కార్తీక మాసంలో ఉసిరి దీపం ఇలా పెడితే అదృష్టం మీదే!

samatha

18 November 2026

Pic credit - Pinterest

కార్తీక మాసం వచ్చేసింది. ఈ సమయంలో ప్రతి ఒక్కరూ శివకేశవులను పూజిస్తూ దీపారాధన చేస్తుంటారు.

కార్తీక మాసం

మరీ ముఖ్యంగా ఈ మాసంలో తప్పకుండా ఉసిరి దీపం వెలిగిస్తుంటారు. దీని వలన అదృష్టం కలిసి వస్తుంది అంటారు.

అదృష్టం

కాగా, ఇప్పుడు మనం కార్తీక మాసంలో ఉసిరి దీపం ఎలా పెడితే అదృష్టం కలిసి వస్తుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

ఉసిరి దీపం ఎలా పెట్టడం మంచిది!

కార్తీక మాసం పరమ పవిత్రమైన మాసం. ఈ మాసంలో దేవాలయాలు, నదీ స్నానాలు, దీపారాధనలు విశేషంగా ఉంటాయి.

పరమ పవిత్ర మాసం

ఇక ఈ మాసంలో శ్రీ మహావిష్ణువు ఉసిరి చెట్టు కింద కొలువై ఉంటాడని ప్రతీతి. అందుకే కార్తీక మాసంలో ఉసిరి దీపారాధన అత్యంత విశిష్టమైనది.

ఉసిరి చెట్టు

దీనిని వెలిగించడం ద్వారా లక్ష్మీ కటాక్షం, శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కలుగుతాయని పండితులు తెలియజేస్తుంటారు. కాగా, దీనిని ఎలా వెలిగించాలి అంటే?

లక్ష్మి కటాక్షం

 ఒక రాగి పళ్ళెంలో తమలపాకులు వేసి, వాటిపై పసుపు, కుంకుమ బొట్లు పెట్టి, నూనెలో లేదా ఆవునేతిలో నానబెట్టిన పువ్వు ఒత్తులను ఉసిరికాయలలో పెట్టి వెలిగించాలి. నెయ్యితో దీపం వెలిగిస్తే మరింత శ్రేష్ఠం.

రాగి పల్లెంలో తమలపాకులు

ఈ దీపాలను తులసికోట ముందు లేదా విష్ణు సన్నిధిలో వెలిగించడం ఉత్తమం. సోమవారం, శనివారం, ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి వంటి రోజులలో ఉసిరి దీపాలను వెలిగిస్తే తీర్థయాత్రలు చేసినంత పుణ్యం లభిస్తుందంట.

తులసి కోట