AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Eshwar Sai : ఆ టైంలోనే మాధురి నాకు కనెక్ట్ అయ్యింది.. ఆమె చాలా మంచిది.. నోరు విప్పిన ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర సాయి..

వ్యక్తిగత, కుటుంబ, వ్యాపార ఒత్తిళ్ల నడుమ మనశ్శాంతిని కోరుకున్నానని, ఆ సమయంలో మాధురి రాథోడ్ తనకు తోడుగా నిలిచారని ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర్ సాయి తెలిపారు. తమ ఐదేళ్ల పరిచయం స్నేహానికి మించి ఎప్పుడూ లేదని, ఆమె సంరక్షణ, మంచితనం తనను ఆకర్షించాయని ఆయన వెల్లడించారు. ఈ "ట్రయాంగిల్ స్టోరీ"పై వివరణ ఇచ్చారు.

Eshwar Sai : ఆ టైంలోనే మాధురి నాకు కనెక్ట్ అయ్యింది.. ఆమె చాలా మంచిది.. నోరు విప్పిన ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర సాయి..
Eshwara Sai
Rajitha Chanti
|

Updated on: Aug 23, 2026 | 6:24 PM

Share

తెలుగు జానపద కళారంగంలో ‘బాసింగ బలాలు’ వంటి వరుస హిట్‌ పాటలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ ఫోక్‌ డ్యాన్సర్‌, నటుడు ఈశ్వర్‌ సాయి ఇటీవల తీవ్ర వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని ఒక భవనంలో తోటి ఫోక్‌ ఆర్టిస్ట్‌ మాధురి రాథోడ్‌తో కలిసి ఒకే గదిలో ఉన్న సమయంలో, ఈశ్వర్ సాయి భార్య శరణ్య వారిని ప్రత్యక్షంగా పట్టుకున్నారు. అక్కడే వారి మధ్య పెద్ద ఎత్తున వాగ్వాదం జరగడం, దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ క్రమంలోనే తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈశ్వర సాయి అసలు విషయం పై నోరు విప్పారు. తన వ్యక్తిగత జీవితంలో తీవ్రమైన ఒత్తిళ్లను ఎదుర్కొన్నానని ఆయన వెల్లడించారు. “నాకు ఇంట్లో కొంచెం డిస్టర్బెన్సెస్ అయినాయి. కొంచెం ప్రెజర్ ఉంది. అటు రెస్పాన్సిబిలిటీస్ కావచ్చు, ఫ్యామిలీ ప్రెజర్స్ కావచ్చు, అటు బిజినెస్ ప్రెజర్ కావచ్చు. చాలా ప్రెజర్ ఉంటది,” అని ఆయన పేర్కొన్నారు. అలాంటి పరిస్థితులలో ఒక మగాడికి మనశ్శాంతి అత్యవసరమని, తాను కూడా అదే కోరుకున్నానని ఈశ్వర్ సాయి అన్నారు.

ఈ క్లిష్టమైన సమయంలో తనకు కనెక్ట్ అయిన వ్యక్తి మాధురి అని ఆయన వివరించారు. మాధురి చాలా మంచి పర్సన్ అని, చాలా గుడ్‌హార్టెడ్ వ్యక్తి అని, ఆమెను తప్పు పట్టాల్సిన అవసరం లేదని ఈశ్వర్ సాయి స్పష్టం చేశారు. తనకున్న ఒత్తిళ్లకు, మాధురి చూపిన కేరింగ్‌కు తాను బాగా ఆకర్షితుడయ్యానని, అది తన వ్యక్తిగత భావన అని ఆయన వివరించారు. మాధురి తనకు అందించిన ఆత్మీయత, శ్రద్ధ తనకు ఎంతగానో నచ్చాయని ఈశ్వర్ సాయి తెలిపారు. ఆమెకు చేతులెత్తి క్షమాపణ చెబుతున్నానని అన్నారు.

మాధురి రాథోడ్‌తో తన పరిచయం సుమారు నాలుగు, ఐదు సంవత్సరాల క్రితం ప్రారంభమైందని ఈశ్వర్ సాయి చెప్పారు. అయితే, ఆ ఐదేళ్ల కాలంలో వారి బంధం ఒక స్నేహానికి లేదా సహోద్యోగుల మధ్య ఉండే వృత్తిపరమైన సంబంధానికి మించి ఎప్పుడూ లేదని ఆయన చెప్పారు. “నేను గానీ, మాధురి గానీ మేము డైరెక్ట్‌గా మేము క్లోజ్‌గా మాట్లాడుకొని నువ్వు అని మాట్లాడుకున్న రోజు కూడా లేదు. మీరు, ఈశ్వర్ గారు, మాధురి గారు ఇవే నడుస్తాయి మా ఇద్దరి మధ్య,” అని ఆయన వారి మధ్య ఉన్న సంబంధాన్ని వివరించారు.

అలాగే తన భార్యకు లేని ఆవేశం వీడియో తీసిన మహిళకు ఎందుకు అంత ఆవేశం వచ్చిందనేది నాకు అర్థం కావడం లేదు అని చెప్పుకొచ్చారు. జానపద కళాకారుడిగా ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న ఈశ్వర్ సాయి, తన వ్యక్తిగత జీవితంలో ఎదురైన సవాళ్లను, వాటి నుంచి ఉపశమనం పొందడానికి తీసుకున్న నిర్ణయాలను వివరించడం ద్వారా, ఈ “ట్రయాంగిల్ స్టోరీ” చుట్టూ అలుముకున్న అనేక సందేహాలకు సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు. తనపై, మాధురిపై వస్తున్న వార్తలు, ట్రోల్స్, సోషల్ మీడియా చర్చల నేపథ్యంలో ఆయన ఇచ్చిన ఈ వివరణ, ప్రజల్లో మరింత చర్చకు దారితీసే అవకాశం ఉంది.

ఎక్కువ మంది చదివినవి : Cinema OTT: రహస్య బావిలో మహిళ అరుపులు.. భయంతో వణికిపోవాల్సిందే.. ఓటీటీని ఊపేస్తున్న హారర్ థ్రిల్లర్..

ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఆ హీరో మాములోడు కాదు.. నెంబర్ వన్ ఫ్రాడ్.. సీనియర్ నటుడు సురేష్..

Follow Us