అగ్ర హీరోలందరితో జోడీ.. కానీ మెగాస్టార్ చిరంజీవితో నటించని హీరోయిన్

Rajitha Chanti

Pic credit - Instagram

05 October 2026

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్‌గా అడుగుపెట్టి, తనదైన నటనతో ‘లేడీ సూపర్ స్టార్’గా గుర్తింపు తెచ్చుకున్న అందాల భామ అనుష్క శెట్టి.

'అరుంధతి', 'రుద్రమదేవి', 'బాహుబలి' వంటి సూపర్‌హిట్ చిత్రాలతో పాన్-ఇండియా స్థాయిలో తిరుగులేని క్రేజ్ సంపాదించుకుంది ఈ బ్యూటీ.

టాలీవుడ్‌లోని దాదాపు అందరి అగ్ర హీరో సరసన నటించిన ఆమె చిరంజీవి సరసన మాత్రం ఆమె ఒక్క సినిమాలో కూడా కథానాయికగా నటించకపోవడం విశేషం.

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సీనియర్ స్టార్ హీరోలైన నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణలతో అనుష్క జోడీ కట్టారు. అందరితో హిట్స్ అందుకున్నారు.

నాగార్జునతో 'సూపర్', 'డాన్', 'డమరుకం' వంటి చిత్రాల్లో నటించి హిట్ కాంబినేషన్‌గా పేరు తెచ్చుకున్నారు. వీరి పెయిర్ కు మంచి ఫ్యాన్ బేస్ ఉంది.

వెంకటేష్‌తో 'చింతకాయల రవి', బాలకృష్ణ సరసన 'ఒక్కమగడు' చిత్రాలు, ప్రభాస్, మహేష్ బాబు, అల్లు అర్జున్, గోపీచంద్ వంటి యంగ్ స్టార్స్ సరసన నటించారు. 

అయితే, మెగాస్టార్ చిరంజీవి సినిమాలో మాత్రం అనుష్క హీరోయిన్‌గా పూర్తిస్థాయి పాత్రను పోషించలేదు. కేవలం ఒక్క స్పెషల్ సాంగ్ చేసింది.

2006లో వచ్చిన 'స్టాలిన్' సినిమాలో ఒక ప్రత్యేక పాటలో చిరంజీవితో కలిసి స్టెప్పులేసిన ఆమె, ఆ తర్వాత సైరా నరసింహారెడ్డిలో ఝాన్సీ లక్ష్మీబాయిగా కనిపించారు.