AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Comedian Sudhakar: ఒక్క సినిమాకు రూ.30 వేల రెమ్యునరేషన్.. ఆస్తులపై క్లారిటీ ఇచ్చిన నటుడు సుధాకర్..

ఒకప్పుడు హీరోగా, ప్రతినాయకుడిగా, సహాయ నటుడిగా, కమెడియన్ గా ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి నతకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు నటుడు సుధాకర్. అప్పట్లో స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్న ఆయన అనారోగ్య సమస్యలతో ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. కొన్నాళ్ల క్రితం మీడియా ముందుకు వచ్చిన సుధాకర్ తన జీవితం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

Comedian Sudhakar: ఒక్క సినిమాకు రూ.30 వేల రెమ్యునరేషన్.. ఆస్తులపై క్లారిటీ ఇచ్చిన నటుడు సుధాకర్..
Sudhakar
Rajitha Chanti
|

Updated on: Aug 23, 2026 | 2:52 PM

Share

నటుడు సుధాకర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు హీరోగా సినీ ప్రయాణం స్టార్ట్ చేశాడు. తమిళంలో దాదాపు 40కి పైగా సినిమాల్లో ప్రధాన పాత్రలో కనిపించారు. తర్వాత నటుడుగా, హాస్య నటుడిగా, ప్రతినాయకుడిగా మెప్పించారు. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే అనారోగ్య సమస్యలతో ఇండస్ట్రీకి దూరమైన ఆయన.. కొన్నాళ్ల క్రితం కెమెరా ముందుకు వచ్చారు. ఓ ఇంటర్వ్యూలో సుధాకర్ మాట్లాడుతూ.. తన ఆర్థిక స్థితి, ఆరోగ్యం, సినీ పరిశ్రమలోని స్నేహబంధాలపై అనేక విషయాలు వెల్లడించారు. తాను ఆర్థికంగా చితికిపోలేదని, ఒక నెల కోమాలో ఉన్నది నిజమేనని తెలిపారు. తన కుమారుడు బెన్నీకి పరిశ్రమ మద్దతు కోరారు. చిన్నతనంలో తన తండ్రి ఊటీ, కొడైకెనాల్ వంటి ప్రాంతాలకు తరచుగా తీసుకెళ్ళేవారని గుర్తు చేసుకున్నారు. హీరోగా తమిళంలో తాను అందుకున్న అత్యధిక రెమ్యూనరేషన్ 30 వేల రూపాయలు అని తెలిపారు. తన ఆర్థిక వ్యవహారాలను తన అన్నయ్య, భార్య చూసుకుంటారని చెప్పారు.

ఎక్కువ మంది చదివినవి : Bigg Boss 10 Telugu : బిగ్‏బాస్‏లోకి ఈశ్వర సాయి, మాధురి రాథోడ్.. ఆది రెడ్డి చెప్పిందే నిజమవుతుందా.. ?

చెన్నైలో సుధాకర్‌కు 500 నుండి 700 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయనే వదంతులపై సుధాకర్ స్పందించారు. “అంతేమీ లేదు. నాకు ఒక ఇల్లు మాత్రమే ఉంది” అని స్పష్టం చేశారు. తాను ఆర్థికంగా చితికిపోయాడనే మాట వాస్తవం కాదని, జీవితంలో ఒడిదుడుకులున్నా, మరీ దారుణమైన స్థితికి ఎప్పుడూ చేరుకోలేదని, ప్రస్తుతం ఆర్థికంగా సంతోషంగానే ఉన్నానని అన్నారు. తన భార్య జయంతి, కుమారుడు బెన్నీ, కోడలు అనూషతో సంతోషంగా జీవిస్తున్నానని పేర్కొన్నారు. ఒకసారి తనకు తీవ్ర అనారోగ్యం వచ్చిందని, మూడు-నాలుగు నెలలు కోమాలో ఉన్నాననే వార్త ప్రచారంలో ఉందని తెలిపారు. అయితే, తాను కేవలం ఒక నెల మాత్రమే కోమాలో ఉన్నానని, ఆ సమయంలో చికిత్సకు ఐదు ఆరు కోట్లు ఖర్చు అయ్యిందన్నది కూడా వాస్తవం కాదని వివరించారు. దేవుడి దయ వల్ల తాను కోలుకుని ఇప్పుడు ఆరోగ్యంగా, సంతోషంగా ఉన్నానని తెలిపారు. 65 ఏళ్ల వయసులో కూడా తాను ఇంట్లోనే వ్యాయామం చేస్తూ, ప్రతి వారం చర్చికి వెళ్తూ ఆరోగ్యంగా ఉంటున్నానని చెప్పారు.

ఎక్కువ మంది చదివినవి : Sowcar Janaki: షావుకారు జానకి మనవరాలు తెలుగులో పెద్ద హీరోయిన్.. చాలా ఫేమస్.. ఎవరో

కుమారుడు బెన్నీ వివాహానికి తాను పని చేసిన స్టార్ హీరోలు ఎవరూ హాజరు కాలేదని సుధాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం దర్శకులు బి.శ్రీనివాస రావు, బి.గోపాల్ వంటి వారు, నటులలో జగపతి బాబు, బ్రహ్మానందం, ఉత్తేజ్, జేడీ చక్రవర్తి మాత్రమే వచ్చారని తెలిపారు. చిరంజీవి గారిని స్వయంగా ఆహ్వానించినా, షూటింగ్‌లో ఉండటం వల్ల రాలేకపోయారని, అయితే ఆయన ఫోన్ చేసి తన కుమారుడు బెన్నీకి పరిశ్రమలో మద్దతు ఇస్తానని హామీ ఇచ్చారని సుధాకర్ కృతజ్ఞతలు తెలిపారు. చిరంజీవి గొప్ప మనసును ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. బ్రహ్మానందం, జగపతి బాబు కూడా తన కష్టకాలంలో నిలబడ్డారని గుర్తు చేసుకున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Cinema OTT: రహస్య బావిలో మహిళ అరుపులు.. భయంతో వణికిపోవాల్సిందే.. ఓటీటీని ఊపేస్తున్న హారర్ థ్రిల్లర్..

ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఆ హీరో మాములోడు కాదు.. నెంబర్ వన్ ఫ్రాడ్.. సీనియర్ నటుడు సురేష్..

Follow Us