AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

DMartలో అన్ని ఉన్నా ఇవి మాత్రం ఎందుకు ఉండవు.. వెనుకున్న అసలు బిజినెస్ సీక్రెట్ ఇదే!

DMart: డీమార్ట్‌ అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది నిత్యావసర వస్తువులతో పాటు రోజు వారీగా ఉపయోగించేందుకు రకరకాల వస్తువులు ఇక్కడ తక్కువ ధరల్లో అందుబాటులో ఉంటాయి. సామాన్యుడి నుంచి ఉన్నత వర్గాల వరకు డీమార్ట్‌కే ఎక్కువగా వెళ్తుంటారు. అయితే డీమార్ట్‌లో అన్ని ఉన్నా ఇవి మాత్రం ఎందుకు ఉడవనే ప్రశ్న చాలా మందిలో తలెత్తుతుంటుంది. డీమార్ట్‌ బిజినెస్‌ వెనుక ఉన్న సీక్రెట్‌ ఇదే..

DMartలో అన్ని ఉన్నా ఇవి మాత్రం ఎందుకు ఉండవు.. వెనుకున్న అసలు బిజినెస్ సీక్రెట్ ఇదే!
Dmart Shopping
Subhash Goud
|

Updated on: Oct 05, 2026 | 4:57 PM

Share

డి-మార్ట్ (DMart) అంటే గుర్తుకువచ్చేది నిత్యావసర సరుకులు, తక్కువ ధరలు, ఆకర్షణీయమైన డిస్కౌంట్లు. కిరాణా సరుకుల నుంచి టీ-షర్టులు, నైటీలు, కుర్తీల వరకు ఎన్నో వస్తువులు డి-మార్ట్‌లో లభిస్తాయి. అయితే ఇన్ని రకాల దుస్తులు విక్రయించే డి-మార్ట్‌లో సాధారణంగా చీరలకోసం ప్రత్యేక కౌంటర్ ఎందుకు ఉండదో ఎప్పుడైనా గమనించారా? దీని వెనుక ఒక బలమైన బిజినెస్ లాజిక్ ఉంది.

  1. ఇన్వెంటరీ టర్నోవర్: డి-మార్ట్ విజయ రహస్యం “హై ఇన్వెంటరీ టర్నోవర్”. అంటే స్టాక్ ఎంత వేగంగా అమ్ముడై నగదుగా మారితే, కంపెనీకి అంత ప్రయోజనం. నిత్యావసరాలు, టీ-షర్టులు వేగంగా అమ్ముడవుతాయి.
  2. చీరల ఎంపికకు ఎక్కువ సమయం పడుతుంది: చీరల విషయానికి వస్తే కస్టమర్లు డిజైన్, కలర్, క్లాత్, క్వాలిటీ వంటి అంశాలను పరిశీలించి ఎంపిక చేసుకోవడానికి ఎక్కువ సమయం తీసుకుంటారు. చీరలను చూపించడానికి ప్రత్యేకంగా సేల్స్ సిబ్బంది అవసరమవుతారు. తర్వాత చీరలను మడతపెట్టడం కోసం సమయం తీసుకుంటుంది. ఇది డి-మార్ట్ అనుసరించే “సెల్ఫ్ సర్వీస్” మోడల్‌కు భిన్నంగా ఉంటుంది.
  3. ట్రెండ్స్, స్టాక్ మిగిలిపోయే ప్రమాదం: చీరలలో వందల రకాల డిజైన్లు, ఫ్యాషన్ ట్రెండ్స్ మారుతుంటాయి. అమ్ముడవని స్టాక్ డెడ్ ఇన్వెంటరీగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. అంతేకాకుండా చీరలను ప్రదర్శించడానికి ఎక్కువ డిస్‌ప్లే స్పేస్ (Floor Space) అవసరమవుతుంది. అందుకే తక్కువ సేల్స్ టర్నోవర్ ఉండే చీరల కంటే, వేగంగా అమ్ముడయ్యే దుస్తులు, గ్రోసరీ కేటగిరీలకే డి-మార్ట్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. (అయితే కొన్ని పండుగల సమయంలో లేదా నిర్దిష్ట బ్రాంచ్‌లలో ప్రయోగాత్మకంగా పరిమిత స్టాక్ ఉంచే అవకాశం ఉంటుంది).
  4. డి-మార్ట్ బిజినెస్ మోడల్: డి-మార్ట్ ప్రధాన వ్యూహం. ఏ వస్తువైతే వేగంగా అమ్ముడై రేపు మళ్లీ కొత్త స్టాక్ వస్తుందో దానిపైనే వారు దృష్టి పెడతారు.
  5. అన్‌స్టిచ్డ్ / హెవీ వేర్ క్లాతింగ్ లేకపోవడం: డి-మార్ట్‌లలో ఎక్కువగా రెడీమేడ్, స్టాండర్డ్ సైజ్ బట్టలు (T-Shirts, Jeans, Trackpants, Nighties) ఉంటాయి. వీటిని కస్టమర్లే స్వయంగా ఎంచుకుని ట్రాలీలో వేసుకోవచ్చు. కానీ చీరలు, సూట్ మెటీరియల్స్ చూపించడానికి హెల్పర్లు కావాలి. పైగా కస్టమర్ ఎక్కువ సమయం తీసుకుంటారు. ఇది డి-మార్ట్ స్పేస్, టైమ్ మేనేజ్‌మెంట్‌కు సరిపోదు. అందుకే డీమార్ట్‌లో చీరలు ఉండవు.

ఇది కూడా చదవండి: Gold Price: బంగారం ప్రియులకు తీపి కబురు.. రూ.1.34 లక్షలకు దిగిరానున్న తులం బంగారం ధర? నిపుణులు ఏమంటున్నారంటే!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
తుపాకీలు చేత పట్టిన ఇరాన్‌ మహిళలు! అమెరికా భూతల దాడులా?
తుపాకీలు చేత పట్టిన ఇరాన్‌ మహిళలు! అమెరికా భూతల దాడులా?
DMartలో అన్ని ఉన్నా ఇవి ఎందుకు ఉండవు.. అసలు బిజినెస్ సీక్రెట్ ఇదే
DMartలో అన్ని ఉన్నా ఇవి ఎందుకు ఉండవు.. అసలు బిజినెస్ సీక్రెట్ ఇదే
బీసీసీఐ వద్దంది.. కట్‌చేస్తే.. కెప్టెన్‌గా లక్కీ ఛాన్స్.. ఎవరంటే?
బీసీసీఐ వద్దంది.. కట్‌చేస్తే.. కెప్టెన్‌గా లక్కీ ఛాన్స్.. ఎవరంటే?
పాత మర్డర్ కేసును బయటపెట్టిన బీచ్‌లో కొట్లాట..!
పాత మర్డర్ కేసును బయటపెట్టిన బీచ్‌లో కొట్లాట..!
తెల్లం అన్నం దీని ముందు జుజుబీ.. గిన్నెడు తింటే ఏ రోగం రానివ్వదు
తెల్లం అన్నం దీని ముందు జుజుబీ.. గిన్నెడు తింటే ఏ రోగం రానివ్వదు
25 రోజుల్లోనే పంట చేతికి.. ఈ ట్రిక్స్ తెలిస్తే పాలకూర సాగుతో..
25 రోజుల్లోనే పంట చేతికి.. ఈ ట్రిక్స్ తెలిస్తే పాలకూర సాగుతో..
జల్సాల కోసం కన్నతల్లి ఇంటికే నిప్పుపెట్టిన కుమారుడు..
జల్సాల కోసం కన్నతల్లి ఇంటికే నిప్పుపెట్టిన కుమారుడు..
మకరంలోకి రాహువు.. ఈ 3 రాశులకు ఉద్యోగం, డబ్బు విషయంలో అదృష్టం!
మకరంలోకి రాహువు.. ఈ 3 రాశులకు ఉద్యోగం, డబ్బు విషయంలో అదృష్టం!
రూ.500 నోటుతో చేసిన ఒక్క రీల్‌తో జైలుకు..!
రూ.500 నోటుతో చేసిన ఒక్క రీల్‌తో జైలుకు..!
బంగారం ప్రియులకు తీపి కబురు.. రూ.1.34 లక్షలకు దిగిరానున్న గోల్డ్
బంగారం ప్రియులకు తీపి కబురు.. రూ.1.34 లక్షలకు దిగిరానున్న గోల్డ్