AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చరణ్ చిన్నప్పుడు తెగ అల్లరి చేసేవాడు.. నేనే స్కూల్ నుంచి తీసుకొచ్చేవాడిని

ఈ ఫొటోలో కనిపిస్తున్న నటుడు తెలుగు సినీ ప్రపంచంలో తనదైన ముద్ర వేశారు. తెలుగు, తమిళం, కన్నడ భాషలలో అనేక హిట్ చిత్రాల్లో నటించి మెప్పించారు. ముఖ్యంగా విలన్ పాత్రలకు చాలా ఫేమస్ అయ్యారు. వెంకటేశ్, చిరంజీవి, బాలకృష్ణ వంటి స్టార్ హీరోల సినిమాల్లో పవర్ ఫుల్ విలన్ గా కనిపించారు.

చరణ్ చిన్నప్పుడు తెగ అల్లరి చేసేవాడు.. నేనే స్కూల్ నుంచి తీసుకొచ్చేవాడిని
Ram Charan
Rajeev Rayala
|

Updated on: Aug 28, 2026 | 2:51 PM

Share

సీనియర్ నటుడు ఆనందరాజ్ ఓ ఇంటర్వ్యూలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి రెబెల్ స్టార్ ప్రభాస్‌ల గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.  దక్షిణాది చిత్ర పరిశ్రమలో విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనదైన ముద్ర వేసిన సీనియర్ నటుడు ఆనందరాజ్. ఎన్నో సినిమాల్లో తన విలనిజంతో భయపెట్టారు. ముఖ్యంగా చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ వంటి అగ్ర కథానాయకుల సినిమాల్లో కరుడుగట్టిన ప్రతినాయకుడిగా అలరించిన ఆయన ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి కామెడీ విలన్ గా నవ్వులు పూయిస్తున్నారు. తెలుగు సినిమాల్లో కనిపిస్తుంది తక్కువే అయినా తమిళ్ సినిమాల్లో బిజీగా గడుపుతున్నారు ఆనంద్ రాజ్. కాగా  గతంలో ఓ ఇంటర్వ్యూలో టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్ చరణ్, ప్రభాస్‌లతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

Jabardasth Naresh: మొదట్లో రూ.500 ఇచ్చారు.. ఇప్పుడు ఒకొక్క ఎపిసోడ్‌కు నాకు ఇచ్చేది ఎంతంటే

రామ్ చరణ్‌ చిన్నతనంలో అతన్ని స్కూల్ నుంచి తీసుకొచ్చేవాడినని ఆనంద్ రాజ్ గుర్తు చేసుకున్నారు. మెగాస్టార్ చిరంజీవితో ‘గ్యాంగ్ లీడర్’ వంటి సూపర్ హిట్ సినిమాల్లో కలసి నటించిన రోజులను గుర్తుచేసుకుంటూ… చిన్నతనంలో రామ్ చరణ్ స్కూల్ నుంచి తిరిగొచ్చే సమయంలో తానే స్వయంగా వెళ్ళి ఇంటికి తీసుకెళ్లేవాడినని ఆనందరాజ్ తెలిపారు. అప్పట్లో చరణ్ చాలా అల్లరిగా, ముద్దుగా ఉండేవాడని, ఇప్పుడు అంత పెద్ద గ్లోబల్ స్టార్‌గా ఎదగడం చూస్తుంటే చాలా గర్వంగా ఉందన్నారు.

రూ. 65కోట్లు పెడితే.. రూ.10 కోట్లు కూడా రాలేదు.. డిజాస్టర్ దెబ్బకు హీరో రూపాయి కూడా తీసుకోలేదు

అలాగే ప్రభాస్ గురించి  మాట్లాడుతూ..ప్రభాస్ కెరీర్ బిగినింగ్ రోజుల్లో వచ్చిన ‘రాఘవేంద్ర’ సినిమాలో ఆనందరాజ్ ముఖ్య పాత్రలో నటించారు. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే ప్రభాస్ కటౌట్, ఆయన నటన, వినయం చూసి “నువ్వు కచ్చితంగా పెద్ద స్టార్‌వి అవుతావ్” అని అప్పుడే చెప్పినట్లు గుర్తుచేసుకున్నారు. ఆ అంచనా నిజమై ప్రభాస్ పాన్-ఇండియా రేంజ్‌కు వెళ్లడం ఆనందాన్ని ఇస్తోందని పేర్కొన్నారు. చిరంజీవితో ఉన్న ఆత్మీయ అనుబంధం వల్లే వారి కుటుంబంతో మంచి పరిచయం ఏర్పడిందని, నేటి తరం స్టార్ హీరోలు చూపిస్తున్న క్రమశిక్షణే వారిని ఈ స్థాయిలో నిలబెట్టిందని ఆనందరాజ్ కొనియాడారు.

ఇవి కూడా చదవండి

Anandraj

ఆ హీరోలతో సినిమాలు చేయడం కష్టం.. నా వల్ల కాదు! ఓపెన్‌గా చెప్పేసిన తేజ

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us