AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డీమార్ట్‌లో గడియారాలు, కిటికీలు ఎందుకు ఉండవో తెలుసా..? వామ్మో.. అసలు సీక్రెట్ ఇక్కడ ఉందా..

Dmart Shopping: డీమార్ట్‌లో తక్కువ ధరలంటూ తెలియకుండానే జేబుకు చిల్లు పడుతుందా? షాపింగ్ ట్రాలీలు, స్టోర్ లేఅవుట్, పిల్లల సెక్షన్, బిల్లింగ్ కౌంటర్స్, సైకలాజికల్ ప్రైసింగ్ వంటి మార్కెటింగ్ వ్యూహాలతో అనవసరపు ఖర్చులు పెరుగుతాయి. తెలివిగా కొనుగోళ్లు చేసి డబ్బు ఆదా చేసుకోవడం ఎలాగో తెలుసుకోండి.

డీమార్ట్‌లో గడియారాలు, కిటికీలు ఎందుకు ఉండవో తెలుసా..? వామ్మో.. అసలు సీక్రెట్ ఇక్కడ ఉందా..
Dmart
Venkatrao Lella
|

Updated on: Nov 19, 2026 | 9:55 PM

Share

డీమార్ట్ పేరు వినగానే.. అందరికీ టక్కున గుర్తు వచ్చేది ఏంటంటే.. తక్కువ ధరలకే నాణ్యమైన సరుకులు కొనుగోలు చేయవచ్చని అనుకుంటారు. వేలాది మంది మధ్యతరగతి ప్రజలు ప్రతి నెలా తమ ఇంటికి అవసరమైన వస్తువున్నీ కొనుగోలు చేసేందుకు ఇక్కడికి వెళ్లడానికి ఇష్టపడుతుంటారు. అయితే మీరు డీమార్ట్‌లో షాపింగ్ చేస్తుంటే మీకు తెలియకుండానే మీ జేబుకు చిల్లు పడుతుందని చాలామందికి తెలియదు.  వినియోగదారులను ఎక్కువ కొనుగోలు చేసేలా ప్రోత్సహించే కొన్ని తెలివైన మార్కెటింగ్ వ్యూహాలు డీమార్ట్‌లో ఉన్నాయి.  ఆ వ్యూహలు ఏంటి..?  వాటి నుంచి మీ డబ్బును ఎలా కాపాడుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

వీటి పట్ల జాగ్రత్తగా ఉండండి..

డీమార్ట్‌లోకి అడుగు పెట్టగానే మనల్ని ముందుగా ఆకర్షించేవి పెద్ద పెద్ద షాపింగ్ ట్రాలీలు. చిన్నపాటి సరుకులు కొందామని వెళ్ళినవాళ్లు ఆ పెద్ద ట్రాలీని చూసి తమకు అవసరం లేని వస్తువులను కూడా కొనేసే అవకాశముంది. మన అవసరానికి మించి కొనేలా ప్రేరేపించడమే ఈ ట్రిక్ ఉపయోగపడుతుంది. ఇక పప్పు, ఉప్పు, పంచదార, నూనె వంటి నిత్యావసర వస్తువులు సాధారణంగా స్టోర్ చివర్లో ఉంటాయి. అక్కడికి వెళ్ళే దారిలో మనల్ని ఆకర్షించే ఎన్నో రకాల వస్తువులైన బిస్కెట్లు, చాక్లెట్లు, స్నాక్స్, గృహోపకరణాలు వంటివి పెడతారు. దీంతో మనం అనుకోకుండానే వాటిని మన ట్రాలీలో వేసుకుంటాం. అలాగే మరో ట్రిక్ ఏంటంటే.. గంటల తరబడి సరుకులు కొన్న తర్వాత బిల్లింగ్ కౌంటర్ల వద్ద పెద్ద క్యూలు ఉంటాయి. ఆ సమయంలో మనల్ని ఆకర్షించడానికి అక్కడ చిన్న చిన్న వస్తువులను పెడతారు. చాక్లెట్లు, చూయింగ్ గమ్స్, చిన్న చిన్న స్నాక్స్ లాంటివి చూసి క్యూలో నిలబడి విసుగుచెందిన మనం చాలా తేలిగ్గా వాటిని కొనేస్తాం. ఇది మరొక మార్కెటింగ్ ట్రిక్‌గా చెప్పవచ్చు. ఇక డీమార్ట్‌లో మనకు ఎక్కడా కిటికీలు కానీ, గడియారాలు కానీ కనిపించవు. మనం సమయాన్ని మర్చిపోయి ఎక్కువ సేపు షాపింగ్ చేయాలనే ట్రిక్ ఇక్కడ ఉపయోగిస్తారు. ఎంత ఎక్కువ సేపు మనం లోపల ఉంటామో, అంత ఎక్కువ సరుకులు కొంటాం అనేది వారి ఆలోచనగా చెప్పవచ్చు.

కొన్నిసార్లు కొత్తగా వచ్చిన ప్రొడక్ట్స్‌ని ఉచితంగా రుచి చూడమని ఇస్తారు. అవి మనకు నచ్చితే వెంటనే వాటిని కొనేస్తామనేది  వారి ఆలోచన. అలాగే ఒకటి కొంటే ఒకటి ఉచితం వంటి ఆఫర్స్‌ని చూసి మనం చాలా ఆకర్షితులమవుతాం. కానీ నిజానికి మనకు ఆ రెండవ వస్తువు అవసరం లేకపోయినా,.. ఆఫర్ ఉంది కదా అని కొనేస్తాం. దీంతో మన డబ్బులు అనవసరంగా ఖర్చవుతాయి. అలాగే డీమార్ట్‌లో చాలా వస్తువుల ధరలు 99, 199, 499 ఇలా ఉంటాయి. 100 రూపాయల బదులు 99 రూపాయలు అని పెట్టడం వల్ల మన మెదడుకి అది చాలా తక్కువ ధరగా అనిపిస్తుంది. ఇది వారి మార్కెటింగ్ మాయాజాలంగా చెప్పవచ్చు.

Follow Us
పసిడి పతనం.. సామాన్యుడికి సంబరం.. ఇన్వెస్టర్లకు షాక్..
పసిడి పతనం.. సామాన్యుడికి సంబరం.. ఇన్వెస్టర్లకు షాక్..
డీమార్ట్‌లో గడియారాలు, కిటికీలు ఎందుకు ఉండవో తెలుసా..? ఈ సీక్రెట్
డీమార్ట్‌లో గడియారాలు, కిటికీలు ఎందుకు ఉండవో తెలుసా..? ఈ సీక్రెట్
దేవ ఉత్థాన ఏకాదశి: నవంబర్ 20న మేల్కొంటున్న శ్రీమహావిష్ణువు..
దేవ ఉత్థాన ఏకాదశి: నవంబర్ 20న మేల్కొంటున్న శ్రీమహావిష్ణువు..
స్పెషల్ సాంగ్ చేసిన స్టార్ హీరోయిన్.. కట్ చేస్తే..
స్పెషల్ సాంగ్ చేసిన స్టార్ హీరోయిన్.. కట్ చేస్తే..
OTTలో తెలుగు క్రైమ్ థ్రిల్లర్ హవా.. IMDBలోనూ టాప్ రేటింగ్
OTTలో తెలుగు క్రైమ్ థ్రిల్లర్ హవా.. IMDBలోనూ టాప్ రేటింగ్
క్రెడిట్ కార్డు బిల్లు లేట్‌గా చెల్లిస్తున్నారా..? ఇకపై వడ్డీలు..
క్రెడిట్ కార్డు బిల్లు లేట్‌గా చెల్లిస్తున్నారా..? ఇకపై వడ్డీలు..
సూర్యుడి అనురాధ నక్షత్ర ప్రవేశంతో ఈ 4 రాశులకు అదృష్టం.. ఆ లక్కీ..
సూర్యుడి అనురాధ నక్షత్ర ప్రవేశంతో ఈ 4 రాశులకు అదృష్టం.. ఆ లక్కీ..
4 వీల్​ డ్రైవ్​తో చిన్న సైజ్​ ఎలక్ట్రిక్​ Defender SUV వివరాలివే
4 వీల్​ డ్రైవ్​తో చిన్న సైజ్​ ఎలక్ట్రిక్​ Defender SUV వివరాలివే
ఓటీటీని షేక్ చేస్తున్న 7 ఎపిసోడ్స్..
ఓటీటీని షేక్ చేస్తున్న 7 ఎపిసోడ్స్..
ఏపీ అభివృద్ధికి 3 ఎకనామిక్ రీజియన్లు.. పెట్టుబడులే లక్ష్యంగా సీఎం
ఏపీ అభివృద్ధికి 3 ఎకనామిక్ రీజియన్లు.. పెట్టుబడులే లక్ష్యంగా సీఎం