AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: అప్పుడు వైజాగ్ కలెక్టర్.. ఇప్పుడు సినిమాల్లో పెద్ద నటుడు.. గవర్నమెంట్ ఉద్యోగం వదిలి సినిమాల్లోకి ఎందుకు వచ్చారంటే..

జాయింట్ కలెక్టర్ ఉద్యోగాన్ని వదిలి సినిమా రంగంలోకి ప్రవేశించిన నటుడు. ఆయన సినీ ప్రయాణం స్ఫూర్తిదాయకం. అనుకోకుండా ప్రారంభమైన సినీ జీవితంలో ఎదురైన సవాళ్లు, సినీ ప్రముఖుల ప్రోత్సాహం, తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలు, నేడు సాధించిన విజయాల గురించి ఆయన వెల్లడించారు. ఇది సురక్షితమైన కెరీర్‌ను వదిలి కలలను వెంబడించిన కథ. ఒకప్పుడు జాయింట్ కలెక్టర్ వంటి ఉన్నత ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న ఆయన, సినిమా రంగం పట్ల ఆసక్తితో ఆ స్థానాన్ని వదులుకొని నటనను వృత్తిగా స్వీకరించారు.

Tollywood: అప్పుడు వైజాగ్ కలెక్టర్.. ఇప్పుడు సినిమాల్లో పెద్ద నటుడు.. గవర్నమెంట్ ఉద్యోగం వదిలి సినిమాల్లోకి ఎందుకు వచ్చారంటే..
Vadlamani Saisrinivas
Rajitha Chanti
|

Updated on: Aug 25, 2026 | 9:42 PM

Share

ఉన్నతమైన జాయింట్ కలెక్టర్ పదవిని వదిలితెలుగు సినిమా రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటున్న నటుడు వడ్లమాని సాయి శ్రీనివాస్ జీవిత ప్రయాణం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆయన తన సినీ రంగ ప్రవేశం, ఎదురైన సవాళ్లు, తీసుకున్న కీలక నిర్ణయాల గురించి వివరించారు. సాయి శ్రీనివాస్ సినీ ప్రస్థానం రారండోయ్ వేడుక చూద్దాం చిత్రంతో మొదలైంది. దర్శకుడు కళ్యాణ్ కృష్ణ తన తొలి అవకాశాన్ని అందించారు. ఈ చిత్రంలో పోర్ట్ చైర్మన్ పాత్రలో చిన్న వేషం వేశారు. నిజానికి ఆ సమయంలో సినిమాల పట్ల ఆయనకు పెద్దగా ఆసక్తి లేదు. తన కుటుంబ స్నేహితులు అయిన కళ్యాణ్ కృష్ణ బ్రదర్స్ సురేష్ , కన్నబాబు ద్వారా ఈ అవకాశం వచ్చింది. ఆ సినిమా తర్వాత ఆ విషయాన్ని ఆయన అక్కడితో వదిలేశారు. తొలి సినిమా తర్వాత మళ్లీ మారుతి దర్శకత్వంలో మహానుభావుడు చిత్రంలో ఒక పెద్ద వేషం లభించింది. ఈ సినిమాతో ఆయనకు నటుడిగా మంచి గుర్తింపు లభించింది. ఎడిటింగ్, కెమెరా, డైరెక్షన్ విభాగాల నుంచి మంచి ప్రశంసలు వచ్చినా, అప్పుడున్న ప్రభుత్వ ఉద్యోగ బిజీ కారణంగా సినిమాలలో కొనసాగలేకపోయారు. అయినా, వైజాగ్ కలెక్టర్ ప్రవీణ్ కుమార్ గారి ప్రోత్సాహంతో అప్పుడప్పుడు అవకాశాలు వస్తే ప్రయత్నించమని సూచించారు.

ఎక్కువమంది చదివినవి : Aamani: నాకు లైఫ్ ఇచ్చింది ఆయనే.. ఆ హీరోతోనే ఎక్కువ సినిమాలు చేశా.. హీరోయిన్ ఆమని..

తర్వాత పరశురాం దర్శకత్వంలో గీత గోవిందం సినిమాలో హీరోయిన్ తండ్రి పాత్రలో నటించారు. ఈ సినిమా 100 కోట్ల క్లబ్‌లో చేరడంతో, సాయి శ్రీనివాస్ చేసిన సినిమాలు విజయవంతం అవుతున్నాయనే చిన్న ఇమేజ్ ఏర్పడింది. ఈ విజయాలు, అప్పటికి 47 సంవత్సరాలు ఉన్న ఆయనకు, తెలుగు చిత్ర పరిశ్రమలో తన వయసు వారికి సరైన అవకాశాలు ఉన్నాయని గుర్తించేలా చేశాయి. శైలజా రెడ్డి అల్లుడు, సుమంత్ హీరోగా నటించిన సుబ్రహ్మణ్యపురం చిత్రంలో విలన్ పాత్రలు ఆయనకు మరింత పేరు తెచ్చాయి. ఎఫ్2 సినిమాలో అనిల్ రావిపూడి ఇచ్చిన పెళ్లిళ్ల పేరయ్య పాత్ర, వెంకటేష్‌తో చేసిన సన్నివేశాలు సినిమా విజయానికి దోహదపడ్డాయి. ఎఫ్2 పెద్ద హిట్ అయిన తర్వాత, ప్రభుత్వ ఉద్యోగంలో ఉండగా షూటింగ్స్‌లో పాల్గొనడం వల్ల పలు విమర్శలు ఎదుర్కొన్నారు. “ఆయన ఎక్కడున్నారు?” అనే ప్రశ్నలు, పేపర్ వార్తలు రావడంతో రెండు పడవల ప్రయాణం సరికాదని గుర్తించారు.

ఎక్కువమంది చదివినవి : Chalaki Chanti: వాడు నా పొట్ట కొట్టాడు.. నాకు అవకాశాలు రాకుండా చేశాడు.. చలాకీ చంటి..

తొలుత సెలవు పెట్టి, ఆరు నెలల పాటు సినిమా అవకాశాలను పరిశీలించారు. ఈ ఆరు నెలల్లో ఆరు నుంచి ఏడు సినిమాలు ఆయనకు వచ్చాయి. ఇది పూర్తిస్థాయి నిర్ణయం తీసుకోవడానికి బలాన్ని ఇచ్చింది. 2019 జూన్‌లో హైదరాబాద్‌కు మారిన ఆయన, వైజాగ్ అంటే తనకెంతో ఇష్టమని, ఆ ఊరు లేకుండా బతకలేననుకునేవాడినని తెలిపారు. మారుతి, అల్లు ఆనంద్, అల్లు అరవింద్ వంటి సినీ ప్రముఖుల సలహాలతో ధైర్యం చేసి హైదరాబాద్‌కు వచ్చారు. వెనక్కి వెళ్లే అవకాశం ఉన్నా, శివనల గారి “కలల కోట చేరాలంటే యుద్ధమే శరణ్యం” అన్న మాటను గుర్తు చేసుకుని, పూర్తిస్థాయిలో సినిమాలకే అంకితం కావాలని నిర్ణయించుకున్నారు. 2021లో స్వచ్ఛంద పదవీ విరమణ (VRS) తీసుకొని, ప్రభుత్వ ఉద్యోగం నుండి పూర్తిగా బయటపడ్డారు. గత రెండున్నర నుంచి నాలుగు సంవత్సరాలుగా ఆయన సినీ రంగంలో చురుకుగా ఉన్నారు. ఈ స్వల్ప వ్యవధిలో 92-93 ప్రాజెక్టులలో నటించి, 67 చిత్రాలను విడుదల చేశారు. ఇటీవల విడుదలైన భగవంతు కేసరి ఆయన 68వ చిత్రం.

ఎక్కువమంది చదివినవి :  Eshwar Sai : ఆ టైంలోనే మాధురి నాకు కనెక్ట్ అయ్యింది.. ఆమె చాలా మంచిది.. నోరు విప్పిన ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర సాయి..

వడ్లమాని శ్రీనివాస్ ..

Vadlamani Saisrinivas Actor

Vadlamani Saisrinivas Actor

ఎక్కువమంది చదివినవి :  Comedian Sudhakar: ఒక్క సినిమాకు రూ.30 వేల రెమ్యునరేషన్.. ఆస్తులపై క్లారిటీ ఇచ్చిన నటుడు సుధాకర్..

Follow Us
కలెక్టర్ ఉద్యోగాన్ని వదులుకుని సినిమాల్లోకి వచ్చిన నటుడు..
కలెక్టర్ ఉద్యోగాన్ని వదులుకుని సినిమాల్లోకి వచ్చిన నటుడు..
అరటి తోటల్లో అలికిడి.. అడుగు ముందుకేసిన రైతుకు ఎదరైన భయానక దృశ్యం
అరటి తోటల్లో అలికిడి.. అడుగు ముందుకేసిన రైతుకు ఎదరైన భయానక దృశ్యం
శ్రావణ పౌర్ణమి: రాఖీ కట్టే రోజున ఈ పనులు చేయకండి!
శ్రావణ పౌర్ణమి: రాఖీ కట్టే రోజున ఈ పనులు చేయకండి!
సప్త సముద్రాలు ఈది.. పిల్ల కాలువలో తేలిపోయిన టీమిండియా
సప్త సముద్రాలు ఈది.. పిల్ల కాలువలో తేలిపోయిన టీమిండియా
డిగ్రీ, డిప్లొమా మార్కులతో BEMLలో 1346 ఉద్యోగాలు.. రాతపరీక్ష లేదు
డిగ్రీ, డిప్లొమా మార్కులతో BEMLలో 1346 ఉద్యోగాలు.. రాతపరీక్ష లేదు
మిలాద్-ఉన్-నబీ స్పెషల్.. రైస్ ఖీర్‌ను ఇలా తయారు చేస్తే ఉంటాది..
మిలాద్-ఉన్-నబీ స్పెషల్.. రైస్ ఖీర్‌ను ఇలా తయారు చేస్తే ఉంటాది..
పొయ్యి వెలిగించే పనిలేకుండా.. అమ్మమ్మల నాటి కమ్మని 'పొలం పచ్చడి'
పొయ్యి వెలిగించే పనిలేకుండా.. అమ్మమ్మల నాటి కమ్మని 'పొలం పచ్చడి'
ఏడాదికి 4 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ.. మీరూ పొందోచ్చు..
ఏడాదికి 4 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ.. మీరూ పొందోచ్చు..
చుక్క నూనెతో 10 నిమిషాల్లో  వంకాయ తవా ఫ్రై
చుక్క నూనెతో 10 నిమిషాల్లో  వంకాయ తవా ఫ్రై
ప్రాణాల మీదకు తెచ్చిన పిల్లి.. హాస్పిటల్‌లో 10 మంది కూలీలు..
ప్రాణాల మీదకు తెచ్చిన పిల్లి.. హాస్పిటల్‌లో 10 మంది కూలీలు..