AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చూడటానికి అలా ఉంటుంది కానీ.. ఆమెకు పొగరెక్కువ..! సాయి పల్లవి నిజస్వరూపం ఇదే అంటున్న యంగ్ హీరో

లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి సినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్‌గా ఎదురుచూస్తున్నారు. మలయాళ ఇండస్ట్రీతో హీరోయిన్‌గా పరిచయం అయ్యింది సాయి పల్లవి. ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది ఈ ముద్దుగుమ్మ. తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది ఈ అమ్మడు.

చూడటానికి అలా ఉంటుంది కానీ.. ఆమెకు పొగరెక్కువ..! సాయి పల్లవి నిజస్వరూపం ఇదే అంటున్న యంగ్ హీరో
Sai Pallavi
Rajeev Rayala
|

Updated on: Aug 21, 2026 | 8:11 AM

Share

తెలుగమ్మాయి కాకపోయినా టాలీవుడ్ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న ముద్దుగుమ్మ సాయి పల్లవి, చూడటానికి అచ్చం మన పక్కింటి అమ్మాయిలా ఉండే ఈ అమ్మడు తన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. అదేవిధంగా తెలుగు చిత్ర పరిశ్రమలలో ఉన్న హీరోయిన్లలో తనకంటూ ప్రత్యేక స్థానం ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఫిదా సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది అందాల భామ సాయి పల్లవి. మొదటి సినిమాతోనే కుర్రకారును ఫిదా చేసి.. యూత్ ఫెవరేట్ హీరోయిన్ గా మారిపోయింది ఈ బ్యూటీ. గ్లామర్ షోలకు దూరంగా ఉంటూ అచ్చ తెలుగు అమ్మాయిల కనిపిస్తూ..కేవలం నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది.

తెలుగు ప్రేక్షకులు సాయి పల్లవిని లేడీ పవర్ స్టార్ అంటూ పిలుచుకుంటున్నారు. కేవలం ప్రేక్షకుల నుంచి మాత్రమే కాకుండా.. సినీ విశ్లేషకుల నుంచి కూడా ప్రశంసలు అందుకుంది సాయి పల్లవి.  ప్రస్తుతం సాయి పల్లవి వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. తెలుగులో చివరిగా తండేల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఇప్పుడు హిందీలో సినిమాలు చేస్తుంది. ప్రస్తుతం సాయి పల్లవి రామాయణం సినిమాలో నటిస్తూ బిజీగా ఉంది. ఈ సినిమాలో ఆమె సీతగా కనిపించనుంది. అయితే సాయి పల్లవి చాలా వరకు కాంట్రవర్సీలకు దూరంగా ఉంటుంది. తన సినిమాలు తాను చేసుకుంటూ పోతుంది. అయితే ఆమె పై ఓ యంగ్ హీరో షాకింగ్ కామెంట్స్ చేశాడు.

షూటింగ్ సెట్‏లో పొగరు చూపిస్తుందని.. ఆటిట్యూడ్ ఎక్కువని.. హీరోలతో ర్యాష్ గా మాట్లాడుతుందని ఓ హీరో షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఆ హీరో మరెవరో కాదు నాగశౌర్య. ఈ కుర్ర హీరో గతంలో సాయి పల్లవి గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు. శౌర్య, సాయి పల్లవి కలిసి కణం అనే సినిమా చేశారు. గతంలో నాగశౌర్య మాట్లాడుతూ.. తాను నటించిన హీరోయిన్స్ లో ఇరిటేషన్ తెప్పించిన హీరోయిన్ సాయి పల్లవి అని చెప్పాడు. అలాగే ఆమె ప్రవర్తన వేరుగా ఉంటుందని, షూటింగ్స్ కు ఆలస్యంగా వస్తుందని , పొగరుగా ప్రవర్తిస్తుందనే విధంగా నాగశౌర్య మాట్లాడాడు. దీని పై అప్పట్లోనే సాయి పల్లవి స్పందించింది.. “నా వలన ఎవరైన ఇబ్బంది పడుతున్నారు అని తెలిస్తే బాధగా ఉంటుంది. హీరో నాగశౌర్య నాపై కొన్ని కామెంట్స్ చేశాడు. అది విని నేను చాలా బాధపడ్డాను. వెంటనే కణం డైరెక్టర్ కు.. సినిమాటోగ్రాఫర్ కు కాల్ చేసి నా వలన మీకు ఇబ్బంది కలిగిందా. ? అని అడిగాను. వారు లేదు అని చెప్పడంతో మనసు కుదుటపడింది. ఇక శౌర్య అంటే నాకు ఇష్టం. నటన బాగుంటుంది. నాలో నచ్చిందే అందరు చెప్తారు. శౌర్య నాలో నచ్చనిది చెప్పాడు. దానిని పాజిటివ్ గానే తీసుకున్నాను.. నావలన తను ఇబ్బంది పడితే నేను బాధపడినట్లే .. నా సమాధానంతో తను సంతృప్తి చెందుతాడని అనుకుంటున్నాను ” అంటూ చెప్పుకొచ్చింది సాయి పల్లవి ఇది ఓల్డ్ కామెంట్స్ అయినప్పటికీ ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

View this post on Instagram

A post shared by Naga Shaurya (@actorshaurya)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us