AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: రూ. లక్ష లంచం తీసుకుంటూ.. ఏసీబీకి చిక్కిన జిల్లా వైద్యాధికారి..!

రంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (DMHO) డాక్టర్ స్వర్ణకుమారి లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులకు పట్టుబడిన ఘటన హైదరాబాద్‌లో కలకలం రేపింది. రాజేంద్రనగర్‌ శివరాంపల్లిలోని DMHO కార్యాలయంలో సోమవారం ACB అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు.

Hyderabad: రూ. లక్ష లంచం తీసుకుంటూ.. ఏసీబీకి చిక్కిన జిల్లా వైద్యాధికారి..!
Rangareddy Dmho Acb Raid
Balaraju Goud
|

Updated on: Oct 05, 2026 | 6:14 PM

Share

రంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (DMHO) డాక్టర్ స్వర్ణకుమారి లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులకు పట్టుబడిన ఘటన హైదరాబాద్‌లో కలకలం రేపింది. రాజేంద్రనగర్‌ శివరాంపల్లిలోని DMHO కార్యాలయంలో సోమవారం ACB అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు.

ఎల్‌బీనగర్‌లో లైసెన్స్‌ లేదనే కారణంతో మూసివేసిన ఓ ఫిజియోథెరపీ ఆసుపత్రిని తిరిగి తెరవడానికి అనుమతి ఇవ్వాలంటే రూ.2 లక్షలు లంచం డిమాండ్‌ చేసినట్లు ACBకి ఫిర్యాదు అందినట్లు సమాచారం. ఇందులో భాగంగా మొదటి విడతగా రూ.లక్ష చెల్లించేందుకు ఫిర్యాదుదారు అంగీకరించినట్లు తెలుస్తోంది.

సోమవారం (అక్టోబర్ 05) రూ.లక్షను హెల్త్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాసరావుకు అందించగా, ఆయన ఆ మొత్తాన్ని DMHO డ్రైవర్‌ కృష్ణయ్యకు ఇచ్చినట్లు సమాచారం. కృష్ణయ్య డబ్బులను తీసుకుని కారులో పెట్టేందుకు వెళ్తుండగా ACB అధికారులు పట్టుకున్నారు. అనంతరం DMHO స్వర్ణకుమారితో పాటు హెల్త్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాసరావును కూడా అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

లంచం డిమాండ్‌కు సంబంధించిన వీడియో ఆధారాలు కూడా ACB అధికారుల వద్ద ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం శివరాంపల్లి DMHO కార్యాలయంలో అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. పూర్తి వివరాలు, కేసుకు సంబంధించిన అధికారిక సమాచారం ACB దర్యాప్తు అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us