AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

House Construction: తక్కువ బడ్జెట్‌లో ఇల్లు కట్టుకోవడం ఎలా? దేనికి ఎంత ఖర్చు.. పూర్తి వివరాలు!

Low Budget House Construction: ఈ వివరాలను బట్టి, తక్కువ బడ్జెట్ లో ఇల్లు నిర్మించుకోవాలంటే సరైన ప్రణాళిక, తెలివైన మెటీరియల్ ఎంపిక, ప్రత్యామ్నాయాలను పరిగణనలోకి తీసుకోవడం చాలా ముఖ్యం. ఇది మీ బడ్జెట్‌కు అనుగుణంగా నాణ్యతతో కూడిన ఇంటిని నిర్మించుకోవడానికి సహాయపడుతుంది. ఇక్కడ..

House Construction: తక్కువ బడ్జెట్‌లో ఇల్లు కట్టుకోవడం ఎలా? దేనికి ఎంత ఖర్చు.. పూర్తి వివరాలు!
Low Budget House Construction
Subhash Goud
|

Updated on: Oct 04, 2026 | 10:44 AM

Share

Low Budget House Construction: నేటి కాలంలో నిత్యవసర వస్తువులతో పాటు నిర్మాణ వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితులలో సామాన్యులు తమకంటూ ఒక సొంతింటిని నిర్మించుకోవడం అనేది ఒక పెద్ద సవాలుగా మారింది. అయితే, తెలివైన ప్రణాళికలు, సరైన ప్రత్యామ్నాయాలను ఎంచుకోవడం ద్వారా తక్కువ బడ్జెట్ లో కూడా మీ కలను నెరవేర్చుకోవచ్చు. సుమారు 880-900 చదరపు అడుగుల విస్తీర్ణంలో (22 అడుగుల వెడల్పు, 40 అడుగుల పొడవు) ఒక ఇంటిని తక్కువ ఖర్చుతో ఎలా నిర్మించుకోవాలో 2026 నాటి ధరల ఆధారంగా వివరంగా తెలుసుకుందాం.

1. ప్లానింగ్, పునాదులు:

ఇంటి నిర్మాణానికి ముందు ప్లానింగ్ చాలా కీలకం. ఇంజనీర్ ద్వారా ప్లానింగ్ చేయిస్తే బడ్జెట్ ఎక్కువవుతుంది. దీనికి బదులుగా, మీ ప్రాంతంలోని సిద్ధాంతి గారిచే వాస్తు ప్రకారం ప్లానింగ్ చేయించుకుంటే సుమారు రూ.5,000 బడ్జెట్ లో పూర్తి చేయవచ్చు. ఇంటి పునాదుల కోసం 9-10 పిల్లర్ గుంతలను తవ్వించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఒక గుంత తవ్వకానికి రూ.600 నుండి రూ.800 వరకు ఖర్చవుతుంది. 10 గుంతలకు సుమారు రూ.8,000 వరకు అవుతుంది.

2. బోర్ వెల్ నిర్మాణం:

బోర్ వెల్ ఖర్చు ప్రాంతాన్ని బట్టి మారుతుంది. కోస్తా ఆంధ్ర వంటి కొన్ని ప్రాంతాలలో వాటర్ లెవెల్ తక్కువగా ఉన్నందున రూ.40,000 నుండి రూ.50,000 బడ్జెట్ లో బోర్ ప్లస్ మోటార్ తో సహా పూర్తవుతుంది. తెలంగాణ, రాయలసీమ వంటి ప్రాంతాలలో భూగర్భ జలాలు లోతుగా ఉండటంతో, మెషిన్ లతో బోర్ వేయించి, మోటార్ అమర్చడానికి రూ.1,20,000 వరకు ఖర్చయ్యే అవకాశం ఉంది. మీ ప్రాంత అవసరాలకు అనుగుణంగా దీనిని అంచనా వేయాలి.

ఇవి కూడా చదవండి

3. ప్రధాన నిర్మాణ వస్తువులు:

  • ఐరన్/స్టీల్: 880-900 చదరపు అడుగుల ఇంటికి ప్లింత్ బీమ్స్, పిల్లర్స్, స్లాబ్ తో కలిపి 2.5 టన్నుల స్టీల్ అవసరం అవుతుంది. ప్రస్తుతం ఒక టన్ను స్టీల్ ధర రూ.75,000 చొప్పున, మొత్తంగా రూ.1,87,500 ఖర్చవుతుంది.
  • సిమెంట్: సుమారు 400 సిమెంట్ బ్యాగులు అవసరం అవుతాయి (కొన్నిసార్లు 50 అదనంగా అవసరం కావచ్చు). ఒక బ్యాగ్ ధర రూ.320 చొప్పున, రూ.1,28,000 ఖర్చవుతుంది. బ్రాండ్ ను బట్టి ధరలో స్వల్ప తేడాలు ఉండవచ్చు.
  • ఇసుక: ఇంటి నిర్మాణానికి 18 యూనిట్ల (18 ట్రాక్టర్లు) ఇసుక అవసరం. ఒక ట్రాక్టర్ ఇసుక ధర రూ.5,000 చొప్పున, మొత్తంగా రూన.90,000 అవుతుంది.
  • బేస్మెంట్ ఫిల్లింగ్: బేస్మెంట్ నింపడానికి తక్కువ క్వాలిటీ ఇసుక లేదా గ్రావెల్ డస్ట్ వంటి వాటిని ఉపయోగించడం ద్వారా సుమారు రూ.80,000 ఖర్చుతో పూర్తి చేయవచ్చు.
  • ఇటుకలు: మొత్తం ఇంటికి సుమారు 14,000 ఇటుకలు అవసరం అవుతాయి. మంచి క్వాలిటీ రెడ్ బ్రిక్స్ ఒకటికి రూ.10 చొప్పున రూ.1,40,000 ఖర్చవుతుంది. అయితే, బడ్జెట్ తక్కువగా ఉన్నవారు సిమెంట్ బ్రిక్స్ ను ఉపయోగించుకోవడం ద్వారా రూ.1,00,000 నుండి రూ.1,10,000 తో పని పూర్తి చేసుకోవచ్చు. దీని ద్వారా రూ.30,000 నుండి రూ.40,000 వరకు ఆదా అవుతుంది. సిమెంట్ బ్రిక్స్ వాడటం వల్ల సిమెంట్ వినియోగం కూడా కొంత తగ్గుతుంది.
  • అగ్రిగేట్స్ (కంకరు): 40 మి.మీ., 20 మి.మీ. కంకరు కలిపి 12 యూనిట్లు (12 ట్రాక్టర్లు) అవసరం అవుతుంది. ఒక ట్రాక్టర్ ధర రూ.4,000 చొప్పున, మొత్తంగా రూ.48,000 ఖర్చవుతుంది.

4. తలుపులు, కిటికీలు:

ఇంటికి దర్వాజాలు, కిటికీలు కలపలో చేయించుకుంటే సుమారు రూ.4 లక్షల వరకు బడ్జెట్ అవుతుంది. బడ్జెట్ ను తగ్గించుకోవడానికి, మెయిన్ డోర్ ను మాత్రమే టేకు కలపలో చేయించుకొని, మిగతా డోర్ల కోసం వేప కలప, ఫ్లష్ డోర్స్ లేదా డబ్ల్యూపీసీ డోర్స్‌ను ఎంచుకోవచ్చు. కిటికీల కోసం యూపీవీసీ కిటికీలను వాడటం ద్వారా మొత్తం రూ.2 లక్షల బడ్జెట్ లోనే ఈ పనిని పూర్తి చేసుకోవచ్చు.

5. ఫ్లోరింగ్, ఫినిషింగ్:

  • టైల్స్/గ్రానైట్: గ్రానైట్ లేదా మార్బుల్‌ను ఎక్కువగా ఉపయోగిస్తే ఖర్చు పెరుగుతుంది. బడ్జెట్‌లో ఉండటానికి టైల్స్ ను ఎంచుకోవడం ఉత్తమం. కిచెన్ ప్లాట్ ఫామ్, టీవీ యూనిట్ వంటి కొన్ని చోట్ల మాత్రమే గ్రానైట్ ను ఉపయోగించవచ్చు. టైల్స్, గ్రానైట్ పనులకు సుమారు రూ.1,80,000 బడ్జెట్ అవుతుంది.
  • ఫాల్స్ సీలింగ్: నేడు చాలామంది ఫాల్స్ సీలింగ్‌ను చేయించుకుంటున్నారు. సాధారణ ఫాల్స్ సీలింగ్ కు రూ.50,000 నుండి రూ.60,000 వరకు ఖర్చవుతుంది.
  • ఎలక్ట్రికల్, ప్లంబింగ్: మీడియం క్వాలిటీ మెటీరియల్స్ తో ఎలక్ట్రికల్, ప్లంబింగ్ పనులు చేయించడానికి వర్క్ తో కలిపి సుమారు రూ.2 లక్షలు ఖర్చవుతుంది.

ఇది కూడా చదవండి: AP Pensions: పెన్షన్‌ డబ్బుల పంపిణీలో భారీ మార్పు.. నవంబర్ 1 నుంచి కొత్త రూల్!

పై వివరాలను బట్టి, తక్కువ బడ్జెట్ లో ఇల్లు నిర్మించుకోవాలంటే సరైన ప్రణాళిక, తెలివైన మెటీరియల్ ఎంపిక, ప్రత్యామ్నాయాలను పరిగణనలోకి తీసుకోవడం చాలా ముఖ్యం. ఇది మీ బడ్జెట్‌కు అనుగుణంగా నాణ్యతతో కూడిన ఇంటిని నిర్మించుకోవడానికి సహాయపడుతుంది. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ ధరలు ఇప్పటికే నిర్మించిన బిల్డర్స్‌, మేస్త్రీల ద్వారా అందించిన వివరాలు మాత్రమే. ప్రాంతాలను బట్టి బడ్జెట్‌లో తేడా ఉండవచ్చు. ప్రస్తుతం రోజురోజు ఏ మెటీరియల్‌ ధర ఎంత పెరుగుతుందో చెప్పలేని పరిస్థితి ఉంది. అందుకే ధరలు విపరీతంగా పెరుగుతున్న తరుణంలో బడ్జెట్‌ కూడా పెరగవచ్చని గమనించండి. ఇవి అంచనా రూపంలో అందించినవి మాత్రమే.

ఇది కూడా చదవండి: DMartలో అదిరిపోయే డీల్స్.. రూ.400-500 విలువైన వస్తువులు రూ.199కే! కొనేముందు ఈ విషయాలు చూడండి

ఇది కూడా చదవండి: House Construction: నాణ్యమైన ఇటుకలను గుర్తించడం ఎలా? ఇలా చెక్‌ చేయకుంటే ఇంటికి భారీ ఇల్లు సర్వనాశనమే..!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
తక్కువ బడ్జెట్‌లో ఇల్లు కట్టుకోవడం ఎలా? దేనికి ఎంత ఖర్చు..
తక్కువ బడ్జెట్‌లో ఇల్లు కట్టుకోవడం ఎలా? దేనికి ఎంత ఖర్చు..
చికెన్ మటన్‌ కంటే బెస్ట్..ఇలా ఎండు చేపల పులుసు చేస్తే అదిరిపోద్దీ
చికెన్ మటన్‌ కంటే బెస్ట్..ఇలా ఎండు చేపల పులుసు చేస్తే అదిరిపోద్దీ
నేవీలో హనీట్రాప్.. అధికారి అరెస్ట్! రిస్క్‌లో విశాఖ భద్రతాసమాచారం
నేవీలో హనీట్రాప్.. అధికారి అరెస్ట్! రిస్క్‌లో విశాఖ భద్రతాసమాచారం
గెలవాల్సిన మ్యాచ్.. అతని వల్లే దొబ్బింది.. ఇక జట్టులో చోటు కష్టమే
గెలవాల్సిన మ్యాచ్.. అతని వల్లే దొబ్బింది.. ఇక జట్టులో చోటు కష్టమే
'9వ తరగతి వరకు చదివా.. నాకు స్థానికత ఇవ్వండి' సుప్రీం కీలక తీర్పు
'9వ తరగతి వరకు చదివా.. నాకు స్థానికత ఇవ్వండి' సుప్రీం కీలక తీర్పు
చుట్టమల్లె సాంగ్ ఫేక్ వీడియో పై విజయ్ దేవరకొండ రియాక్షన్..
చుట్టమల్లె సాంగ్ ఫేక్ వీడియో పై విజయ్ దేవరకొండ రియాక్షన్..
పాతబస్తీలో అర్ధరాత్రి హైడ్రామా.. భారీగా భద్రతా బలగాల ఎంట్రీ!
పాతబస్తీలో అర్ధరాత్రి హైడ్రామా.. భారీగా భద్రతా బలగాల ఎంట్రీ!
42 ఏళ్ల వయసులో కళ్లు చెదిరే క్యాచ్‌.. వీడియో చూస్తే ఫిదానే..!
42 ఏళ్ల వయసులో కళ్లు చెదిరే క్యాచ్‌.. వీడియో చూస్తే ఫిదానే..!
పెన్షన్‌ డబ్బుల పంపిణీలో భారీ మార్పు.. నవంబర్ 1 నుంచి కొత్త రూల్!
పెన్షన్‌ డబ్బుల పంపిణీలో భారీ మార్పు.. నవంబర్ 1 నుంచి కొత్త రూల్!
భారత్‌ లో ఆకట్టుకున్న11 అంశాలు ఇవే! యోగా ట్రైనర్ పోస్టు వైరల్!
భారత్‌ లో ఆకట్టుకున్న11 అంశాలు ఇవే! యోగా ట్రైనర్ పోస్టు వైరల్!