ల భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా క్రేజ్, గ్యాంగ్‌స్టర్ థీమ్‌కు సరిపోయేలా, కథలో కీలక పాత్ర పోషించే తుపాకీ గుండు ఆకారంలోనే ఈ ప్రత్యేక ఐస్‌క్రీమ్‌ను రూపొందించారు.

ఈ కొత్త ప్రాజెక్ట్ గురించి హొక్కో సంస్థ ఇ-కామర్స్ వైస్ ప్రెసిడెంట్ ప్రథమేష్ టి. సోషల్ మీడియాలో వివరాలు వెల్లడిస్తూ, ఈ ఐస్‌క్రీమ్ మిర్జాపూర్ షో లాగే బోల్డ్‌గా, అంచనాలకు అందకుండా ఉంటుంది. పాప్ కల్చర్, జ్ఞాపకాలను మేళవించి దీనిని తీసుకొచ్చాం అని తెలిపారు. ఈ ప్రచారం కోసం ఇలాకా అప్నా, రూల్స్ అప్నా ఔర్… బుల్లెట్ భీ అప్నీ దీనిని తెలుగు అనువదిస్తే.. ఏరియా మనది, రూల్స్ మనవి… బుల్లెట్ కూడా మనదే.. అనే శక్తివంతమైన ట్యాగ్‌లైన్‌ను ఉపయోగించారు. ఇది యువతను బాగా ఆకర్షిస్తోంది.

ఇవి కూడా చదవండి

ఈ లిమిటెడ్ ఎడిషన్ బుల్లెట్ ఐస్‌క్రీమ్‌ను వినియోగదారులు సులభంగా పొందేందుకు క్విక్-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లతో జతకట్టారు. బ్లింకిట్, జెప్టో, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, ఫ్లిప్‌కార్ట్ మినిట్స్, అమెజాన్, బిగ్‌బాస్కెట్‌లలో అందుబాటులోకి రానుంది. హ్యూబర్, హాలీ అవుట్‌లెట్లలో కూడా ఇది లభిస్తుంది.

సినిమా ప్రచారంలో భాగంగా ఆహార ఉత్పత్తులను అనుసంధానించే ఈ కొత్త ట్రెండ్ ఐస్‌క్రీమ్ ప్రియులకు తీపి అనుభవాన్ని ఇస్తోంది. మీరు కూడా మిర్జాపూర్ అభిమాని అయితే, ఈ వినూత్న బుల్లెట్ ఐస్‌క్రీమ్‌ను ఒకసారి ట్రై చేయవచ్చు!

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us