AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ హీరోలతో సినిమాలు చేయడం కష్టం.. నా వల్ల కాదు! ఓపెన్‌గా చెప్పేసిన తేజ

కొరియోగ్రాఫర్ గా కెరీర్ ప్రారంభించిన తేజ ఆ తర్వాత డైరెక్టర్ గా మారారు. తెలుగులో పలు సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించారు. ఉదయ్ కిరణ్ తో చిత్రం, నువ్వునేను, నితిన్ తో జయం వంటి యూత్ ఫుల్ లవ్ స్టోరీలను ఆడియెన్స్ కు అందించాడు తేజ.

ఆ హీరోలతో సినిమాలు చేయడం కష్టం.. నా వల్ల కాదు! ఓపెన్‌గా చెప్పేసిన తేజ
Teja
Rajeev Rayala
|

Updated on: Aug 25, 2026 | 12:19 PM

Share

ప్రముఖ దర్శకుడు తేజ ప్రస్తుతం సినిమాల స్పీడ్ తగ్గించారు. ఒకప్పుడు ఎన్నో విజయవంతమైన సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు ఈ స్టార్ డైరెక్టర్. తేజ చివరిగా అహింస అనే సినిమా చేశాడు. కానీ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. కాగా గతంలో ఓ ఇంటర్వ్యూలో తేజ మాట్లాడుతూ.. తెలుగు సినిమా పరిశ్రమ, స్టార్ హీరోలతో కలిసి పనిచేయడం, ప్రస్తుత సినిమా ధోరణులపై తన నిక్కచ్చి అభిప్రాయాలను పంచుకున్నారు. చిరంజీవి వంటి అగ్ర తారలతో సినిమా తీసే అవకాశం వచ్చినా తాను ఎందుకు చేయలేనో కూడా ఆయన వివరించారు. తేజ ప్రకారం, స్టార్ హీరోల చిత్రాలకు ఒక ఫార్మాట్‌ ఉంటుంది. ఈ ఫార్మాట్‌లో ఎన్ని పాటలు ఉండాలి, ఎన్ని ఫైట్లు ఉండాలి, ఎలాంటి కామెడీ ఉండాలి వంటి అంశాలు ముందే ఫిక్స్ అయ్యి ఉంటాయని ఆయన పేర్కొన్నారు. తాను ఒక “ఫ్రీ స్పిరిట్” అని, ఏ సినిమాకైనా తన ఆత్మ స్వేచ్ఛగా ఉండాలని, నచ్చినట్టు చేయగలగాలని ఆయన అన్నారు. ఈ కారణంగా, స్టార్ హీరోల  ఫార్మాట్‌లలో ఇమిడిపోవడం తన వల్ల కాదని, అటువంటి సినిమాలను తాను చేయలేనని స్పష్టం చేశారు.

అసలు ఆ సినిమా చేయాలనుకోలేదు.. అనుకోకుండా చేశాం..! పెద్ద హిట్ అయ్యింది

అలాగే స్టార్ హీరోలతో పనిచేయడం కష్టమని, వారి స్థాయిని అందుకోవడం తనకు సాధ్యం కాదని ఆయన అన్నారు. చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ వంటి నటులు ఒక ప్రత్యేకమైన అచ్చులో ఉంటారని, వారితో తాను సరిపోలలేనని తేజ అభిప్రాయపడ్డారు. అలాగే ప్రస్తుతం చాలా సినిమాలు “నాన్-థింకింగ్” ధోరణిలో వస్తున్నాయని, అంటే ప్రేక్షకులను ఆలోచింపజేసే కథలు తగ్గిపోయాయని అన్నారు. బాలీవుడ్, తమిళ, కన్నడ, మలయాళ చిత్ర పరిశ్రమలలో ఆలోచింపజేసే కథలు వస్తున్నప్పటికీ, తెలుగులో మాత్రం ఎక్కువగా కామెడీ ట్రాక్‌ల మీద ఆధారపడుతున్నారని ఆయన విమర్శించారు.

మహేష్ బాబుకు అమ్మగా నటించాలని ఉంది.. ఆ ఛాన్స్ ఎప్పుడొస్తుందో.!

హాస్యాన్ని ఎవరు కావాలంటే వారు రాయగలరని, ఇది సినిమా మేకింగ్‌ను సులభతరం చేసిందని, దాని వల్ల ఎమోషన్ తగ్గిపోతుందని తేజ అన్నారు. డిజిటలైజేషన్ ప్రభావం వల్ల కేవలం ఉత్సాహం తప్ప అవగాహన లేని వారు కూడా సినిమాలు తీస్తున్నారని, ఇది పరిశ్రమకు లాభమా, నష్టమా అనే ప్రశ్నను లేవనెత్తారు. దీనివల్ల మంచి కథలు రావడం లేదని, ప్రొడ్యూసర్లు నష్టపోతున్నారని, థియేటర్‌లో విడుదలైన సినిమాలు రెండు మూడు రోజుల్లోనే ఆగిపోతున్నాయని ఆయన అన్నారు.

ఇవి కూడా చదవండి

చూడటానికి అలా ఉంటుంది కానీ.. ఆమెకు పొగరెక్కువ..! సాయి పల్లవి నిజస్వరూపం ఇదే అంటున్న యంగ్ హీరో

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

Follow Us
బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే..?
బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే..?
అంతపెద్ద భారీ దేహంతో ఇటెందుకొచ్చావ్ నాగన్నా..? భయంతో జనాలు గజగజ
అంతపెద్ద భారీ దేహంతో ఇటెందుకొచ్చావ్ నాగన్నా..? భయంతో జనాలు గజగజ
డాడీ సినిమాకు 25 ఏళ్లు.. పవన్, అల్లు అర్జున్ ఇద్దరికి స్పెషల్..
డాడీ సినిమాకు 25 ఏళ్లు.. పవన్, అల్లు అర్జున్ ఇద్దరికి స్పెషల్..
జాబిల్లిపై న్యూక్లియర్ రేస్.. అగ్రరాజ్యాల మధ్య పెరుగుతున్న పోటీ
జాబిల్లిపై న్యూక్లియర్ రేస్.. అగ్రరాజ్యాల మధ్య పెరుగుతున్న పోటీ
పాలు, గుడ్లు కన్నా ఐదు రెట్లు ఎక్కువ.. రోజూ తింటే ఎముకలు ఉక్కులా
పాలు, గుడ్లు కన్నా ఐదు రెట్లు ఎక్కువ.. రోజూ తింటే ఎముకలు ఉక్కులా
ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. టైమింగ్స్ కూడా ఫిక్స్..!
ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. టైమింగ్స్ కూడా ఫిక్స్..!
దేవుడికీ అప్పు ఎగ్గొట్టి.. అమ్మోరు తల్లికే IP నోటీసు పంపిన ఘనుడు!
దేవుడికీ అప్పు ఎగ్గొట్టి.. అమ్మోరు తల్లికే IP నోటీసు పంపిన ఘనుడు!
ఏపీలో బర్డ్ ఫ్లూ కలకలం.. వేలల్లో కోళ్లు మృత్యువాత..
ఏపీలో బర్డ్ ఫ్లూ కలకలం.. వేలల్లో కోళ్లు మృత్యువాత..
జో రూట్‌‌ను దాటేసిన షాయ్ హోప్
జో రూట్‌‌ను దాటేసిన షాయ్ హోప్
రష్యాలో ప్లేగు.. బాక్టీరియా ఉన్న టెస్ట్ ట్యూబ్ పగిలి మహిళ మృతి
రష్యాలో ప్లేగు.. బాక్టీరియా ఉన్న టెస్ట్ ట్యూబ్ పగిలి మహిళ మృతి