AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. రూ.8 వేలకుపైగా తగ్గిన బంగారం ధర!

Gold, Silver Prices Today: బంగారం, వెండి ధరలు నిరంతరం మారుతూ ఉంటాయి. ధరలలో ఆభరణాల తయారీ ఛార్జీలు, జీఎస్టీ చేర్చలేదు. తుది ధరలు నగల వ్యాపారిని బట్టి మారవచ్చు. అందువల్ల, ఆభరణాలు కొనుగోలు చేసే ముందు మీ స్థానిక నగల వ్యాపారితో తాజా ధరలను సరిచూసుకోండి.

Gold Price Today: మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. రూ.8 వేలకుపైగా తగ్గిన బంగారం ధర!
Today Gold Rate
Subhash Goud
|

Updated on: Nov 17, 2026 | 6:29 AM

Share

Gold, Silver Prices Today: బంగారం, వెండి కొనుగోలుచేసేవారికి ఇది మంచి సమయం. ఎందుకంటే రోజు రోజుకు బంగారం, వెండి ధరలు భారీ స్థాయిలో దిగి వస్తున్నాయి. బంగారం, వెండి ధరల తగ్గుదల ధోరణి ఆగడం లేదు. సోమవారం మార్కెట్ తెరుచుకోగానే బంగారం, వెండి ధరలలో మరోసారి భారీ పతనం కనిపించింది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో వెండి ధర ఒక్క దెబ్బతో రూ. 5,700కు పైగా పడిపోగా, బంగారం ధర కూడా సుమారు రూ. 1,000 మేర తగ్గింది. గత వారం కూడా బంగారం, వెండి ధరలలో భారీ తగ్గుదల నమోదైంది. ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఆభరణాలు కొనాలని ప్లాన్ చేస్తుంటే, నవంబర్ 17న కూడా బంగారం, వెండి ధరలు భారీగానే పడిపోయాయి. అయితే 10 రోజుల్లో బంగారం ధర రూ. 8,660 వరకు తగ్గుముఖం పట్టింది.

10 రోజుల డేటాను పరిశీలిస్తే, బంగారం, వెండి ధరలలో భారీ తగ్గుదల నమోదైంది. ఈ కాలంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.8,660 మేర, 22 క్యారెట్ల బంగారం ధర రూ.7,950 మేర తగ్గింది. అదే సమయంలో, ఒక కిలో వెండి ధర సుమారు రూ.15,000 మేర తగ్గింది.

కొనుగోలు చేసే ముందు తప్పక తెలుసుకోవాలి:

బంగారం, వెండి ధరలు నిరంతరం మారుతూ ఉంటాయి. ధరలలో ఆభరణాల తయారీ ఛార్జీలు, జీఎస్టీ చేర్చలేదు. తుది ధరలు నగల వ్యాపారిని బట్టి మారవచ్చు. అందువల్ల, ఆభరణాలు కొనుగోలు చేసే ముందు మీ స్థానిక నగల వ్యాపారితో తాజా ధరలను సరిచూసుకోండి.

ఇవి కూడా చదవండి

ప్రధాన నగరాల్లో ధరల వివరాలు:

  1. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,36,790 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,25,390 వద్ద ట్రేడవుతోంది.
  2. విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,36,790 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,25,390 వద్ద ట్రేడవుతోంది.
  3. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,36,940 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,25,540 వద్ద ట్రేడవుతోంది.
  4. ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,36,790 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,25,390 వద్ద ట్రేడవుతోంది.
  5. చెన్నైఐలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,36,790 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,25,390 వద్ద ట్రేడవుతోంది.
  6. బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,36,790 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,25,390 వద్ద ట్రేడవుతోంది.
  7. వెండి ధర కిలోకు రూ.1,89,900 వద్ద ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us