తుఫాను భయంతో ఒడ్డుకు చేరిన మత్స్యకారులకు మరో షాక్.. లక్షల విలువైన వలలు బుగ్గిపాలు!
అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న వాతావరణం... వరుస తుఫానుల కారణంగా సముద్రంలో వేటకు వెళ్ళలేక పడవలు, వలలు సముద్రం ఒడ్డున సురక్షితంగా దాచుకున్న మత్స్యకారులు.. బంగాళాఖాతంలో ఏర్పడిన 'అక్వాన్' తుఫాను ఆంధ్రప్రదేశ్ తీరం వైపు దూసుకొస్తోందన్న హెచ్చరికలతో బీచ్ ఒడ్డున ఉన్న తుఫాను షెల్టర్లలో మత్స్యకారులు వలలు దాచుకుని హమ్మయ్య అనుకుంటున్నారు. అయితే ఎన్నడూ లేని విధంగా ఒక్కసారిగా ఆ బీచ్‌లో అర్ధరాత్రి కలకలం రేగింది.

అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న వాతావరణం… వరుస తుఫానుల కారణంగా సముద్రంలో వేటకు వెళ్ళలేక పడవలు, వలలు సముద్రం ఒడ్డున సురక్షితంగా దాచుకున్న మత్స్యకారులు.. బంగాళాఖాతంలో ఏర్పడిన ‘అక్వాన్’ తుఫాను ఆంధ్రప్రదేశ్ తీరం వైపు దూసుకొస్తోందన్న హెచ్చరికలతో బీచ్ ఒడ్డున ఉన్న తుఫాను షెల్టర్లలో మత్స్యకారులు వలలు దాచుకుని హమ్మయ్య అనుకుంటున్నారు. అయితే ఎన్నడూ లేని విధంగా ఒక్కసారిగా ఆ బీచ్‌లో అర్ధరాత్రి కలకలం రేగింది.
బీచ్ ఒడ్డున ఉన్న షెల్టర్లలో ఉంచిన వలలకు నిప్పంటుకున్ని భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. లక్షల రూపాయల విలువైన వలలు కంటి ముందే కాలి బూడిదైపోయాయి. మంటలు వేగంగా వ్యాపించడంతో మత్స్యకారులు మంటలను అదుపు చేయలేక పోయారు. వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో 4 ఫైర్ ఇంజన్లతో మంటలను ఫైర్ సిబ్బంది అదుపులోకి తెచ్చారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మత్స్యకారుల జీవనాధారమైన వలలు కాలి బూడిదైపోయాయి. మంటలు పక్కనే ఉన్న పడవలకు కూడా వ్యాపించి ఉంటే ప్రమాదం ఇంకా పెద్దదిగా మారేది. అలా జరగకపోవడం మత్స్యకారులకు ఒకింత ఊరట కలిగించింది.
ప్రకాశం జిల్లా కొత్తపట్నం సముద్రతీరంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. బీచ్ ఒడ్డున తుఫాన్ షెల్టర్లలో ఉంచిన వలలు పెద్ద ఎత్తున తగలబడ్డాయి. మంటలు పూర్తిస్థాయిలో ఎగసిపడటంతో స్థానిక మత్స్యకారులు మంటలు ఆర్పేందుకు వీలు లేకుండా పోయింది. వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో 4 ఫైర్ ఇంజన్ల ద్వారా మంటలను అదుపు తెచ్చేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. సమాచారం తెలుసుకున్న ఒంగోలు ఎమ్మెల్యే దామంచర్ల జనార్ధన్, జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మంటలు అదుపులోకి రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వలలు తగలబడుతున్న సమయంలో పక్కనే ఉన్న పడవల వైపు మంటలు రాకపోవడంతో తీరం ఒడ్డున నిలిపి ఉంచిన పడవలకు ఎలాంటి నష్టం జరగలేదు. నష్టం అంచనా వేసి మత్స్యకారులకు న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తామని ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ తెలిపారు. మరో వైపు ఎవరో కావాలని పెట్రోల్ లేదా కిరోసిన్ పోసి తగలబెట్టి ఉంటారని స్థానిక మత్స్యకారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
కలెక్టర్ పర్యటన..
ప్రకాశం జిల్లా కొత్తపట్నం సముద్రతీరంలో రాత్రి జరిగిన భారీ అగ్నిప్రమాదం ప్రాంతాన్ని ఉదయం జిల్లా కలెక్టర్ రాజాబాబు పరిశీలించారు. అగ్నికి ఆహుతైన తీరం ఒడ్డున నిలిపి ఉంచిన వలలను పరిశీలించారు. అగ్నిప్రమాదం జరగడానికి కారణాలను ఆరా తీయాలని పోలీసులను ఆదేశించారు. ఘటనలో నష్టపోయిన మత్స్యకారులను ఆదుకుంటామని కలెక్టర్ రాజాబాబు భరోసా ఇచ్చారు. ఎన్నడూ లేని విధంగా వలలు అగ్నికి ఆహాతైన ఘటనపై మత్స్యకారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని, ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరుపుతామని కలెక్టర్ తెలిపారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
