Watch: న్యూయార్క్‌లో ఒళ్లు గగుర్పొడిచే సీన్.. చూస్తుండగానే కుప్పకూలిన మూడంతస్తుల భవనం!
న్యూయార్క్‌లోని బ్రూక్లిన్‌లో మూడంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా మరో 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించి ఒళ్లు గగుర్పొడిచే కొత్త దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి.

న్యూయార్క్‌లోని బ్రూక్లిన్‌లో మూడంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా మరో 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించి ఒళ్లు గగుర్పొడిచే కొత్త దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. నవంబర్ 11న అదే సమయంలో ఆ మార్గంలో వెళ్తున్న ‘మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్టేషన్ అథారిటీ’ (MTA) బస్సు కెమెరాలో భవనం కుప్పకూలిన దృశ్యం రికార్డయినట్టు తెలుస్తోంది. అధికారులు ఈ ప్రమాద వీడియోను సోషల్ మీడియా వేదికగా విడుదల చేయగా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
భవనం కూలడానికి కారణాలు..
కాగా ఈ ప్రమాదానికి అసలు కారణమేంటనేది ఇంకా పూర్తిస్థాయిలో తెలియాల్సి ఉంది. అయితే ఆ భవనం నిర్మాణ పరిస్థితి ఏమాత్రం బాగోలేదని యజమాని దాఖలు చేసిన పత్రాల ద్వారా తెలుస్తోంది. పక్కనే నిర్మాణ పనుల కోసం తవ్విన గుంతలోకి ఈ భవనం పడిపోవడంతో ఈ ఈ ఘటనపై బ్రూక్లిన్ జిల్లా అటార్నీ కార్యాలయం క్రిమినల్ దర్యాప్తు ప్రారంభించింది. ఈ ప్రమాద ధాటికి పక్కనే ఉన్న భవనం కూడా పూర్తిగా దెబ్బతిందని.. దాన్ని కూడా కూల్చివేయాల్సి ఉంటుందని భవన నిర్మాణ శాఖ అధికారులు వెల్లడించారు.
నిర్మాణ సంస్థ నిర్లక్ష్యమే కొంపముంచిందా?
భవనం కూలడానికి కొన్ని గంటల ముందు వరకు పక్కనే ఉన్న స్థలంలో కార్మికులు తవ్వకాలు జరిపినట్లు న్యూయార్క్ భవన నిర్మాణ కమిషనర్ తెలిపారు. దరఖాస్తు ప్రకారం అక్కడ గరిష్టంగా 14 అడుగుల లోతు వరకు తవ్వకాలు జరపాల్సి ఉందన్నారు. ప్రస్తుతం ఆ ప్రాజెక్టును చేపడుతున్న రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్ రాబర్ట్ ఫిష్‌మన్‌కు చెందిన నిర్మాణ సంస్థపై అధికారులు దృష్టి సారించారు. ఆ బృందానికి సంబంధించి న్యూయార్క్ నగరవ్యాప్తంగా ఉన్న 160కి పైగా నిర్మాణ స్థలాల్లో అధికారులు ముమ్మర తనిఖీలు చేపట్టారు.
ఇక సదరు నిర్మాణ సంస్థ అక్కడ 64 అపార్ట్‌మెంట్లు, కమ్యూనిటీ స్పేస్, కిరాణా దుకాణంతో కూడిన తొమ్మిది అంతస్తుల భారీ భవనాన్ని నిర్మించాలని భావించింది. కానీ అధికారులు కేవలం మూడంతస్తుల భవనానికి మాత్రమే అనుమతి ఇచ్చారు. గతంలోనూ ఈ సంస్థ నిబంధనలను ఉల్లంఘించినట్లు అధికారుల తనిఖీల్లో తేలింది. మార్చి నెలలో ఎలాంటి భద్రతా ఏర్పాట్లు లేకుండా పాత భవనాన్ని కూల్చివేస్తున్నందుకు అధికారులు పనులను నిలిపివేయాలని (స్టాప్-వర్క్ ఆర్డర్) ఆదేశించారు. అయినా సరే ఆదేశాలను బేఖాతరు చేస్తూ కూల్చివేత పూర్తి చేయడంతో, మే నెలలో కాంట్రాక్టర్‌కు 10 వేల డాలర్ల జరిమానా విధించారు. ఇప్పుడు ఈ భారీ విషాదం చోటుచేసుకోవడంతో నిర్మాణ సంస్థ నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఒళ్లు గగుర్పొడిచే సీన్..
WATCH: Newly released bus footage captures the deadly Brooklyn building collapse; the rest of the damaged building is now being demolished, officials say. https://t.co/sjDKu2Ily6
— Scope Report (@ScopeReport_) November 19, 2026
