Video: ఇలాంటి బౌన్సర్ ఎప్పుడైనా చూశారా.. సిక్స్ వెళ్తే ఫోర్ ఇచ్చిన అంపైర్.. ఎందుకో తెలుసా?
Canada Super60: కెనడా సూపర్60 (Canada Super60) సెమీఫైనల్‌లో మిస్సిసాగా మాస్టర్స్ పేసర్ అలీ ఖాన్ వేసిన ఓ బౌన్సర్ అందరి దృష్టినీ ఆకర్షించింది. కీరన్ పొలార్డ్ (Kieron Pollard)ను ఎదుర్కొన్న ఆ బంతి వికెట్ కీపర్ తలపై నుంచి వెళ్లి నేరుగా బౌండరీ లైన్ దాటింది. అంపైర్ దానిని వైడ్‌గా ప్రకటించి నాలుగు పరుగులు ఇవ్వడం గమనార్హం.

Canada Super60: కెనడా సూపర్60 టోర్నమెంట్ లో ఒక విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. ఫాస్ట్ బౌలర్ అలీ ఖాన్ వేసిన ఓ బంతి నేరుగా బౌండరీ దాటి సిక్స్‌గా మారింది. కీరన్ పొలార్డ్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఈ ఘటన జరిగింది. అంపైర్ దీనిని వైడ్‌గా ప్రకటించినా, నాలుగు పరుగులు కూడా ఇచ్చారు. క్రికెట్ నియమాల ప్రకారం, వైడ్ బాల్ నేరుగా బౌండరీ దాటినా 4 బైస్ కంటే ఎక్కువ పరుగులు ఇవ్వరు. అయితే, ఈ ఘటనపై సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది.
బౌలర్ అలీ ఖాన్ విచిత్రమైన వైడ్..
ఈ సంఘటన కెనడా సూపర్60 టోర్నమెంట్ మొదటి సెమీఫైనల్‌లో చోటు చేసుకుంది. మిస్సిస్సాగా మాస్టర్స్ తరపున ఆడుతున్న అలీ ఖాన్ బౌలింగ్‌లో ఈ వింత జరిగింది. టొరంటో సిక్సర్స్ బ్యాట్స్ మెన్ కైరన్ పొలార్డ్ క్రీజులో నిలిచాడు. అతను విసిరిన బౌన్సర్ వికెట్ కీపర్ తల మీదుగా నేరుగా బౌండరీ లైన్ దాటింది. దీన్ని చూసిన వారంతా ఆశ్చర్యపోయారు.
సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది. ముఫాద్దల్ వోహ్రా అనే నెటిజన్ ఈ వీడియోను షేర్ చేస్తూ, “కెనడా సూపర్60లో బౌలర్ వేసిన బంతి సిక్స్‌గా మారిన చారిత్రాత్మక వైడ్.” అంటూ రాసుకొచ్చాడు. ఈ బంతికి వైడ్‌తో పాటు 4 పరుగులు కూడా ఇచ్చారు.
సెమీఫైనల్ లో ఏం జరిగింది..?
ఆ మ్యాచ్ లో అలీ ఖాన్ బౌలింగ్ ఏమాత్రం బాగా లేదు. అతను 2 ఓవర్లలో 43 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. టొరంటో సిక్సర్స్ కెప్టెన్ కైరన్ పొలార్డ్ కేవలం 16 బంతుల్లో అజేయంగా 40 పరుగులు చేశాడు. ఆండ్రియాస్ గౌస్ కూడా 11 బంతుల్లో 33 పరుగులు చేశాడు. టొరంటో సిక్సర్స్ 10 ఓవర్లలో 130 పరుగులు చేసింది. దీనికి సమాధానంగా మిస్సిస్సాగా మాస్టర్స్ జట్టు 10 ఓవర్లలో 121 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో టొరంటో సిక్సర్స్ సెమీఫైనల్ గెలిచింది.
టొరంటో సిక్సర్స్ విజేత..
A historic wide with a six from the bowler in Canada Super60. 🤣 https://t.co/8YHNJTRs78
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 5, 2026
సెమీఫైనల్ గెలిచిన టొరంటో సిక్సర్స్ ఫైనల్ లో కూడా విజయం సాధించి ఛాంపియన్‌గా నిలిచింది. ఫైనల్ మ్యాచ్ లో వారు వాంకోవర్ యాంకర్స్ తో తలపడ్డారు. మొదట బ్యాటింగ్ చేసిన వాంకోవర్ యాంకర్స్ 10 ఓవర్లలో 164 పరుగులు చేసింది. ఈ పెద్ద లక్ష్యాన్ని టొరంటో సిక్సర్స్ చివరి బంతికి ఛేదించింది.
పూరన్ మెరుపు ఇన్నింగ్స్..
ఫైనల్ మ్యాచ్ లో నికోలస్ పూరన్ అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు. అతను కేవలం 23 బంతుల్లో 67 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్ లో తొమ్మిది సిక్సర్లు, రెండు ఫోర్లు ఉన్నాయి. కెప్టెన్ పొలార్డ్ 13 బంతుల్లో 35 పరుగులు చేయగా, డేనియల్ సామ్స్ 9 బంతుల్లో అజేయంగా 25 పరుగులు చేశాడు. నికోలస్ పూరన్ ఫైనల్ లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకున్నాడు. అంతేకాదు, ఈ సిరీస్ లో అత్యధికంగా 207 పరుగులు చేసినందుకు అతనికి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు కూడా దక్కింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
