OTT Movie: ఇట్స్ అఫీషియల్.. ఓటీటీలో సూరి- సుహాస్‌ల 150 కోట్ల బ్లాక్ బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే
టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో సుహాస్ విలన్ గా చేసిన ఈ సినిమా కొన్ని రోజుల క్రితమే థియేటర్లలో రిలీజైంది. తమిళంతో పాటు తెలుగులోనూ రికార్డు కలెక్షన్లు సాధించింది. ప్రపంచవ్యాప్తంగా ఓవరాల్ గా రూ.150 కోట్లు కలెక్ట్ చేసిన ఈ మూవీ అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది.

తమిళ నటుడు సూరి, టాలీవుడ్ వర్సటైల్ యాక్టర్ సుహాస్ ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన సినిమా ‘మండాడి’. జాతీయ అవార్డు గ్రహీత దర్శకుడు వెట్రిమారన్ నిర్మించిన ఈ సినిమాకు మదిమారన్ పుగళేంది దర్శకత్వం వహించారు. రిలీజ్ కు ముందే ఈ సినిమా నుంచి వచ్చిన కంటెంట్ ఆడియెన్స్ లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. టీజర్స్, పోస్టర్స్, ట్రైలర్స్ కూడా ఆడియెన్స్ ను బాగానే ఆకట్టుకున్నాయి. అందుకు తగ్గట్టుగానే సెప్టెంబర్ 10న రిలీజైన మండాడి సినిమాకు మొదటి షో నుంచే సూపర్ హిట్ టాక్ వచ్చింది. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ తో తెరకెక్కిన ఈ సినిమాలో సముద్రంలో సాగే పడవల పోటీలు, సుహాస్- సూరిల నటన, యాక్షన్ ఎలిమెంట్స్ ఆడియెన్స్ కు సరికొత్త థ్రిల్ అందించాయి. అందుకే పోటీగా కార్తీ సర్దార్ 2 సినిమా రిలీజైనా మండాడి సినిమాకే మంచి కలెక్షన్లు వచ్చాయి. తమిళంతో పాటు తెలుగులోనూ మండాడి మూవీకి రికార్డు కలెక్షన్లు వచ్చాయి. ఓవరాల్ గా ఈ సినిమాకు రూ. 150 కోట్లకు పైగానే కలెక్షన్లు వచ్చినట్లు ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. థియేటర్లలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన మండాడి సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది.
‘మండాడి’ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ గురువారం(అక్టోబర్ 08) నుంచి ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ఓటీటీ స్ట్రీమింగ్ కు రానుంది. ఈ విషయాన్ని నెట్ ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోనూ మండాడి స్ట్రీమింగ్ కానుంది. ఆర్‌ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ పతాకంపై ఎల్రెడ్ కుమార్ మండాడి చిత్రాన్ని నిర్మించారు. మహిమా నంబియార్, సత్యరాజ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో మెరిసారు. ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ కుమార్ అందించిన సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. మరి థియేటర్లలో మండాడి సినిమాను మిస్ అయ్యారా? అయితే ఎంచెక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.
మరో మూడు రోజుల్లో నెట్ ఫ్లిక్స్ లోకి మండాడి..
Paaka dhaana poreenga, indha Kaali oda aattatha 😎🔥 https://t.co/vxeR8z5A3F
— Netflix India South (@Netflix_INSouth) October 5, 2026
మండాడి సినిమా ట్రైలర్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




