Flipkart Big Billion Days Sale: ఐఫోన్ ప్రియులకు గుడ్ న్యూస్.. iPhone 15, iPhone 17పైభారీ డిస్కౌంట్
Flipkart Big Billion Days Sale: కొత్త ఐఫోన్ కొనాలని ఎదురుచూస్తున్న వారికి ఫ్లిప్‌కార్ట్ అదిరిపోయే ఆఫర్లను ప్రకటించింది. త్వరలో ప్రారంభం కానున్న Big Billion Days Sale 2026లో Appleకు చెందిన ప్రముఖ మోడళ్లపై భారీ డిస్కౌంట్లు అందుబాటులోకి రానున్నాయి. ముఖ్యంగా iPhone 17, iPhone 15 ధరలు భారీగా తగ్గనున్నాయి..

Flipkart Big Billion Days Sale: ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ నిర్వహించే అత్యంత ప్రజాదరణ పొందిన ‘బిగ్ బిలియన్ డేస్’ (Big Billion Days) సేల్‌లో ఆపిల్ ఐఫోన్లపై భారీ డిస్కౌంట్లు లభిస్తున్నాయి. ఐఫోన్ ప్రేమికులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఈ సేల్‌లో ఐఫోన్ 15, ఐఫోన్ 17 సిరీస్ మోడళ్లపై లభిస్తున్న ఆఫర్ వివరాలు ఇవే:
ఆఫర్లు, ధరల వివరాలు:
- ఐఫోన్ 15 (iPhone 15): ఈ సేల్‌లో ఐఫోన్ 15 ఆఫర్ ధర రూ. 63,999 కి అందుబాటులోకి వచ్చింది. బ్యాంక్ ఆఫర్లు, కార్డ్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లను ఉపయోగించుకోవడం ద్వారా ఈ ధరకు సొంతం చేసుకోవచ్చు.
- ఐఫోన్ 17 (iPhone 17): లేటెస్ట్ సిరీస్‌కు చెందిన ఐఫోన్ 17 మోడల్ ఈ సేల్‌లో రూ. 77,999 ప్రారంభ ధరకు లభిస్తోంది.
- అదనపు బ్యాంక్ ఆఫర్లు: నిర్దిష్ట బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డులపై తక్షణ డిస్కౌంట్ (Instant Discount) మరియు నో-కాస్ట్ EMI సౌకర్యాలు కూడా అందుబాటులో ఉన్నాయి.
iPhone 17పై భారీ డిస్కౌంట్
ఫ్లిప్‌కార్ట్ Big Billion Days Saleలో iPhone 17 256GB వేరియంట్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఈ ఫోన్ సాధారణంగా రూ.99,900 ధరతో లిస్టింగ్‌లో ఉండగా.. సేల్ సమయంలో రూ.84,999కు లభించనుంది. దీనికి అదనంగా అందుబాటులో ఉన్న ప్రయోజనాలను ఉపయోగించుకుంటే ధర మరింత తగ్గుతుంది.
- సేల్ ధర: రూ.84,999
- గరిష్ఠంగా 5% క్యాష్‌బ్యాక్: రూ.4,000 వరకు
- ఎక్స్ఛేంజ్ బోనస్: రూ.3,000
- ఎఫెక్టివ్ ధర: రూ.77,999
అంటే గరిష్ఠ ప్రయోజనాలు అందుకున్న కస్టమర్‌కు iPhone 17ను రూ.77,999 ఎఫెక్టివ్ ధరకు సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది.
iPhone 15 కూడా భారీ తగ్గింపు
iPhone 15 కొనాలనుకునే వారికి కూడా ఈ సేల్‌లో మంచి డీల్ కనిపిస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌లో దీని లిస్టెడ్ ధర రూ.74,900గా ఉండగా.. Big Billion Days Saleలో రూ.67,999కు సేల్ ధరగా లభించనుంది.
దీనిపై:
- సేల్ ధర: రూ.67,999
- క్రెడిట్ కార్డు డిస్కౌంట్: రూ.1,000
- ఎక్స్ఛేంజ్ బోనస్: రూ.3,000
- ఎఫెక్టివ్ ధర: రూ.63,999. అంటే గరిష్ఠంగా పేర్కొన్న ప్రయోజనాలను పొందితే iPhone 15ను రూ.63,999 ఎఫెక్టివ్ ధరకు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.
ఇది కూడా చదవండి: Gold Price: బంగారం ప్రియులకు తీపి కబురు.. రూ.1.34 లక్షలకు దిగిరానున్న తులం బంగారం ధర? నిపుణులు ఏమంటున్నారంటే!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




