ఇన్నాళ్లు తప్పు చేశామా? అన్నాన్ని పదేపదే వేడి చేసి తినడం మంచిదేనా?

 05 Oct 2026

Anand T

చాలా మంది రాత్రి మిగిలిన అన్నాన్ని.. మార్నింగ్‌కు వేడి చేసి తింటుంటారు. కానీ ఇలా పదేపదే వేడి చేసి తినడం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

అన్నాన్ని సరిగ్గా నిల్వ చేయకుండా గది ఉష్ణోగ్రత వద్ద ఎక్కువసేపు ఉంచిన అన్నం వల్ల ఫుడ్ పాయిజనింగ్ వస్తుందపి చెబుతున్నారు.

పచ్చి బియ్యంలో ఉండే ఈ బ్యాక్టీరియా, ఉడికించిన తర్వాత కూడా తట్టుకుని ఉండే బీజాంశాలను ఉత్పత్తి చేస్తుంది.

అన్నాన్ని 4°C నుంచి 60°C మధ్య ఉష్ణోగ్రతలో ఎక్కువసేపు ఉంచితే బ్యాక్టీరియా వేగంగా పెరిగి విషపదార్థాలను విడుదల చేస్తుంది.

ఈ బ్యాక్టీరియా విడుదల చేసే టాక్సిన్లు వేడికి కూడా నశించవు; కాబట్టి మళ్లీ వేడి చేసినా సురక్షితం కాదు.

పదేపదే వేడి చేయడం వల్ల తేమ తగ్గి అన్నం గట్టిగా, మెత్తగా లేదా నమలడానికి వీల్లేకుండా మారుతుంది.

అన్నాన్ని మాటిమాటికీ వేడి చేయడం వల్ల అందులోని ముఖ్యమైన పోషకాలు నశిస్తాయి.

ఉడికించిన అన్నాన్ని ఎక్కువసేపు బయట ఉంచకుండా వెంటనే చల్లార్చి ఫ్రిజ్‌లో భద్రపరచాలి.తినేముందు మొత్తం అన్నాన్ని కాకుండా, అవసరమైన భాగాన్ని మాత్రమే తీసుకుని సరిగ్గా వేడి చేసుకోవాలి.