AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎవరైనా మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతున్నారా..? ఈ ట్రిక్స్‌తో తెలుసుకోండి..

ఎదుటివారి మనసులో ఏముందో తెలుసుకోవడం అంత సులభం కాదు.. ముఖ్యంగా వారు తమ ఇష్టాన్ని దాచిపెట్టినప్పుడు ఇది మరింత పెద్ద పజిల్ లాంటిదే.. అయితే సైకాలజీ ప్రకారం.. ఎవరైనా ఒకరిపై ప్రత్యేక ఆసక్తి పెంచుకుంటే వారి హావభావాలు, ప్రవర్తనలో కొన్ని సూక్ష్మమైన మార్పులు కచ్చితంగా కనిపిస్తాయి. మీ చుట్టూ తిరగడానికి సాకులు వెతుకుతున్న ఆ వ్యక్తి మనసులో అసలు కథేంటో తేల్చేసే ముఖ్యమైన సంకేతాలు ఇవే..

ఎవరైనా మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతున్నారా..? ఈ ట్రిక్స్‌తో తెలుసుకోండి..
Psychological Signs Someone Secretly Likes You
Krishna S
|

Updated on: Oct 05, 2026 | 6:38 PM

Share

ఎవరైనా తమ మనసులోని ప్రేమనైనా లేదా ఇష్టాన్నైనా నేరుగా మాటల్లో వ్యక్తపరచడం అందరికీ సాధ్యం కాదు. ఎక్కడ కాదంటారో అనే భయంతోనో లేదా సిగ్గుతోనో చాలామంది తమ భావాలను గుండెల్లోనే దాచుకుంటారు. అయితే మాటలతో దాచినా.. శరీర భాష , ప్రవర్తనలో వచ్చే మార్పుల ద్వారా తమపై ఉన్న ప్రత్యేక ఆకర్షణను ఇట్టే కనిపెట్టవచ్చని మానసిక నిపుణులు చెబుతున్నారు. ఎవరైనా మిమ్మల్ని రహస్యంగా ఆరాధిస్తున్నారా లేదా తెలుసుకోవడానికి ఉపయోగపడే కీలక సంకేతాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. అందులో మొదటిది.. ఒక సాధారణ సంభాషణలో మీరు ఎప్పుడో క్యాజువల్‌గా చెప్పిన చిన్న చిన్న వివరాలు కూడా వారికి గుర్తున్నాయా? మీరు ఇష్టపడే కాఫీ బ్రాండ్, చిన్ననాటి జ్ఞాపకాలు, మీరు ఇష్టపడే ఆహారం లేదా ఒకప్పుడు పంచుకున్న ఆందోళనలను కూడా వాళ్లు మరచిపోరు. మీరైతే మర్చిపోయి ఉండొచ్చు కానీ వారు ప్రతి విషయాన్ని మనసులో భద్రపరుచుకున్నారంటే మీరంటే వారికి అత్యంత ప్రాధాన్యత ఉందని అర్థం.

మీతో సమయం గడపడానికి సాకులు వెతకడం

మీరు ఎక్కడ ఉంటే అక్కడ వాళ్లు తరచుగా ఎదురవుతున్నారా? మీతో మాట్లాడేందుకు చిన్న చిన్న కారణాలు వెతకడం, ఏ చిన్న సందేహం వచ్చినా మీ దగ్గరికే రావడం, లేదా మీ ప్లాన్లలో తాము కూడా భాగం కావడానికి ప్రయత్నించడం లాంటివి చేస్తుంటారు. ఒకరితో ఉండటానికి పదే పదే ఇలాంటి అవకాశాలు సృష్టించుకుంటున్నారంటే, మీతో ఉండడం వారికి ఎనలేని సంతోషాన్ని ఇస్తోందని గుర్తించవచ్చు.

కళ్ల చూపులే అసలు కథ చెబుతాయి

మాటల కంటే కళ్లే మనసులోని భావాలను స్పష్టంగా వ్యక్తీకరిస్తాయి. మీరు గమనించనప్పుడు మిమ్మల్ని నిశితంగా చూడటం, మీరు వారి వైపు చూడగానే వెంటనే కంగారుగా చూపు తిప్పుకోవడం.. లేదా మాట్లాడేటప్పుడు సాధారణం కంటే ఎక్కువ సమయం కళ్లలోకి సూటిగా చూడటం వారిలోని ప్రత్యేక ఆసక్తిని తెలియజేసే ప్రధాన సంకేతాలు.

తెలియకుండానే మిమ్మల్ని అనుకరించడం

సైకాలజీ ప్రకారం.. ఎవరైనా మనకు బాగా కనెక్ట్ అయినప్పుడు, వారు మన బాడీ లాంగ్వేజ్‌ను తెలియకుండానే అనుకరిస్తారు. మీరు కూర్చునే స్టైల్, చేతుల కదలికలు, లేదా మీరు తరచుగా ఉపయోగించే కొన్ని పదాలు, హావభావాలను వారు కూడా వాడటం మొదలుపెడతారు. దీన్నే మానసిక శాస్త్రంలో మిర్రరింగ్ ఎఫెక్ట్ అంటారు.

మిగతా వారికంటే మీతోనే ఎక్కువ ఆటపట్టించడం

సరదాగా ఆటపట్టించడం, మీతో మాత్రమే స్పెషల్ జోక్స్ వేయడం, మీరు నవ్వేలా చేయడమే లక్ష్యంగా మాట్లాడటం వంటివి కూడా వారి ఆకర్షణకు సూచికలే. అందరితో ఒకలా ఉంటూ మీతో మాత్రం చనువుగా కవ్వించే ప్రయత్నం చేస్తున్నారంటే, మీతో మరింత బలమైన అనుబంధాన్ని పెంచుకోవాలని వారు ఆశిస్తున్నట్లే.

మీ చుట్టూ ఉన్నప్పుడు ప్రవర్తనలో ఆకస్మిక మార్పు

సాధారణంగా ఎంతో కాన్ఫిడెంట్‌గా, హుషారుగా ఉండే వ్యక్తి.. మీరు దగ్గరికి రాగానే అకస్మాత్తుగా సిగ్గుపడటం, కాస్త తడబడటం లేదా నర్వస్‌గా కనిపించడం జరుగుతుందా? లేదా మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి ఉన్నట్టుండి విపరీతమైన శ్రద్ధ చూపించడం చేస్తుంటారా? మీ రాకతో వారి సాధారణ ప్రవర్తనలో స్పష్టమైన మార్పు వస్తోందంటే వారి గుండెల్లో ఏదో అలజడి మొదలైనట్లే..

కేవలం ఒకే ఒక్క సంఘటనను బట్టి నిర్ధారించుకోకుండా.. ఈ లక్షణాలు నిరంతరం వారిలో కనిపిస్తున్నాయా లేదా గమనించాలి. సందర్భాన్ని బట్టి, మొత్తంగా వారి వైఖరిని అంచనా వేస్తూ, సరైన సమయంలో సూటిగా మాట్లాడటం ద్వారా ఎదుటివారి మనసును మరింత స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.

Follow Us