AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రేషన్ కార్డు లేకపోయినా రూ.5 లక్షలు పొందోచ్చు.. ఇందిరమ్మ బీమా పథకంపై కొత్త అప్డేట్.. యాప్ ద్వారా దరఖాస్తులు..

తెలంగాణ ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రారంభించింది. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని నవంబర్ 19వ తేదీన సిద్దిపేటలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ స్కీమ్ ద్వారా ప్రతీ కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా లభించనుంది. ఒక్క రూపాయి కూడా చెల్లించకుండానే రూ.5 లక్షల బీమా పొందవచ్చు,.

రేషన్ కార్డు లేకపోయినా రూ.5 లక్షలు పొందోచ్చు.. ఇందిరమ్మ బీమా పథకంపై కొత్త అప్డేట్.. యాప్ ద్వారా దరఖాస్తులు..
Indiramma Bheema
Venkatrao Lella
|

Updated on: Nov 19, 2026 | 6:59 PM

Share

తెలంగాణ ప్రభుత్వం నవంబర్ 19వ తేదీ నుంచి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని అమల్లోకి తెచ్చింది. సిద్దిపేటలో జరిగిన భారీ బహిరంగ సభలో ఈ కొత్త పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రారంభించారు. ఈ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్ ద్వారా రాష్ట్రంలోని ప్రతీ కుటుంబానికి రూ.5 లక్షల బీమా సౌకర్యం అందించనుంది. కుటుంబంలో సంపాదించే వ్యక్తి మరణిస్తే కుటంబసభ్యులకు రూ.5 లక్షల పరిహారం అందుతుంది. ఇందుకు లబ్దిదారులు ఒక్క రూపాయి కూడా ప్రీమియం చెల్లించనక్కర్లేదు. ప్రభత్వం లబ్దిదారుల తరపున ఇన్సూరెన్స్ కంపెనీలకు ప్రీమియం చెల్లిస్తుంది. కుటుంబంలో ఒకరు కంటే ఎక్కువమంది సంపాదిస్తుంటే ఎవరి పేరుపై బీమా చేయించుకోవాలనే ఆప్షన్‌ను లబ్దిదారులకే ప్రభుత్వం వదిలేసింది.

అర్హతలు ఇవే..

-వయస్సు 18 నుంచి 59 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే 1967 నవంబర్ 19 నుంచి 2008 నవంబర్ 18 మధ్య జన్మించి ఉండాలి

-ప్రస్తుతం 59 ఏళ్లలోపు ఉన్నా.. బీమా కవరేజీ స్టార్ట్ అయిన తర్వాత గరిష్ట వయో పరిమితి పెరిగే ఏడాది పాటు వారికి పథకం వర్తిస్తుంది

-రేషన్ కార్డు లేకపోయినా ఈ పథకం కింద లబ్ది పొందవచ్చు

-నామినీ వివరాలు తప్పనిసరిగా నమోదు చేశారు. ఒకరి కంటే ఎక్కువమంది నామినీలను యాడ్ చేయాలంటే ఎవరికి ఎంత నిష్పత్తి అనేది పేర్కొనాలి.

ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..?

నవంబర్ 19వ తేదీ నుంచి డిసెంబర్ 18వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలు, వార్డు ఆఫీసుల్లో ప్రత్యేత శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఇక్కడికి మీ ఆధార్, రేషన్ కార్డు తీసుకెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే సిబ్బంది ఇంటింటికి వచ్చి కూడా వివరాలు సేకరిస్తారు. రేషన్ కార్డు ఉన్నవారికి రేషన్ కార్డులోని డేటా ఆధారంగా వివరాలు నమోదు చేస్తారు. రేషన్ కార్డు లేనివారికి ప్రత్యేక దరఖాస్తు ఫారం ఉంటుంది. ఈ ఫారంలో మీ వివరాలు, కుటుంబసభ్యుల వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. కుటుంబంలో ఒకరు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఇతర జిల్లాల్లో నివసిస్తున్నవారు తమ సమీపంలోని కేంద్రానికి వెళ్లి అయినా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుల కోసం సహకరించేందుకు ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఇంఛార్జ్ కూడా అందుబాటులో ఉంటారు. అలాగే ప్రజలు తమ వివరాలను నమోదు చేసుకునేందుకు వెబ్ సైట్, యాప్ కూడా తీసుకురానున్నారు. దీని ద్వారా ప్రజలే స్వయంగా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రస్తుతం గీత కార్మికులు, నేత కార్మికులు, మత్స్యకారులకు రూ.2 లక్షల జీవిత బీమా అందిస్తుండగా.. ఇప్పుడు వారికి రూ.5 లక్షలకు పెంచారు. నెల రోజుల పాటు జరగనున్న ప్రత్యేక శిబిరాల ద్వారా ప్రతీఒక్కరూ ఇందిరమ్మ జీవిత బీమా పథకానికి దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. దీని వల్ల ప్రతీ కుటుంబానికి ఆర్ధిక భద్రత ఉంటుందని స్పష్టం చేసింది.

Follow Us
తెలంగాణలో కొత్త పథకం ప్రారంభం.. ప్రతీ కుటుంబానికి రూ.5 లక్షలు..
తెలంగాణలో కొత్త పథకం ప్రారంభం.. ప్రతీ కుటుంబానికి రూ.5 లక్షలు..
నేను సూపర్ స్టార్ కావడానికి కారణం ఆయనే.. జీవితాంతం రుణపడి ఉంటాయి.
నేను సూపర్ స్టార్ కావడానికి కారణం ఆయనే.. జీవితాంతం రుణపడి ఉంటాయి.
అతనేం తప్పు చేశాడని తీసుకోలే గంభీర్.. ఇప్పుడు చూడు ఏం జరిగిందో..!
అతనేం తప్పు చేశాడని తీసుకోలే గంభీర్.. ఇప్పుడు చూడు ఏం జరిగిందో..!
ఎండకు ముఖం నల్లబడిందా? ఈ ఒక్క ఫేస్ ప్యాక్ వేయాల్సిందే
ఎండకు ముఖం నల్లబడిందా? ఈ ఒక్క ఫేస్ ప్యాక్ వేయాల్సిందే
లక్ష కోట్ల క్లబ్‌లో మేఘా.. ఇన్‌ఫ్రా రంగంలో మేఘా సరికొత్త చరిత్ర..
లక్ష కోట్ల క్లబ్‌లో మేఘా.. ఇన్‌ఫ్రా రంగంలో మేఘా సరికొత్త చరిత్ర..
నా కుటుంబం చచ్చినా పర్లేదు.. జబర్దస్త్ యాంకర్ రష్మీ సంచలన పోస్ట్
నా కుటుంబం చచ్చినా పర్లేదు.. జబర్దస్త్ యాంకర్ రష్మీ సంచలన పోస్ట్
తిరుమల కొండల్లో 66 కోట్ల తీర్థాలు.. ముక్తిని ప్రసాదించే ఆ ఏడు..
తిరుమల కొండల్లో 66 కోట్ల తీర్థాలు.. ముక్తిని ప్రసాదించే ఆ ఏడు..
30, 40 ఏళ్ల వారిలోనూ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్.. ఇవే లక్షణాలు
30, 40 ఏళ్ల వారిలోనూ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్.. ఇవే లక్షణాలు
చిరంజీవి ఇంట్లో బాలయ్య 50వ సినిమా షూటింగ్.. బాక్సాఫీస్ షేక్..
చిరంజీవి ఇంట్లో బాలయ్య 50వ సినిమా షూటింగ్.. బాక్సాఫీస్ షేక్..
Video: లక్షలాదిగా కదులుతున్న పీతలు.. రోడ్లపై రాకపోకలు బంద్!
Video: లక్షలాదిగా కదులుతున్న పీతలు.. రోడ్లపై రాకపోకలు బంద్!