AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 10 Telugu : బిగ్‏బాస్‏లోకి ఈశ్వర సాయి, మాధురి రాథోడ్.. ఆది రెడ్డి చెప్పిందే నిజమవుతుందా.. ?

గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో మారుమోగుతున్న పేర్లు ఈశ్వరసాయి, మాధురి రాథోడ్. మొన్నటి వరకు ఫోక్ సాంగ్స్ ద్వారా విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్నారు వీరిద్దరు. ఈ జోడికి దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ ఇద్దరూ ఒక వివాదంతో వార్తలలో నిలిచారు. అయితే ఇప్పుడు బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు టాక్.

Bigg Boss 10 Telugu : బిగ్‏బాస్‏లోకి ఈశ్వర సాయి, మాధురి రాథోడ్.. ఆది రెడ్డి చెప్పిందే నిజమవుతుందా.. ?
Eshwar Sai, Madhuri Rathod
Rajitha Chanti
|

Updated on: Aug 21, 2026 | 8:33 PM

Share

బుల్లితెరపై త్వరలోనే బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 ప్రారంభం కాబోతున్న సంగతి తెలిసిందే. దీంతో ఇప్పటికే సామాన్యుల కోసం అగ్నిపరీక్ష 2 నిర్వహిస్తున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో సెలబ్రెటీ కంటెస్టెంట్స్ పేర్లు తెగ హల్చల్ చేస్తున్నాయి. సీరియల్ తారల నుంచి సినిమా హీరోహీరోయిన్లు, ఇన్ స్టా ఇన్ల్ఫుయేన్సర్స్ సైతం హౌస్ లోకి అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఫోక్ డ్యాన్సర్లు శ్వర్ సాయి, మాధురి రాథోడ్ బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టబోతున్నారనే వార్త ఇప్పుడు నెట్టింట తీవ్ర చర్చనీయాంశమైంది. మాజీ బిగ్‌బాస్ కంటెస్టెంట్, రివ్యూయర్ ఆది రెడ్డి కూడా వీరి ఎంట్రీపై తన అభిప్రాయాలను వ్యక్తపరచడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. ఇటీవల రెండు రోజులుగా వీరిద్దరి పేర్లు నెట్టింట మారుమోగుతున్న సంగతి తెలిసిందే. వ్యక్తిగత వివాదంలో ఇద్దరి పేర్లు వార్తలలో నిలవగా.. ఇప్పుడు వీరి గురించి తెలుసుకోవడానికి నెటిజన్స్ తెగ సెర్చ్ చేస్తున్నారు.

బిగ్‌బాస్ షో ప్రతి సీజన్‌లోనూ వివాదాలు , లేదా సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయ్యే కాంబినేషన్లను లేదా వైరల్ కంటెస్టెంట్లను తీసుకోవడానికి ఆసక్తి చూపుతుంది. ఇటీవల ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ చుట్టూ ముసురుకున్న కుటుంబ వివాదం, సోషల్ మీడియా వ్యాఖ్యలు, మీడియాలో వచ్చిన వార్తలు విపరీతమైన వ్యూస్‌ను, పబ్లిసిటీని తెచ్చిపెట్టాయి. దీంతో టీఆర్‌పీ కోసం బిగ్‌బాస్ నిర్వాహకులు ప్రస్తుతం విపరీతమైన పబ్లిసిటీ క్రేజ్ ఉన్న వీరిని సంప్రదించే అవకాశాలు మెండుగా ఉన్నాయని అంటున్నాడు ఆదిరెడ్డి. గత సీజన్లలో కూడా వివాదాస్పదంగా మారిన ఇన్‌ఫ్లుయెన్సర్లకు, కాంట్రవర్సీ పెయిర్స్‌కు బిగ్‌బాస్ అవకాశాలు ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి.

ఆది రెడ్డి చెప్పిందే నిజమవుతుందా? బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎవరిని తీసుకురావాలనేది ఆర్గనైజర్స్ చేతిలోనే ఉంటుంది. అయితే ఆది రెడ్డి అంచనాలు చాలా వరకు బిగ్‌బాస్ కంటెంట్ అండ్ మైండ్‌సెట్‌ను బట్టి సరిపోతుంటాయి. “ప్రమీల”, “రాతిరి రాతిరి” వంటి హిట్ పాటలతో వీరిద్దరికి ఇప్పటికే మంచి గుర్తింపు ఉంది. దానికి తోడు ఇటీవల జరిగిన వివాదం వల్ల వీరి పేర్లు ప్రతి ఒక్కరి నోటా నానుతున్నాయి. బిగ్‌బాస్‌కు కావాల్సిన ముఖ్యమైన ఎలిమెంట్ ‘అటెన్షన్’, కాబట్టి వీరిద్దరినీ ఒకే హౌస్‌లోకి పంపితే డ్రామా నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుందని నిర్వాహకులు భావించే అవకాశం ఉందని అంటున్నారు. వార్తలు, ఆది రెడ్డి రివ్యూలు ఎలా ఉన్నా బిగ్‌బాస్ మేనేజ్‌మెంట్ ఎలాంటి అధికారిక లీక్స్ ఇవ్వదు. షో లాంచ్ అయ్యే వరకు కాంట్రాక్టులు గోప్యంగా ఉంటాయి. ఒకవేళ వీరిద్దరిని కంటెస్టెంట్లను తీసుకురావడం బిగ్‌బాస్ మార్క్ కాబట్టి, ఆది రెడ్డి చెప్పినట్లుగానే వీరి ఎంట్రీ నిజమైనా ఆశ్చర్యపోనవసరం లేదు!

ఎక్కువమంది చదివినవి : Mokshagna : వారసుడు వచ్చేస్తున్నాడు.. దసరాకు మోక్షజ్ఞ గ్రాండ్ ఎంట్రీ.. డైరెక్టర్ ఎవరంటే..

ఎక్కువమంది చదివినవి : Jr.NTR : ఎన్టీఆర్‏తో చేసిన ఆ సినిమా ప్లాప్ కావడానికి కారణం అదే.. ఆ నిర్ణయమే పొరపాటు అయ్యింది..

Follow Us