లక్ష కోట్ల క్లబ్‌లో మేఘా.. ఇన్‌ఫ్రా రంగంలో సరికొత్త చరిత్ర.. హైదరాబాద్ నుంచి గ్లోబల్ స్థాయికి..
చిన్న సంస్థగా మొదలై లక్ష కోట్ల రూపాయల సామ్రాజ్యంగా ఎదిగింది మేఘా ఇంజనీరింగ్ సంస్థ. అడుగుపెట్టిన ప్రతి రంగంలోనూ సంచలనాలు సృష్టిస్తూ, దేశవ్యాప్తంగా భారీ ప్రాజెక్టులకు కేరాఫ్ అడ్రస్‌గా మారి గ్లోబల్ ఇన్వెస్టర్ల ఫేవరెట్‌గా నిలిచింది. ఇప్పుడు లక్ష కోట్ల క్లబ్‌లో చేరి సరికొత్త చరిత్ర లిఖించింది.

భారత ఇన్‌ఫ్రా రంగంలో మేఘా మ్యాజిక్ కంటిన్యూ అవుతోంది. అంతర్జాతీయ ఇన్వెస్టర్ల నుంచి ఏకంగా 700 మిలియన్ డాలర్లు.. అంటే మన కరెన్సీలో 6వేల 580 కోట్ల భారీ పెట్టుబడులను సమీకరించి లక్ష కోట్ల వాల్యుయేషన్ ఉన్న సంస్థగా సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. డేవిడ్‌సన్ కెంప్నెర్, హిల్‌హౌస్, వర్డే పార్ట్‌నర్స్ లాంటి మూడు అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు మేఘాపై కాసుల వర్షం కురిపించాయి. ఈ డీల్‌తో మేఘా గ్రూప్ విలువ లక్ష కోట్ల రూపాయలకు చేరగా, అనుబంధ సంస్థ EPTL విలువ 14 వేల కోట్లు అయ్యింది. దీంతో దేశంలోనే అత్యంత విలువైన ప్రైవేట్ ఇన్‌ఫ్రా గ్రూప్‌ల ఎలైట్ క్లబ్‌లో మేఘా చేరిపోయింది. మూడు దశాబ్దాలుగా 20కి పైగా దేశాల్లో తన జెండా ఎగురవేస్తోంది మేఘా. దేశంలో గేమ్ ఛేంజర్ ప్రాజెక్టులైన పాలమూరు-రంగారెడ్డి, కాళేశ్వరం, పోలవరం నుంచి.. కశ్మీర్‌లోని జోజిలా టన్నెల్, ముంబై కోస్టల్ రోడ్ వరకు ఎక్కడ చూసినా మేఘా మార్క్ కనిపిస్తోంది.
అంతేకాదు సుమారు 1,975 కిలోమీటర్ల రహదారుల పోర్ట్‌ఫోలియోతో రవాణా రంగంలో దూసుకుపోతోంది. ఇన్‌ఫ్రా మాత్రమే కాదు, ఫ్యూచర్ ఎనర్జీ రంగంలోనూ మేఘానే కింగ్. 9,110 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టులతో పాటు కర్ణాటక కైగాలో రెండు 700 మెగావాట్ల అణు రియాక్టర్లను నిర్మిస్తోంది. అటు మంగోలియాలో ఆయిల్ రిఫైనరీని నిర్మిస్తూ ఇంటర్నేషనల్ లెవెల్‌లో సత్తా చాటుతోంది. మరోవైపు ఒలెక్ట్రా, ఈవీట్రాన్స్ ద్వారా ఎలక్ట్రిక్ బస్సుల విప్లవాన్ని నడిపిస్తూ, మేఘా గ్యాస్ ద్వారా ఇంటింటికీ ఇంధనాన్ని అందిస్తోంది.
మొత్తంగా హైదరాబాద్ నుంచి మొదలై గ్లోబల్ స్థాయికి ఎదిగిన మేఘా ఇంజనీరింగ్… లక్ష కోట్ల మైలురాయితో భారత ఇన్‌ఫ్రా చరిత్రలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకుంది.
