AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cinema : ఏం తీశార్రా బాబూ.. స్టార్ హీరోహీరోయిన్లను పెట్టి చెత్త సినిమా తీశారు.. యూట్యూబ్ లో చూడొచ్చు..

ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో కోట్లలో బడ్జెట్ పెట్టి స్టార్ హీరోహీరోయిన్లతో సినిమాలు తీయడం కామన్ అయ్యింది. కానీ కొన్ని చిత్రాలు మాత్రమే సూపర్ హిట్ అవుతున్నాయి. మరికొన్ని చిత్రాలకు పాజిటివ్ రివ్యూస్ వచ్చినప్పటికీ లాభాలు మాత్రం రావడం లేదు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అట్టర్ ప్లాప్ అయ్యింది.

Cinema : ఏం తీశార్రా బాబూ.. స్టార్ హీరోహీరోయిన్లను పెట్టి చెత్త సినిమా తీశారు.. యూట్యూబ్ లో చూడొచ్చు..
The Lady Killer
Rajitha Chanti
|

Updated on: Aug 26, 2026 | 3:32 PM

Share

సినిమా ఇండస్ట్రీలో భారీ బడ్జెట్‌తో సినిమాలు తీయడం, అవి బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడం సహజమే. అయితే కొన్నిసార్లు ఎంత పెద్ద స్టార్ కాస్టింగ్ ఉన్నా, కోట్లు కుమ్మరించినా సినిమాలు దారుణంగా ప్లాప్ అవుతుంటాయి. కానీ, ఏకంగా రూ. 45 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తే.. థియేటర్లలో కేవలం రూ. 60 వేలు మాత్రమే వసూలు చేసిందంటే నమ్మగలరా? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది పక్కా నిజం. భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత పెద్ద డిజాస్టర్‌గా నిలిచిన ఆ చిత్రం పేరు ‘ది లేడీ కిల్లర్’. భారీ అంచనాలు, భారీ బడ్జెట్ మధ్య ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 2023లో విడుదలైన ఈ క్రైమ్ థ్రిల్లర్ చిత్రంలో బాలీవుడ్ ప్రముఖ నటుడు అర్జున్ కపూర్, క్రేజీ హీరోయిన్ భూమి పెడ్నేకర్ జంటగా నటించారు. అజయ్ బహల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ టీ-సిరీస్ బ్యానర్‌పై భారీ స్థాయిలో రూ. 45 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. స్టార్ హీరోహీరోయిన్లు, పెద్ద నిర్మాణ సంస్థ ఉండటంతో ఈ సినిమాపై విడుదల ముందు కొన్ని అంచనాలు ఉండేవి.

ఎక్కువమంది చదివినవి :  Eshwar Sai : ఆ టైంలోనే మాధురి నాకు కనెక్ట్ అయ్యింది.. ఆమె చాలా మంచిది.. నోరు విప్పిన ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర సాయి..

కానీ థియేటర్లలో విడుదలైన మొదటి రోజే ఈ సినిమా పరిస్థితి ఘోరంగా తయారైంది. ఎంతలా అంటే, ఈ చిత్రానికి మొదటి రోజు దేశవ్యాప్తంగా అమ్ముడైన టికెట్లు కేవలం 293 మాత్రమే! మొదటి రోజు కలెక్షన్లు రూ. 38 వేలుగా నమోదయ్యాయి. ఇక ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగిసేసరికి సాధించిన మొత్తం వసూళ్లు కేవలం రూ. 60 వేలు. అంటే పెట్టిన బడ్జెట్‌లో ఒక శాతం కాదు కదా, కనీసం ప్రింట్ అండ్ పబ్లిసిటీ ఖర్చులు కూడా రాలేదు.

ఇవి కూడా చదవండి

ఎక్కువమంది చదివినవి : Chalaki Chanti: వాడు నా పొట్ట కొట్టాడు.. నాకు అవకాశాలు రాకుండా చేశాడు.. చలాకీ చంటి..

సినిమా కంటెంట్ తీవ్రంగా నిరాశపరచడం, సరైన ప్రమోషన్లు లేకపోవడంతో ప్రేక్షకులు అసలు థియేటర్ల వైపు చూడలేదు. ఇక థియేటర్లలో కోలుకోలేని దెబ్బ తిన్న తర్వాత, నిర్మాతలు ఈ సినిమాను ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో డిజిటల్ రిలీజ్ చేయాలని భావించారు. అయితే ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ఈ డీల్‌ను రద్దు చేసుకోవడం, ఇతర ప్రముఖ ప్లాట్‌ఫామ్‌లు కూడా కొనుగోలు చేయడానికి ముందుకు రాకపోవడంతో ఆఖరికి వేరే దారి లేక మేకర్స్ ఈ సినిమాను యూట్యూబ్‌లోనే ఉచితంగా విడుదల చేయాల్సి వచ్చింది.

ఎక్కువమంది చదివినవి : Aamani: నాకు లైఫ్ ఇచ్చింది ఆయనే.. ఆ హీరోతోనే ఎక్కువ సినిమాలు చేశా.. హీరోయిన్ ఆమని..

ఎక్కువమంది చదివినవి :  Comedian Sudhakar: ఒక్క సినిమాకు రూ.30 వేల రెమ్యునరేషన్.. ఆస్తులపై క్లారిటీ ఇచ్చిన నటుడు సుధాకర్..

Follow Us