AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Pensions: పెన్షన్‌ డబ్బుల పంపిణీలో భారీ మార్పు.. నవంబర్ 1 నుంచి కొత్త రూల్!

AP Pensions: కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి మళ్లించాలనే కొత్త నిబంధనలో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం కింద కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న వాటాను ఇక నుంచి నేరుగా బ్యాంకు ఖాతాకు బదిలీ..

AP Pensions: పెన్షన్‌ డబ్బుల పంపిణీలో భారీ మార్పు.. నవంబర్ 1 నుంచి కొత్త రూల్!
AP Pensions
Subhash Goud
|

Updated on: Oct 04, 2026 | 9:52 AM

Share

AP Pensions: ఏపీలో పెన్షన్‌ తీసుకునే లబ్దిదారులకు ప్రభుత్వం కీలక అప్‌డేట్‌ను అందించింది. వచ్చే నెల అంటే నవంబర్ 1వ తేదీ నుంచి పింఛన్ల పంపిణీలో కొత్త విధానాన్ని అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ కొత్త విధానం ద్వారా పెన్షన్లు తీసుకునే లబ్దిదారులకు డబ్బులు వారి అకౌంట్లో జమ కానున్నాయి. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఇప్పటివరకు మొత్తం మొత్తాన్ని నేరుగా చేతికి అందిస్తుండగా, ఇకపై రాష్ట్ర ప్రభుత్వ వాటా మాత్రమే ఇంటింటికి అందనుంది.

కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి మళ్లించాలనే కొత్త నిబంధనలో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం కింద కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న వాటాను ఇక నుంచి నేరుగా బ్యాంకు ఖాతాకు బదిలీ చేస్తారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం వృద్ధులు అలాగే ఒంటరి మహిళలకు నెలకు రూ.4000 ఇస్తుండగా, ఇందులో రాష్ట్ర వాటాను రూ.3800, కేంద్ర వాటాను రూ.200గా కేటాయించారు.

ఇది కూడా చదవండి: DMartలో అదిరిపోయే డీల్స్.. రూ.400-500 విలువైన వస్తువులు రూ.199కే! కొనేముందు ఈ విషయాలు చూడండి

దివ్యాంగుల పింఛన్

ఇక దివ్యాంగుల పింఛన్లకు సంబంధించి ప్రతి నెల రూ.6000ను ప్రభుత్వం అందిస్తోంది. ఈ మొత్తంలో రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.5500 కాగా, కేంద్ర ప్రభుత్వ వాటా రూ.500గా ఉంది. ఇప్పటివరకు ఈ మొత్తాలన్నీ కలిపి ఒకేసారి చేతికి అందించేది. కానీ తాజా నిర్ణయంతో రాష్ట్ర వాటా సచివాలయ ఉద్యోగుల ద్వారా అందిస్తుండగా, కేంద్రం సంబంధించిన వాటా నేరుగా బ్యాంక్ అకౌంట్‌లో పడనుంది.

అకౌంట్లు పెన్షన్‌ డబ్బులు రావాలంటే..

కేంద్ర ప్రభుత్వ వాటా డబ్బులు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ కావాలంటే లబ్ధిదారులుతమ బ్యాంకు ఖాతాను ఆధార్ నంబర్‌తో లింకు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ లింక్ చేయకపోతే కేంద్రం నుంచి వచ్చే పింఛన్ వాటా డబ్బులు అకౌంట్‌లో జమ కావని గుర్తించుకోండి. మధ్యవర్తుల ప్రమేయాన్ని పూర్తిగా తొలగించి పారదర్శకతను పెంచేందుకే ఈ కొత్త విధానాన్ని అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

ఇది కూడా చదవండి: House Construction: నాణ్యమైన ఇటుకలను గుర్తించడం ఎలా? ఇలా చెక్‌ చేయకుంటే ఇంటికి భారీ ఇల్లు సర్వనాశనమే..!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
పెన్షన్‌ డబ్బుల పంపిణీలో భారీ మార్పు.. నవంబర్ 1 నుంచి కొత్త రూల్!
పెన్షన్‌ డబ్బుల పంపిణీలో భారీ మార్పు.. నవంబర్ 1 నుంచి కొత్త రూల్!
భారత్‌ లో ఆకట్టుకున్న11 అంశాలు ఇవే! యోగా ట్రైనర్ పోస్టు వైరల్!
భారత్‌ లో ఆకట్టుకున్న11 అంశాలు ఇవే! యోగా ట్రైనర్ పోస్టు వైరల్!
కిడ్నీ రోగాలకు అడ్డుకట్టవేసి ఉద్దానానికి ఊపిరిపోయాలనుకుంది.. కానీ
కిడ్నీ రోగాలకు అడ్డుకట్టవేసి ఉద్దానానికి ఊపిరిపోయాలనుకుంది.. కానీ
వారంలో 3 సార్లు తినండి చాలు.. వెయ్యి ఏనుగుల శక్తి వస్తుంది..
వారంలో 3 సార్లు తినండి చాలు.. వెయ్యి ఏనుగుల శక్తి వస్తుంది..
పైలట్‌ స్మిత్ మచ్ఛర్‌కు నెతన్యాహు అరుదైన గౌరవం.. ఇజ్రాయెల్‌కు రావ
పైలట్‌ స్మిత్ మచ్ఛర్‌కు నెతన్యాహు అరుదైన గౌరవం.. ఇజ్రాయెల్‌కు రావ
విండీస్ సిరీస్ తర్వాత రో-కో మరలా ఎప్పుడు బరిలోకి దిగేది..?
విండీస్ సిరీస్ తర్వాత రో-కో మరలా ఎప్పుడు బరిలోకి దిగేది..?
భారత్‌-పాక్‌ మధ్య దౌత్య ఉద్రిక్తత.. పంజాబ్‌ సరిహద్దుపై మళ్లీ రగడ
భారత్‌-పాక్‌ మధ్య దౌత్య ఉద్రిక్తత.. పంజాబ్‌ సరిహద్దుపై మళ్లీ రగడ
పెద్దల పంచాయితీ తర్వాత ఏమైంది? విజయవాడలో ప్రేమజంట విషాదాంతం
పెద్దల పంచాయితీ తర్వాత ఏమైంది? విజయవాడలో ప్రేమజంట విషాదాంతం
పారడైస్ సినిమా ఛాన్స్ మిస్ అవ్వడంపై హీరోయిన్ కామెంట్స్..
పారడైస్ సినిమా ఛాన్స్ మిస్ అవ్వడంపై హీరోయిన్ కామెంట్స్..
-48 డిగ్రీల చలిలో స్వచ్ఛ భారత్‌.. అంటార్కిటికాలోనూ తగ్గని శుభ్రత!
-48 డిగ్రీల చలిలో స్వచ్ఛ భారత్‌.. అంటార్కిటికాలోనూ తగ్గని శుభ్రత!