మాయాబజార్ సినిమాలో వాడని పాట.. మనవరాలితో కలిసి అద్భుతంగా పాడిన సింగీతం శ్రీనివాసరావు.. వీడియో ఇదిగో..
భారతీయ సినీ పరిశ్రమలో తనదైన సరికొత్త ఆలోచనలతో అనేక ప్రయోగాలు చేసి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచిన దర్శక దిగ్గజం సింగీతం శ్రీనివాస రావు. గత కొన్ని రోజులుగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన శనివారం రాత్రి తుది శ్వాస విడిచారు. ఆయన నిష్క్రమణతో వెండితెరపై ఒక మహోన్నత అధ్యాయం ముగిసింది.

తెలుగు సినీ చరిత్రలోనే ఆణిముత్యం లాంటి చిత్రం మాయాబజార్. కేవీ రెడ్డి దర్శకత్వంలో ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎస్వీఆర్, సావిత్రి వంటి మహానటులతో తెరకెక్కిన ఈ ఆల్ టైమ్ క్లాసిక్‌కి దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు అసిస్టెంట్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. ఈ సినిమా విడుదలై ఆరు దశాబ్దాలు దాటినా, ఇందులో ఉపయోగించని ఒక అరుదైన పాటను 63 ఏళ్ల తర్వాత సింగీతం శ్రీనివాసరావు స్వయంగా పాడి అలరించడం విశేషం. ఈ విషయాన్ని చెబుతూ గతంలో సింగీతం శ్రీనివాసరావు షేర్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతుంది.
ఎక్కువ మంది చదివినవి : Megastar Chiranjeevi: చిరంజీవి, అనుష్క కాంబోలో మిస్సైన సినిమా.. కట్ చేస్తే.. ఆ హీరోయిన్‌తో బాస్ బ్లాక్ బస్టర్ హిట్..
మాయాబజార్ చిత్రానికి మొదట సాలూరి రాజేశ్వరరావు గారు సంగీత దర్శకుడిగా పనిచేస్తూ నాలుగు అద్భుతమైన పాటలను స్వరపరిచారు. ఐదో పాటగా.. ప్రియదర్శిని పెట్టెను శశిరేఖ తెరిచినప్పుడు అభిమన్యుడి రూపం కనిపించే సన్నివేశం కోసం పింగళి నాగేంద్రరావు గారు “కుశలమా కుశలమా నవ వసంత మధురిమ” అంటూ సాగే పల్లవిని రాశారు. సాలూరి వారు దీనికి అద్భుతమైన ట్యూన్ కట్టారు. కానీ, కొన్ని కారణాల వల్ల ఆయన ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడం, ఆ తర్వాత ఘంటసాల గారు సంగీత బాధ్యతలు స్వీకరించడంతో ఈ పాటను సినిమాలో వాడుకోలేకపోయారు. ఈ పాటను వాడుకోలేకపోయామని దర్శకుడు కేవీ రెడ్డి ఎప్పుడూ బాధపడేవారని సింగీతం గుర్తు చేసుకున్నారు.
ఎక్కువ మంది చదివినవి : Cinema : ఐరెన్ లెగ్ అన్న హీరోయిన్.. ఒక్క పాటతో గెల్డోన్ బ్యూటీగా మార్చిన రాఘవేంద్రరావు.. ఇప్పటికీ ఆమె తోపు యాక్టర్..
లాక్‌డౌన్ సమయంలో ఇంట్లో ఉన్న సింగీతం శ్రీనివాసరావు గారికి ఆ పాట మళ్లీ గుర్తుకొచ్చింది. ఆ పాత పల్లవికి కొనసాగింపుగా పూర్తి పాటను రాయాలని ఆయన ప్రముఖ రచయిత వెన్నెలకంటిని కోరగా, ఆయన పల్లవితో పాటు రెండు చరణాలు పూర్తి చేశారు. ఈ పాటకు సింగీతం శ్రీనివాసరావు స్వయంగా బాణీలు సమకూర్చి, జైపాల్ సంగీత సారథ్యంలో తన మనవరాలు అంజనీ నిహిలతో కలసి ఆలపించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతుండగా నెటిజన్స్ ముగ్దులవుతున్నారు.
ఎక్కువ మంది చదివినవి : Cinema : ఈ సినిమాకు ఏం డిమాండ్ రా బాబూ.. ఓటీటీలో గత్తరలేపుతున్న మూవీ.. ఫ్యామిలీతో అస్సలు చూడలేరు..
సింగీతం శ్రీనివాస్ రావు వీడియో..
ఎక్కువ మంది చదివినవి : Nayanthara : తెలుగులో ఆ హీరో నాకు బెస్ట్ ఫ్రెండ్.. కానీ ఇప్పుడు చాలా బిజీ అయిపోయాడు.. నయనతార..
