AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Boyapati Srinu: పూనకాలు లోడింగ్.. మెగా- నందమూరి మల్టీస్టారర్ పై బిగ్ అప్డేట్.. అఖండ 3 పై అప్డేట్ ఇచ్చిన బోయపాటి..

టాలీవుడ్ డైరెక్టర్ బోయపాటి శ్రీను సోమవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో పలు ఆసక్తికర విశేషాలను పంచుకున్నారు. బాలకృష్ణ సినీ స్వర్ణోత్సవ వేడుకల్లో 'సమరసింహారెడ్డి', 'ఇంద్రసేనారెడ్డి' పాత్రలతో మల్టీస్టారర్ తీసే సత్తా ఎవరికైనా ఉందా అని మెగాస్టార్ చిరంజీవి విసిరిన ఛాలెంజ్‌పై ఆయన స్పందించారు. భవిష్యత్తులో అవకాశం దక్కితే చిరంజీవి, బాలకృష్ణల కాంబినేషన్‌లో కచ్చితంగా భారీ మల్టీస్టారర్ చిత్రాన్ని తెరకెక్కిస్తానని ఆయన స్పష్టం చేశారు.

Boyapati Srinu: పూనకాలు లోడింగ్.. మెగా- నందమూరి మల్టీస్టారర్ పై బిగ్ అప్డేట్.. అఖండ 3 పై అప్డేట్ ఇచ్చిన బోయపాటి..
Boyapati Srinu
Rajitha Chanti
|

Updated on: Oct 05, 2026 | 3:19 PM

Share

మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే అగ్ర దర్శకుడు బోయపాటి శ్రీను. ఇప్పటివరకు తెలుగులో పలు సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించి తనదైన ముద్ర వేశారు. సోమవాం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తన రాబోయే ప్రాజెక్టులు, టాలీవుడ్‌‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన మల్టీస్టారర్ కాంబినేషన్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మెగాస్టార్ చిరంజీవి, నటసింహం నందమూరి బాలకృష్ణల కాంబినేషన్‌లో సినిమా వస్తే చూడాలని కోట్లాది మంది తెలుగు సినీ అభిమానులు దశాబ్దాలుగా వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇటీవల ఒక వేదికపై చిరంజీవి కూడా మంచి కథ కుదిరితే బాలయ్యతో కలిసి నటించడానికి సిద్ధమేనని ప్రకటించడం చర్చనీయాంశమైంది. బాలయ్య నటించిన ‘సమరసింహారెడ్డి’ చిత్రమే తన ‘ఇంద్ర’ ప్రాజెక్ట్‌కు ప్రధాన స్ఫూర్తి అని చిరు అన్నారు. సమరసింహారెడ్డి, ఇంద్రసేనారెడ్డి పాత్రలను కలిపి ఒకే తెరపై నిలబెట్టే పవర్‌ఫుల్ మల్టీస్టారర్ కథను ఎవరైనా రాయగలరా?.. అలా రాస్తే మేమిద్దరం కలిసి నటించడానికి సంసిద్ధం అని అన్నారు. దీనిపై బోయపాటి శ్రీను స్పందిస్తూ.. “అవకాశం వస్తే మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ కాంబినేషన్‌లో ఒక ఊరమాస్ మల్టీస్టారర్ చిత్రాన్ని తెరకెక్కించడానికి నేను ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాను” అని స్పష్టం చేశారు.

మాస్ పల్స్ తెలిసిన బోయపాటి ఈ కాంబినేషన్‌ను హ్యాండిల్ చేస్తే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాయడం ఖాయమని ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. దీనితో పాటు తన రాబోయే చిత్రాల గురించి కూడా బోయపాటి కీలక విశేషాలను పంచుకున్నారు. ఈ నెలాఖరులోగా తన నూతన సినిమా ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటిస్తానని తెలిపారు. ప్రతిసారీ కొత్త సినిమా ప్రారంభించే ముందు తిరుమల వెంకన్న ఆశీస్సులు తీసుకోవడం తనకు ఆనవాయితీ అని, అందుకే స్వామివారిని దర్శించుకున్నట్లు చెప్పారు.

ఇక నందమూరి బాలకృష్ణతో తనది తిరుగులేని హిట్ కాంబినేషన్ అని మరోసారి నిరూపించిన ‘అఖండ’ ఫ్రాంచైజీ గురించి మాట్లాడుతూ.. ‘అఖండ 3’ (Akhanda 3) చిత్రం ఖచ్చితంగా ఉంటుందని ప్రకటించారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కు సంబంధించిన వివరాలను సరైన సమయంలో బాలకృష్ణతో కలిసి వేదికపై వెల్లడిస్తానని తెలిపారు. బోయపాటి చేసిన ఈ డబుల్ ధమాకా ప్రకటనలతో మెగా , నందమూరి అభిమానుల్లో ఉత్సాహం నిండిపోయింది.

ఎక్కువమంది చదివినవి : Bigg Boss 10 Telugu : షాలిని సేఫ్.. సృష్టి ఎలిమినేషన్.. స్టార్ ప్లేయర్‌గా ఝాన్సీ.. అన్న కోసం చెల్లెలి ఆర్డర్..

ఎక్కువమంది చదివినవి :  మాయాబజార్ సినిమాలో వాడని పాట.. మనవరాలితో కలిసి అద్భుతంగా పాడిన సింగీతం శ్రీనివాసరావు.. వీడియో ఇదిగో..

Follow Us