AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Business Ideas: 9 కమీషన్ బిజినెస్‌ల గురించి మీకు తెలుసా?: పెట్టుబడి లేకుండా అధిక ఆదాయం సంపాదించే మార్గాలు!

Commission Business Ideas: ఈ తొమ్మిది ఐడియాలలో మూడు ముఖ్యమైన విషయాలు సాధారణంగా కనిపిస్తాయి. మొదటిది జీరో లేదా చాలా తక్కువ ఇన్వెస్ట్‌మెంట్. మీరు ప్రాడక్ట్ తయారు చేయాల్సిన అవసరం లేదు, స్టాక్ కొనాల్సిన అవసరం లేదు. రెండవది సంపాదనకు ఒక ఫిక్స్‌డ్..

Business Ideas: 9 కమీషన్ బిజినెస్‌ల గురించి మీకు తెలుసా?: పెట్టుబడి లేకుండా అధిక ఆదాయం సంపాదించే మార్గాలు!
Business Ideas
Subhash Goud
|

Updated on: Nov 17, 2026 | 7:09 AM

Share

Commission Business Ideas: ప్రపంచంలోని అతిపెద్ద టాక్సీ కంపెనీలలో ఒకటైన ఊబర్ (Uber) దగ్గర ఒక్క కారు కూడా లేదు. అదేవిధంగా ప్రపంచంలోనే అతిపెద్ద హోటల్ బుకింగ్ ప్లాట్‌ఫామ్‌లలో ఒకటైన ఎయిర్‌బిఎన్‌బి (Airbnb) దగ్గర ఒక్క హోటల్ రూమ్ కూడా లేదు. రియల్ ఎస్టేట్ బ్రోకర్ల దగ్గర సొంతంగా ఒక్క ప్రాపర్టీ ఉండకపోవచ్చు. మరి వీరందరూ ఇంత డబ్బు ఎలా సంపాదిస్తున్నారు? కొనేవాళ్ళను అమ్మేవాళ్ళతో కలిపారు. అవసరం ఉన్న ఇద్దరినీ గుర్తించి, వారికి పరిచయం చేసి, డీల్ కుదిరేలా చేశారు. అందుకు ప్రతిఫలంగా ప్రతి డీల్‌లో కొంత కమీషన్ తీసుకున్నారు. ఇదే డీల్ కుదిర్చి సంపాదించే బిజినెస్ మోడల్.

ఈ బిజినెస్ చేయడానికి డబ్బు కంటే ముఖ్యంగా మూడు విషయాలు అవసరం: నమ్మకం, పరిచయాలు, సరిగ్గా మాట్లాడే విధానం. ఈ మూడు ఉంటే ఇలాంటి బిజినెస్‌లు మీకు మంచి అవకాశం కావచ్చు. ఈ వ్యాపార విధానం చాలా సులభం: ఒక కొనుగోలుదారుడు (బయ్యర్), ఒక విక్రేత (సెల్లర్) ఉంటారు. వారిద్దరికీ ఒకరి గురించి ఒకరికి తెలియకపోవచ్చు లేదా నేరుగా డీల్ చేయడానికి సంకోచించవచ్చు. ఇక్కడే మీకు అవకాశం వస్తుంది. మీరు వారిద్దరినీ పరిచయం చేసి, వారి అవసరాలను అర్థం చేసుకుని, డీల్ కుదిరేలా చేస్తారు. డీల్ పూర్తయిన తర్వాత, మీకు కొంత కమీషన్ వస్తుంది. ఈ కమీషన్ డీల్ విలువను బట్టి వందల రూపాయల నుంచి లక్షల రూపాయల వరకు ఉండొచ్చు.

9 కమీషన్ బిజినెస్ ఐడియాలు:

1. ప్రాపర్టీ డీల్స్: ఇల్లు కొనాలనుకునేవారు. అమ్మాలనుకునేవారు లేదా అద్దెకి ఇవ్వాలనుకునే వారి మధ్య డీల్స్ కుదర్చడం. సరైన ప్రాపర్టీని సరైన వ్యక్తికి చూపించి, డీల్ పూర్తయితే కమీషన్ పొందవచ్చు. రెంటల్ డీల్‌లో ఒక నెల అద్దె వరకు పర్చేస్ డీల్‌లో ప్రాపర్టీ విలువలో 1% నుంచి 2% వరకు కమీషన్ ఉండొచ్చు.

ఇవి కూడా చదవండి

2. జాబ్ ప్లేస్‌మెంట్స్: కంపెనీలకు ఉద్యోగులు కావాలి. ఉద్యోగం కోసం చూస్తున్న వారికి జాబ్ కావాలి. సరైన కంపెనీకి సరైన వ్యక్తిని, సరైన వ్యక్తికి సరైన ఉద్యోగాన్ని కనుగొని డీల్ కుదిర్చడం. ఒక సక్సెఫుల్‌ ప్లేస్‌మెంట్ మీద క్యాండిడేట్ జీతంలో 1 నుంచి 3 నెలల జీతం వరకు కమీషన్ రావచ్చు.

3. పెళ్లి సంబంధాలు కుదిర్చడం: ఇప్పటికీ దీనికి మంచి డిమాండ్ ఉంది. సరైన జోడీ కోసం వెతికే కుటుంబాలను గుర్తించి, వారి నేపథ్యం, అంచనాలు తెలుసుకుని, వారికి సరిపోయే మ్యాచెస్ వెతకడం. ఒక సక్సెఫు్‌ మ్యాచ్ మీద రూ.5,000 నుంచి మరింత ఎక్కువగా కమీషన్ ఉండొచ్చు.

4. వాహనాల డీల్స్: సెకండ్ హ్యాండ్ కార్లు, బైక్‌లు, ట్రక్కులు, కమర్షియల్ వాహనాల కొనుగోలు, అమ్మకం డీల్స్ కుదర్చడం. బయ్యర్, సెల్లర్ మధ్య నమ్మకాన్ని కల్పించి, డీల్ కుదిరేలా చేయాలి. ఒక కార్ డీల్ మీద రూ.3,000 నుంచి రూ.15,000 వరకు కమీషన్ రావచ్చు.

5. బిజినెస్ టు బిజినెస్ డీల్స్ (B2B): ఒక కంపెనీకి రా మెటీరియల్ కావాలన్నా, ఒక కంపెనీ పెద్ద క్వాంటిటీలో ఆర్డర్ సప్లై చేయగలదన్నా, ఆ రెండు కంపెనీలను కలిపి డీల్ కుదర్చడం. ఇలాంటి డీల్స్ విలువ లక్షల నుంచి కోట్ల రూపాయల వరకు ఉండొచ్చు. 1% కమీషన్ వచ్చినా పెద్ద మొత్తంలో ఆదాయం లభిస్తుంది.

6. ఇన్సూరెన్స్: లైఫ్, హెల్త్, వెహికల్, బిజినెస్ ఇన్సూరెన్స్ వంటి ప్రొడక్ట్స్‌ను కస్టమర్ అవసరాలకు అనుగుణంగా సూచించడం. ఐఆర్డిఏఐ (IRDAI) లైసెన్సింగ్ ప్రక్రియను పాటించి, పాలసీలు తీసుకున్న తర్వాత కమీషన్ పొందవచ్చు. మొదటి సంవత్సరం ప్రీమియంలో 30% నుంచి 40% వరకు కమీషన్ లభించవచ్చు.

7. ల్యాండ్ డీల్స్: వ్యవసాయ భూములు, ప్లాట్స్, కమర్షియల్ ప్లాట్స్ కొనుగోలు, అమ్మకం డీల్స్ కుదర్చడం. ప్రాపర్టీ బిజినెస్‌లో ఇది చాలా ఎక్కువ విలువ ఉన్న విభాగం. లోకల్ ఏరియా మీద మంచి అవగాహన, ల్యాండ్ రికార్డ్స్, బేసిక్ లీగల్ ప్రొసీజర్స్ తెలియాలి. ల్యాండ్ డీల్స్ లో 1% నుంచి 2% వరకు కమీషన్ ఉండొచ్చు.

8. ఫ్రైట్, ట్రాన్స్‌పోర్ట్: సరుకు పంపించాలనుకునే వారికి సరైన ట్రక్కును, ట్రక్కు ఓనర్లకు సరైన లోడ్‌ను కనుగొని డీల్ కుదర్చడం. ఒక్క ట్రక్ లోడ్ మీద రూ.500 నుంచి రూ.3,000 వరకు కమీషన్ ఉండొచ్చు. ఈ బిజినెస్‌ను చాలా వరకు ఫోన్ నుంచే నడపవచ్చు.

9. లోన్స్, ఫైనాన్స్ (DSA): బ్యాంక్స్, ఎన్‌బిఎఫ్‌సిలకు (NBFCs) లోన్ కస్టమర్లను రెఫర్ చేయడం. హోమ్ లోన్స్, బిజినెస్ లోన్స్, పర్సనల్ లోన్స్, వెహికల్ లోన్స్ వంటివి ఇందులో ఉంటాయి. లోన్ అప్రూవ్ అయ్యి, అమౌంట్ డిస్బర్స్ అయితే కమీషన్ వస్తుంది. హోమ్ లోన్ పై డిస్బర్స్డ్ అమౌంట్ లో 0.3% నుంచి 0.5% వరకు కమీషన్ రావచ్చు.

ఈ తొమ్మిది ఐడియాలలో మూడు ముఖ్యమైన విషయాలు సాధారణంగా కనిపిస్తాయి. మొదటిది జీరో లేదా చాలా తక్కువ ఇన్వెస్ట్‌మెంట్. మీరు ప్రాడక్ట్ తయారు చేయాల్సిన అవసరం లేదు, స్టాక్ కొనాల్సిన అవసరం లేదు. రెండవది సంపాదనకు ఒక ఫిక్స్‌డ్ లిమిట్ ఉండకపోవడం. మీరు ఎన్ని డీల్స్ కుదిరిస్తే అంత ఆదాయం. మూడవది దీనిని స్కేల్ చేయవచ్చు. మొదట మీరు ఒంటరిగా ప్రారంభించి, ఆపై ఒక టీమ్‌ను నిర్మించుకోవచ్చు. గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఇక్కడ మీకు ఉన్న అతిపెద్ద ఇన్వెస్ట్‌మెంట్ డబ్బు కాదు, నమ్మకం. ఎప్పుడూ నిజాయితీగా ఉండండి. బయ్యర్ కి, సెల్లర్ కి నిజమైన సమాచారమే చెప్పండి. మీ రెప్యూటేషన్ అనేది మీ బిజినెస్‌లో అత్యంత విలువైన ఆస్తి. ఓపికగా నేర్చుకుంటూ, నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ముందుకు వెళితే, జీరో లేదా తక్కువ పెట్టుబడితో కూడా ఒక లాభదాయకమైన వ్యాపారాన్ని నిర్మించవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us