AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 10 Telugu : షాలిని సేఫ్.. సృష్టి ఎలిమినేషన్.. స్టార్ ప్లేయర్‌గా ఝాన్సీ.. అన్న కోసం చెల్లెలి ఆర్డర్..

బిగ్ బాస్ ఇంట్లో నాలుగో వారం ఎలిమినేషన్ సైతం పూర్తయ్యింది. ఇక ముందు నుంచి వినిపించినట్లుగానే హౌస్ నుంచి సృష్టి ఎలిమినేషన్ జరిగింది. చివరకు షాలిని సేఫ్ అయ్యింది. ఈ వారంలో సండె ఎపిసోడ్ లో సరదాగా జరిగిన టాస్కులలో స్టార్ ప్లేయర్‌గా ఝాన్సీ నిల్చింది. ఇక వెళ్తూ వెళ్తూ సృష్టి కంటెస్టెంట్స్ గురించి చెప్పుకొచ్చింది.. రాం ప్రసాద్, ముఖేష్, వర్షిణి మాస్క్ వేసుకునే ఇంకా ఆడుతున్నారు అని చెబుతుంది. ఇక రాం ప్రసాద్ అయితే ఏదో ఒక మాట అనేసి వెళ్లిపోతాడు.. అందరినీ ప్రభావితం చేస్తుంటాడు అని శ్రిష్టి అంటుంది. ఈ చర్చలో చరణ్ మధ్యలోకి వస్తే.. నాగార్జున కౌంటర్ వేసి.. నోరు మూయించేస్తాడు.

Bigg Boss 10 Telugu : షాలిని సేఫ్.. సృష్టి ఎలిమినేషన్.. స్టార్ ప్లేయర్‌గా ఝాన్సీ.. అన్న కోసం చెల్లెలి ఆర్డర్..
Bigg Boss 10 Telugu Sunday Episode Highlights
Rajitha Chanti
|

Updated on: Oct 05, 2026 | 6:55 AM

Share

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో నాలుగో వారం సందడిగా ముగిసింది. సండే ఎపిసోడ్‌లో హోస్ట్ నాగార్జున కంటెస్టెంట్లతో సరదా ఆటలు ఆడిస్తూనే, మరోవైపు కంటెస్టెంట్ల తప్పులను ఎత్తిచూపుతూ క్లాస్ తీసుకున్నారు. ఇక ముందు నుంచి నెట్టింట వినిపిస్తున్నట్లుగానే సృష్టి ఎలిమినేట్ కాగా.. షాలిని సేఫ్ అయ్యింది. ఈ వారం ‘టోటల్ డామినేషన్’ థీమ్‌‌లో హద్దులు దాటి ప్రవర్తించిన అమన్, రోహిత్, త్రిగుణ్‌లకు నాగార్జున ఎల్లో కార్డ్ ఇచ్చి హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఇక సండే ఎపిసోడ్ మాత్రం సరదా సరదాగానే సాగింది. ఎపిసోడ్ ప్రారంభంలో నాగార్జున నామినేషన్లలో ఉన్న వారి నుంచి ముఖేష్, దేబ్జానీ సేఫ్ అయినట్లు ప్రకటించారు. అనంతరం సినిమాలకు సంబంధించిన ప్రాపర్టీలను చూపిస్తూ పేర్లు గెస్ చేసే సరదా టాస్క్ నిర్వహించారు. ఈ టాస్క్ మధ్యలోనే నరేష్ సేఫ్ అయ్యారు. ఆ తర్వాత చరణ్, త్రిగుణ్, రోహిత్, అమన్‌‌లు కూడా సేఫ్ అయినట్లు నాగ్ వెల్లడించారు. ఆ తర్వాత హౌస్‌మేట్స్ మెజార్టీ ఓట్ల ఆధారంగా ఝాన్సీని ఈ వారానికి ‘స్టార్ ప్లేయర్’గా నాగార్జున ప్రకటించారు.

దీంతో ముఖేష్ కోసం షాపింగ్ చేస్తుంది ఝాన్సీ. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్లో భాగంగా ముఖేష్ కోసం షూస్ ఆర్డర్ పెడుతుంది ఝాన్సీ. ఇంటి సభ్యులను ఐదు గ్రూపులుగా విభజించి ఒక పడవ టాస్క్ నిర్వహించారు. ఇందులో ఎవరిని ముంచుతారు, ఎవరిని కాపాడతారు అని నాగ్ అడిగిన ప్రశ్నకు ఒక్కొక్కరు తమ అభిప్రాయాలు చెప్పారు. నామినేషన్ల చర్చలో చరణ్ కల్పించుకుని “మాకు డబ్బులు ముఖ్యం కాదు సార్, కప్పు ముఖ్యం” అని చెప్పగా.. నాగార్జున స్పందిస్తూ “నీకు ఆట కూడా ముఖ్యం కాదులే, వారానికి ఒకసారి బయటకు వెళ్లి వస్తున్నావ్” అని గట్టి కౌంటర్ ఇచ్చారు.

శ్రిష్టి ఎలిమినేషన్: చివరగా షాలినీ, శ్రిష్టి మిగలగా.. శ్రిష్టి ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించారు. శ్రిష్టి ఎక్కడా ఎమోషనల్ అవ్వకుండా చాలా స్ట్రాంగ్‌గా, నవ్వుతూనే హౌస్ నుంచి బయటకు వచ్చింది. స్టేజ్ మీదికి వచ్చాక తన జర్నీ వీడియో చూసి కాస్త భావోద్వేగానికి గురైంది. ఇంట్లో ఉన్న రాం ప్రసాద్, వర్షిణి, ముఖేష్‌లు ఇంకా మాస్క్ వేసుకునే ఆడుతున్నారని శ్రిష్టి కామెంట్ చేసింది. ముఖ్యంగా రాం ప్రసాద్ అందరినీ ప్రభావితం చేస్తాడని చెప్పింది. వచ్చే వారం నుండి ఆట ‘రోడ్ టు రీలోడ్’ అనే కొత్త థీమ్‌తో మరింత ఆసక్తికరంగా సాగనుందని నాగార్జున తెలియజేయడంతో ఈ ఎపిసోడ్ ముగిసింది.

Follow Us
సృష్టి ఎలిమినేషన్.. స్టార్ ప్లేయర్‌గా ఝాన్సీ..
సృష్టి ఎలిమినేషన్.. స్టార్ ప్లేయర్‌గా ఝాన్సీ..
OTTలో మలయాళం సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
OTTలో మలయాళం సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
APPSC హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాలు.. దరఖాస్తులెప్పట్నుంచంటే?
APPSC హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాలు.. దరఖాస్తులెప్పట్నుంచంటే?
నైరుతి నిష్క్రమణ.. తెలుగురాష్ట్రాలో వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
నైరుతి నిష్క్రమణ.. తెలుగురాష్ట్రాలో వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
బంగారం ధరలపై భారీ ఊరట.. మరోసారి పతనం.. నేటి రేట్లు ఇవే..
బంగారం ధరలపై భారీ ఊరట.. మరోసారి పతనం.. నేటి రేట్లు ఇవే..
ఈ రాశుల వారికి శుభవార్తలే.. శుభవార్తలు.. సోమవారం దిన ఫలాలు ఇదిగో
ఈ రాశుల వారికి శుభవార్తలే.. శుభవార్తలు.. సోమవారం దిన ఫలాలు ఇదిగో
చేపల కోసం గేలం వేస్తే.. వెన్నులో వణుకు పుట్టించే సీన్‌..!
చేపల కోసం గేలం వేస్తే.. వెన్నులో వణుకు పుట్టించే సీన్‌..!
తల్లికి వందనం 2వ విడతకు గ్రీన్ సిగ్నల్.. అరోజే అకౌంట్లోకి డబ్బులు
తల్లికి వందనం 2వ విడతకు గ్రీన్ సిగ్నల్.. అరోజే అకౌంట్లోకి డబ్బులు
'విమానాన్ని కూల్చేయాలనుకున్నా.. చావంటే భయం లేదు!'
'విమానాన్ని కూల్చేయాలనుకున్నా.. చావంటే భయం లేదు!'
విజయవాడలో భారీ మోసం.. పోలీసులమంటూ.. రూ.10 కోట్లు కొట్టేశారు!
విజయవాడలో భారీ మోసం.. పోలీసులమంటూ.. రూ.10 కోట్లు కొట్టేశారు!