నాన్న చావును పబ్లిసిటీ స్టంటా అన్నారు.. ఎంతో బాధపడ్డాను.. సుప్రీత..

Rajitha Chanti

Pic credit - Instagram

05 October 2026

టాలీవుడ్ ప్రముఖ నటి సురేఖ వాణి, దివంగత దర్శకుడు సురేష్ తేజల కుమార్తె సుప్రీత సోషల్ మీడియా వినియోగదారులకు పరిచయం అక్కర్లేని పేరు.

ఇటీవల ఓ టాక్ షోలో పాల్గొన్న ఆమె, తన జీవితంలో ఎదుర్కొన్న అత్యంత బాధాకరమైన సంఘటనలను పంచుకుంటూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.

2019 మే నెలలో తన తండ్రి సురేష్ తేజ అనారోగ్యంతో మరణించిన సమయంలో జరిగిన ఘటనలను, తనపై వచ్చిన విమర్శలను ఆమె గుర్తుచేసుకున్నారు.

తనకు సోదరులు లేదా తోబుట్టువులు ఎవరూ లేకపోవడంతో, ఒక కొడుకు స్థానంలో నిలబడి తండ్రి అంత్యక్రియలు సుప్రీత దగ్గరుండి నడిపించారు.

అయితే, ఆ క్లిష్ట సమయంలో కూడా కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో చేసిన విమర్శలు తనను తీవ్రంగా కలిచివేశాయని సుప్రీత ఆవేదన వ్యక్తం చేశారు. 

తండ్రి మరణాన్ని కూడా పబ్లిసిటీ స్టంట్ కోసమే వాడుకుందో అని, వ్యూస్ , ఫాలోయింగ్ కోసమే ఇదంతా చేసిందని కొందరు నీచంగా కామెంట్లు చేశారని కన్నీరు పెట్టుకున్నారు.

"ఆ సమయంలో నేను అనుభవించిన నరకం మాటల్లో చెప్పలేను. దేవుడా, నన్ను కూడా తీసుకెళ్లిపో అని ఎంతో ఏడ్చాను" అంటూ ఆవేదన చెందారు.

ఒక ఆడపిల్లగా తండ్రికి చేయాల్సిన చివరి కార్యక్రమాలు చేయడాన్ని కూడా పబ్లిసిటీగా చిత్రీకరించడం సమాజంలో ట్రోలింగ్ ఏ స్థాయికి దిగజారిందో తెలియజేస్తోందని అన్నారు.