AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒకేసారి వేలల్లో కోళ్లు మృత్యువాత.. విషయం తెలుసుకుని షాక్ అయిన నాన్ వెజ్ ప్రియులు..

అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం సిద్ధరాంపురంలో బర్డ్‌ ఫ్లూ కలకలం రేపింది. ఓ కోళ్ల ఫామ్‌లో 2 వేలకు పైగా కోళ్లు మృతి చెందడంతో అధికారులు నమూనాలను పరీక్షలకు పంపారు. భోపాల్‌ హై సెక్యూరిటీ యానిమల్‌ డిసీజెస్‌ ల్యాబొరేటరీలో బర్డ్‌ ఫ్లూ పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. చికెన్‌, గుడ్లను పూర్తిగా ఉడికించి తినాలని సూచించారు.

ఒకేసారి వేలల్లో కోళ్లు మృత్యువాత.. విషయం తెలుసుకుని షాక్ అయిన నాన్ వెజ్ ప్రియులు..
Bird Flu In Anantapur
Nalluri Naresh
| Edited By: |

Updated on: Oct 05, 2026 | 10:46 AM

Share

అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం సిద్ధరాంపురం గ్రామంలో బర్డ్ ఫ్లూ తీవ్ర కలకలం రేపుతోంది. గ్రామంలోని ఓ కోళ్ల ఫామ్‌లో ఏకంగా రెండు వేలకు పైగా కోళ్లు వరుసగా మృత్యువాత పడటం తీవ్ర భయాందోళనలకు దారితీసింది. ఒకేసారి ఇన్ని కోళ్లు చనిపోవడంతో అనుమానం వచ్చిన ఫామ్ యజమాని వెంటనే పశుసంవర్ధక శాఖ అధికారులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారులు చనిపోయిన కోళ్ల నమూనాలను ప్రాథమిక పరీక్షల కోసం విజయవాడ ల్యాబ్‌కు తరలించారు. అక్కడి నుంచి లభించిన సమాచారంతో మరింత స్పష్టత కోసం శాంపిల్స్‌ను భోపాల్‌‌లోని హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ ల్యాబొరేటరీకి పంపారు.

అక్కడ నిర్వహించిన పరీక్షల్లో కోళ్లకు బర్డ్ ఫ్లూ పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో అధికారులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. విజయవాడ నుంచి వచ్చిన ప్రత్యేక అధికారుల బృందం క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టింది. ఫలితాలు పాజిటివ్‌గా రావడంతో వైరస్ ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు.

సిద్ధరాంపురం పరిసర ప్రాంతాల్లో పశుసంవర్ధక శాఖ అధికారులు అవగాహన ర్యాలీ నిర్వహించి, కోళ్ల ఫామ్‌ల యజమానులకు, స్థానికులకు తగిన జాగ్రత్తలు సూచించారు. ముందస్తు జాగ్రత్తలు పాటిస్తూ, చికెన్, గుడ్లను సరిగ్గా ఉడికించి తినాలని, అనవసరంగా భయాందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. కోళ్ళకు బోర్డ్ ఫ్లూ వైరస్ సోకడంతో.. నాన్ వెజ్ ప్రియులు చికెన్ కి బదులు సీ ఫుడ్స్ పై ఆసక్తి చూపుతున్నారు.

Follow Us
జాబిల్లిపై న్యూక్లియర్ రేస్.. అగ్రరాజ్యాల మధ్య పెరుగుతున్న పోటీ
జాబిల్లిపై న్యూక్లియర్ రేస్.. అగ్రరాజ్యాల మధ్య పెరుగుతున్న పోటీ
పాలు, గుడ్లు కన్నా ఐదు రెట్లు ఎక్కువ.. రోజూ తింటే ఎముకలు ఉక్కులా
పాలు, గుడ్లు కన్నా ఐదు రెట్లు ఎక్కువ.. రోజూ తింటే ఎముకలు ఉక్కులా
ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. టైమింగ్స్ కూడా ఫిక్స్..!
ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. టైమింగ్స్ కూడా ఫిక్స్..!
దేవుడికీ అప్పు ఎగ్గొట్టి.. అమ్మోరు తల్లికే IP నోటీసు పంపిన ఘనుడు!
దేవుడికీ అప్పు ఎగ్గొట్టి.. అమ్మోరు తల్లికే IP నోటీసు పంపిన ఘనుడు!
ఏపీలో బర్డ్ ఫ్లూ కలకలం.. వేలల్లో కోళ్లు మృత్యువాత..
ఏపీలో బర్డ్ ఫ్లూ కలకలం.. వేలల్లో కోళ్లు మృత్యువాత..
జో రూట్‌‌ను దాటేసిన షాయ్ హోప్
జో రూట్‌‌ను దాటేసిన షాయ్ హోప్
రష్యాలో ప్లేగు.. బాక్టీరియా ఉన్న టెస్ట్ ట్యూబ్ పగిలి మహిళ మృతి
రష్యాలో ప్లేగు.. బాక్టీరియా ఉన్న టెస్ట్ ట్యూబ్ పగిలి మహిళ మృతి
భవిష్యత్తు కోసం ఈరోజే ఆలోచించండి.. ఐదేళ్ల రాజు కథ
భవిష్యత్తు కోసం ఈరోజే ఆలోచించండి.. ఐదేళ్ల రాజు కథ
సోమవారం శివుడిని ఎందుకు పూజిస్తారు? 16 సోమవారాల వ్రతం చేస్తే..
సోమవారం శివుడిని ఎందుకు పూజిస్తారు? 16 సోమవారాల వ్రతం చేస్తే..
కోడి కూర వండేటప్పుడు ఈ ఆకులు వేసి తింటే కళ్ళ జోడుతో పనే లేదు
కోడి కూర వండేటప్పుడు ఈ ఆకులు వేసి తింటే కళ్ళ జోడుతో పనే లేదు