AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డీమార్ట్‌‌లో ఇలా చేస్తే తక్కువ ధరకే సరుకులు.. ఈ టాప్ సీక్రెట్ చాలామందికి తెలియదు..

డీమార్ట్‌లో షాపింగ్ చేసేటప్పుడు చాలామంది ఆఫర్ చూసి ఆకర్షితులు అవుతారు. తక్కువ ధరకే వస్తుందని తమ బాస్కెట్‌లో వేసుకుంటారు. చివరికి బిల్లింగ్ కౌంటర్ దగ్గరకు వెళ్లేసరికి చెంటాడంత బిల్లు చూసి అవాక్కవుతారు. ఈ విషయాలు తెలుసుకోవడం వల్ల డీమార్ట్ షాపింగ్‌లో మీ బిల్లు సగానికి సగం తగ్గించుకోవచ్చు. అదెలానో చూడండి..

డీమార్ట్‌‌లో ఇలా చేస్తే తక్కువ ధరకే సరుకులు.. ఈ టాప్ సీక్రెట్ చాలామందికి తెలియదు..
Dmart Shopping
Venkatrao Lella
|

Updated on: Nov 16, 2026 | 9:24 PM

Share

సామాన్యుడి షాపింగ్‌కు వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ డీమార్ట్. అతి తక్కువ ధరకే ఇంట్లోకి కావాల్సిన వస్తువులన్నీ తెచ్చుకునేందుకు ఇక్కడికి సామాన్య ప్రజలు వెళ్తుంటారు. ఒకేసారి నెలకు సరిపోయేంత కిరాణా సరుకులన్నీ తెచ్చేసుకుంటారు. దీని వల్ల ప్రతీసారి షాప్‌కు వెళ్లాల్సిన పని ఉండదు. ఇంట్లోనే అన్నీ అందుబాటులో ఉండటం వల్ల పని సులువవుతుంది. డీమార్ట్ షాపింగ్ చేసేటప్పుడు కొన్ని స్మార్ట్ టిప్స్ పాటించడం వల్ల మీ బిల్లు మరింత తగ్గించుకోవచ్చు. ఆఫర్ల మోజులో పడకుండా నిజంగా తక్కువ ధరకే వచ్చే వస్తువులు, సరైన పరిమాణంలో కొనుగోలు చేయడం వల్ల భారీగా డబ్బులు ఆదా చేసుకోవచ్చు.

ఈ స్మార్ట్ టిప్స్ ఫాలో అవ్వండి

డీమార్ట్‌కు వెళ్లినప్పుడు చాలామంది ఆఫర్లను చూసి తక్కువ ధరకు వస్తున్నాయనే ఉద్దేశంతో అనవసరమైన వస్తువులను కొనుగోలు చేస్తుంటారు. దీనికి దూరంగా ఉండేందుకు మీరు డీమార్ట్‌కు వెళ్లేముందు మీ ఇంట్లో ఏయే వస్తువులు ఉన్నాయి..? ఏయే సరుకులు కొనాలి? అనే తెలుసుకోవడం ముఖ్యం. అలాగే బియ్యం, పంచదార, గోధుమపిండి, వంటనూనె, ఇతర పప్పు ధాన్యాలు వంటివి ఎంత పరిమాణంలో నిల్వ ఉన్నాయనేది చెక్ చేసుకోండి. ఒక పేపర్‌లో ఇవన్నీ రాసుకుని ఇంకెత కొనాలనేది అంచనా వేసుకోండి. దీని వల్ల అవసరం లేని వ్యక్తులను కొనుగోలు చేసే అవకాశం ఉండకపోవడం వల్ల డబ్బులు ఎక్కువ మిగులుతాయి. పప్పులు, బియ్యం లాంటి బల్క్‌గా కొనుగోలు చేసేటప్పుడు వాటిపై ఉండే ఆఫర్లను చూడండి. పెద్ద ప్యాకేట్లపై ఎక్కువ ఆఫర్ వస్తుందా.. లేదా కిలో, 5 కిలోల లాంటి చిన్న ప్యాకెట్లపై ఎక్కువ ఆఫర్ ఉందా అనేది చెక్ చేసుకుని కొనండి. ఉదాహరణకు కిలో ప్యాకెట్ రూ.100గా ఉండి రెండు కిలోల ప్యాకెట్ రూ180కి లభిస్తున్న వాటిని ఎంచుకోండి.

కాంబో ఆఫర్లలో కొంటున్నారా..?

టూత్ పేస్ట్, షాంపూలు, సబ్బులు, ఇతర క్లీనింగ్, పర్సనల్ కేర్ వస్తువులపై కాంబో ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. ఇలాంటి వాటిని కొనేముందు అవి ఇంట్లో అందరికీ ఉపయోపడతాయా.. లేదా అనేది చూడండి. వాటిపై ఉన్న ఎక్స్‌పైరీ తేదీని కూడా చూడండి. ఇంట్లోకి తరచూ ఉపయోగించే డిష్ వాష్ లిక్విడ్, వాషింగ్ పౌడర్, టాయిలెట్ క్లీనర్ లాంటివి కొనుగోలు చేస్తుంటే.. 100 మిల్లీలీటర్లకు ఎంత ధర పడుతుందనేది లెక్క వేసుకోండి. బిస్కెట్లు, చిప్స్, కూల్ డ్రింక్స్ వంటివి భారీ తగ్గింపుకు లభిస్తాయి. వాటి మాయలో పడి ఎక్కువ కొనుగోలు చేయొద్దు. డీమార్ట్‌కు వెళ్లేముందు మీ షాపింగ్ బడ్జెట్ ఎంతనేది ముందే ఫిక్స్ చేసుకోండి. ఆ పరిమితిలోపే ఇంట్లోకి కావాల్సిన అన్నీ వస్తువుల తీసుకునేలా ప్రయత్నం చేయండి. బిల్లింగ్ కౌంటర్ల దగ్గరకు వెళ్లిన తర్వాత చూసుకునే బదులు కొనుగోలు చేసేముందు మీ బడ్జెట్‌లోపే వస్తువుల తీసుకునేలా ప్రణాళిక వేసుకోండి. ఇలాంటి చిన్న స్మార్ట్ టిప్స్ పాటించడం ద్వారా మీ డీమార్ట్ షాపింగ్ చౌకగా మారుతుంది.

Follow Us
డీమార్ట్ షాపింగ్‌లో ఇలా చేస్తే తక్కువ ధరకే సరుకులు.. సీక్రెట్..
డీమార్ట్ షాపింగ్‌లో ఇలా చేస్తే తక్కువ ధరకే సరుకులు.. సీక్రెట్..
పద్మపుష్కరిణిలో పద్మావతి అమ్మవారు ఎలా ఆవిర్భవించారు? పంచమితీర్థం
పద్మపుష్కరిణిలో పద్మావతి అమ్మవారు ఎలా ఆవిర్భవించారు? పంచమితీర్థం
16 రకాల 9 టన్నుల పుష్పాలతో తిరుమల శ్రీవారికి పుష్పయాగం
16 రకాల 9 టన్నుల పుష్పాలతో తిరుమల శ్రీవారికి పుష్పయాగం
అడవిలో పాతి పెట్టిన నోట్ల కట్టలు! హంగేరీలో కలకలం!
అడవిలో పాతి పెట్టిన నోట్ల కట్టలు! హంగేరీలో కలకలం!
ఉల్లిపాయలపై నల్లటి మచ్చల వెనక ఇంత పెద్ద కథ ఉందా..?
ఉల్లిపాయలపై నల్లటి మచ్చల వెనక ఇంత పెద్ద కథ ఉందా..?
ఈ తేదీల్లో పుట్టినవారి మాటతీరే ప్రత్యేకం.. ఒక్కసారి మాట్లాడితే..
ఈ తేదీల్లో పుట్టినవారి మాటతీరే ప్రత్యేకం.. ఒక్కసారి మాట్లాడితే..
పిల్లలు ఆడుకునే బొమ్మే కిల్లర్ గా మారితే.. OTTలో ఈ సినిమా చూశారా?
పిల్లలు ఆడుకునే బొమ్మే కిల్లర్ గా మారితే.. OTTలో ఈ సినిమా చూశారా?
ఆ ఒక్క సినిమాతో నా అప్పులన్నీ తీరిపోయాయి..
ఆ ఒక్క సినిమాతో నా అప్పులన్నీ తీరిపోయాయి..
ప్రకృతి నేర్పిన పాఠం.. తేనె తుట్టె ఆకారంలో సోలార్ ప్యానల్స్‌..
ప్రకృతి నేర్పిన పాఠం.. తేనె తుట్టె ఆకారంలో సోలార్ ప్యానల్స్‌..
కోల్డ్ క్రీమ్ vs మాయిశ్చరైజర్ vs బాడీ లోషన్.. ఏది ఎప్పుడు వాడాలి?
కోల్డ్ క్రీమ్ vs మాయిశ్చరైజర్ vs బాడీ లోషన్.. ఏది ఎప్పుడు వాడాలి?