AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్ ఫిక్స్.. టైమింగ్స్ కన్ఫామ్..! టికెట్ ధర ఎంతంటే..?

ఏపీకి తొలి వందే భారత్ స్లీపర్ రైలు రానుంది. ఈ మేరకు రైల్వేశాఖ త్వరలో ప్రవేశపెట్టేందుకు సిద్దమైంది. ఈ రైలుకు సంబంధించి రైల్వేశాఖ ఆమోదం తెలపగా.. టైమింగ్స్, టికెట్ ధరలను కూడా ప్రతిపాదించారు. ముంబై-బెంగళూరు మధ్య సర్వీసులు ఈ రైలు సర్వీసులు అందించనుంది.

Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్ ఫిక్స్.. టైమింగ్స్ కన్ఫామ్..! టికెట్ ధర ఎంతంటే..?
Vande Bharat
Venkatrao Lella
|

Updated on: Oct 05, 2026 | 10:41 AM

Share

ఏపీలోని రైల్వే ప్రయాణికులకు భారీ గుడ్ న్యూస్. ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ రైలు ప్రయాణించనుంది. దీంతో ఏపీ ప్రజలకు వందే భారత్ స్లీపర్ రైలు సౌకర్యం అందుబాటులోకి వస్తోంది. దేశంలోని తొలి వందే భారత్ స్లీపర్ హౌరా-గువహతి మధ్య ప్రవేశపెట్టగా.. రెండో రైలును బెంగళూరు-ముంబై మార్గంలో తీసుకురానున్నారు. ఈ రైలు ఏపీ మీదుగా వెళ్లనుంది. ఇప్పటికే ఈ రైలుకు సంబంధించి స్టాపులు, టైమింగ్స్, టికెట్ ధరల వివరాలు కూడా బయటకొచ్చాయి. ప్రస్తుతం బెంగళూరు-ముంబై మధ్య జర్నీకి 22 నుంచి 24 గంటల సమయం పడుతుంది. ఈ రైలు రాకతో ప్రయాణం సమయం 6 నుంచి 8 గంటలకు తగ్గుతుందని రైల్వే అధికారులు చెబుతున్నారు.

బెంగళూరు-ముంబై మధ్య త్వరలో వందే భారత్ స్లీపర్ ట్రైన్ ప్రవేశపెట్టేందుకు రంగం సిద్దమైంది. దక్షిణాది రాష్ట్రాల్లో ఇది వందే భారత్ స్లీపర్ రైలుగా నిలవనుంది. దీని వల్ల ముంబై-బెంగళూరు మధ్య 16 గంటల్లో ప్రయాణించవచ్చు. ప్రస్తుతం ఉన్న రైళ్ల వల్ల 24 గంటల వరకు పట్టగా.. ఈ సెమీ హైస్పీడ్ ట్రైన్ రాకతో 16 గంటలకు ప్రయాణ సమయం తగ్గుతుంది. ఈ రెండు ప్రాంతాల మధ్య దాదాపు 1137 కిలోమీటర్లు ఉంటుంది. ప్రస్తుతం డబుల్ ట్రాక్ ఉండగా.. విద్యుదీకరణ పూర్తిగా చేపట్టారు. ఈ ట్రాక్‌లో గంటకు 130 కిలోమీటర్ల వేగంతో రైళ్లను నడిపే సామర్థ్యం ఉంది. అందుకే వందే భారత్ స్లీపర్ రైలు సర్వీసులు నడిపేందుకు ఈ మార్గాన్ని రైల్వేశాఖ ఎంచుకుంది. రైల్వేశాఖ అధికారికంగా టైమ్ టేబుల్ ప్రకటించనప్పటికీ.. ప్రతిపాదిత షెడ్యూల్ బయటకొచ్చింది.

బెంగళూరు సర్ ఎం. విశ్వేశ్వరయ్య టెర్మినల్ రైల్వే స్టేషన్ నుంచి రాత్రి 7.50 గంటలకు బయల్దేరి మరుసటి రోుజు ఉదయం 11.55 గంటలకు ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్‌కు చేరుకుంటుంది. ఇక తిరుగు ప్రయాణంలో ముంబైలో రాత్రి 8.10 గంటలకు బయల్దేరి తర్వాతి రోజు ఉదయం 11.55 గంటలకు బెంగళూరుకు చేరుకుంటుంది. సుమారు 15 గంటల 45 నిమిషాల్లో ఇది చేరుకుంటుంది. ఈ రైలు ఏపీలో అనంతపురం, గుంతకల్‌లో ఆగనుంది. ఈ రైలు నెంబర్లు 27651, 27652గా నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఈ సర్వీస్ కోసం 16 కోచ్‌ల వందే భారత్ స్లీపర్ రైలు సెట్లను సిద్దం చేశారు. భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ (BEML) ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF) వీటిని తయారుచేసింది. 16 కోచుల్లో 11 కోచ్‌లు థర్డ్ ఏసీ కేటగిరీ ఉండనుండగా.. 4 కోచ్‌లు సెకండ్ ఏసీ ఉంటాయి. థర్డ్ ఏసీ టికెట్ ధర రూ.3 వేల వరకు ఉంటుందని తెలుస్తోంది. టికెట్ ధరలోనే బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్న భోజనం ఉంటుంది.

Follow Us