Sowcar Janaki: షావుకారు జానకి మనవరాలు తెలుగులో పెద్ద హీరోయిన్.. చాలా ఫేమస్.. ఎవరో తెలుసా.. ?
తెలుగు సినిమా ప్రపంచంలో తనదైన ముద్ర వేసింది సీనియర్ నటి షావుకారు జానకి. దాదాపు ఏడున్నర దశాబ్దాల సినీ ప్రయాణంలో 400లకు పైగా సినిమాల్లో నటించి మెప్పించారు. కొన్నాళ్లుగా వద్ధాప్య అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె శుక్రవారం (ఆగస్ట్ 21)న కన్నుమూశారు. ఈ క్రమంలోనే షావుకారు జానకి కుటుంబం గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు నెటిజన్స్.

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన దిగ్గజ నటుల్లో షావుకారు జానకి ఒకరు. ఏడున్నర దశాబ్దాలకు పైగా విస్తరించిన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ఆమె తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో 400కు పైగా చిత్రాల్లో నటించారు. చాలా కాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె శుక్రవారం కన్నుమూశారు. 1931 డిసెంబర్ 12న రాజమండ్రిలో జన్మించిన జానకి, 1950లో వచ్చిన ‘షావుకారు’ సినిమాతో తెరంగేట్రం చేశారు. మొదటి సినిమానే ఘన విజయం సాధించడంతో ఆ చిత్ర పేరే ఆమె ఇంటిపేరుగా మారిపోయింది. కథానాయికగానే కాకుండా సహయ నటిగా కూడా ఆమె ఎన్నో మెప్పించే పాత్రలు చేశారు. ‘శుభాకాంక్షలు’, ‘బావగారూ బాగున్నారా?’, ‘దేవి’, ‘రావోయ్ చందమామ’, ‘ఎవడే సుబ్రహ్మణ్యం’, ‘కంచె’ వంటి అనేక హిట్ సినిమాల్లో ప్రముఖ పాత్రలు పోషించారు. 90 ఏళ్లు దాటినా నటనపై ఆమెకున్న మక్కువ ఏమాత్రం తగ్గలేదు. ఇటీవల ‘అన్నీ మంచి శకునములే’ చిత్రంలోనూ ఆమె కనిపించారు.
ఎక్కువమంది చదివినవి : Hemachandra : శ్రావణ భార్గవితో విడాకులు ?.. రూమర్స్ పై స్పందించిన హేమచంద్ర.. ఏమన్నారంటే..
అయితే, షావుకారు జానకి సినీ వారసత్వాన్ని ఆమె మనవరాలు వైష్ణవి కూడా ముందుకు తీసుకెళ్లారనే విషయం చాలామందికి తెలియదు. వైష్ణవి దక్షిణాది సినిమాల్లో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన కల్ట్ క్లాసిక్ సినిమా ‘రోజా’లో హీరోయిన్ మధుబాల అక్క పాత్రలో వైష్ణవి నటించి ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. అలాగే విక్టరీ వెంకటేష్ నటించిన ‘ప్రేమ’ చిత్రంలో హీరోయిన్ చెల్లెలు లీజ్జీ పాత్రలో కనిపిస్తారు.
ఎక్కువమంది చదివినవి : Cinema : ఓటీటీలో వణుకు పుట్టించిన సస్పెన్స్ థ్రిల్లర్.. ఇప్పుడు యూట్యూబ్‌లో ట్రెండింగ్.. మైండ్ బ్లాకింగ్ హారర్ మూవీ..
తెలుగులో రాజేంద్ర ప్రసాద్ సరసన ‘అత్తింట్లో అద్దె మొగుడు’, ‘చామంతి’ వంటి చిత్రాల్లో హీరోయిన్‌గా అలరించారు. వీటితో పాటు ‘అయ్యప్ప కరుణ’, ‘పరువు ప్రతిష్ట’ వంటి సినిమాల్లోనూ మెరిసారు. తెలుగుతో పోలిస్తే తమిళ, మలయాళ భాషల్లో వైష్ణవి ఎక్కువ సంఖ్యలో సినిమాలు చేశారు. అలా షావుకారు జానకి కుటుంబం నుంచి వచ్చిన మరొక ప్రతిభావంతమైన నటిగా వైష్ణవి గుర్తింపు పొందారు.
ఎక్కువమంది చదివినవి : Mokshagna : వారసుడు వచ్చేస్తున్నాడు.. దసరాకు మోక్షజ్ఞ గ్రాండ్ ఎంట్రీ.. డైరెక్టర్ ఎవరంటే..
షావుకారు జానకి మనవరాలు..
View this post on Instagram
View this post on Instagram
ఎక్కువమంది చదివినవి : Jr.NTR : ఎన్టీఆర్తో చేసిన ఆ సినిమా ప్లాప్ కావడానికి కారణం అదే.. ఆ నిర్ణయమే పొరపాటు అయ్యింది..
